Odisha : 7 రాష్ట్రాల్లో 14 మందిని పెళ్లి.. టార్గెట్ వారే.. చివరికి ఇలా..!

Odisha : 7 రాష్ట్రాల్లో 14 మందిని పెళ్లి.. టార్గెట్ వారే.. చివరికి ఇలా..!
Odisha : ఒకరికి తెలియకుండా ఒకరిని 7 రాష్ట్రాల్లో 14 మందిని మహిళలను పెళ్లాడిన నిత్యపెళ్లికొడుకుని భువనేశ్వర్‌లో పోలీసులు అరెస్ట్ చేశారు.

Odisha : ఒకరికి తెలియకుండా ఒకరిని 7 రాష్ట్రాల్లో 14 మందిని మహిళలను పెళ్లాడిన నిత్యపెళ్లికొడుకుని భువనేశ్వర్‌లో పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక వివరాల్లోకి వెళ్తే.. పై ఫోటోలో కనిపిస్తున్న ఇతని పేరు బిధు ప్రకాష్ స్వైన్‌(54).. ఒడిశాలోని కేంద్రపర జిల్లాకు చెందినవాడు.. 1982లో మొదటిసారి పెళ్లి అయింది. ఆ తర్వాత 2002లో మొదటి భార్యకి తెలియకుండా రహస్యంగా రెండో పెళ్లి చేసుకున్నాడు. ఇక అప్పటినుంచి ఇప్పటివరకు ఈ ఇరువై ఏళ్ల కాలంలో ఏడు రాష్ట్రాలలోని 14 మంది మహిళలను రహస్యంగా పెళ్లి చేసుకున్నాడు.

ముందుగా తనను తాను డాక్టర్‌గా పరిచయం చేసుకుంటూ మహిళలను మోసం చేస్తు్ంటాడు స్వైన్.... ఎక్కువగా ఇతని టార్గెట్ మధ్య వయసున్న మహిళలు, విడాకులు తీసుకున్న మహిళలే.. మ్యాట్రిమోనియల్‌ సైట్స్‌ ద్వారా కేంద్ర వైద్యారోగ్య శాఖలో ఉద్యోగినని వారికి ఎర వేస్తుంటాడు. ముఖ్యంగా ప్రవేటు, ప్రభుత్వ కార్యాలయాల్లో ఉన్నత స్థానంలో ఉన్న వారిని మాత్రమే సంప్రదిస్తాడు. కేవలం డబ్బు కోసమే ఇదంతా చేస్తుంటాడు. అవసరం తీరాక.. ఏదైనా పని నిమిత్తం బయటకు వెళ్తున్నానని చెప్పి మహిళలను వారి తల్లిదండ్రుల వద్ద వదిలి వెళ్లేవాడు.

అలా ఢిల్లీకి చెందిన ఓ టీచర్ ని 2021లో పెళ్లి చేసుకొని మోసం చేయగా ఆమె పోలీసులకి ఫిర్యాదు చేసింది. పోలీసుల విచారణలోనూ నిందితుడు నుంచి షాకింగ్‌ నిజాలను రాబాట్టరు పోలీసులు.. విచారణలో మ్యాట్రిమోనియల్ సైట్లు మరియు సోషల్ మీడియాలో పరిచయమైన మరో 13 మంది మహిళలను మోసగించినట్లు తేలింది. బాధితుల్లో సుప్రీంకోర్టులో ఒక న్యాయవాది, సీనియర్ సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ ఉన్నారు. 2018లో పంజాబ్‌కు చెందిన సీఏపీఎఫ్ అధికారిని పెళ్లి చేసుకుని దాదాపు అమె దగ్గర నుంచి రూ.10 లక్షల మేర మోసం చేశాడు.

అనంతరం గురుద్వారాకు చెందిన మహిళను పెళ్లి చేసుకొని ఆసుపత్రి మంజూరు చేస్తానని చెప్పి రూ.11 లక్షలను మోసం చేశాడు. ఇక స్వైన్‌‌‌ ఐదుగురు పిల్లలకు తండ్రి.. అతని వద్ద నుంచి 11 ఏటీఎం కార్డులు, నాలుగు ఆధార్ కార్డులు, ఇతర పత్రాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్, ఎర్నాకులంలో నిరుద్యోగ యువకులను మోసం చేయడం వంటి నేరాలలో కూడా బిధు ప్రకాష్ స్వైన్‌ గతంలో రెండుసార్లు అరెస్టయ్యాడని పోలీసులు తెలిపారు.

Tags

Read MoreRead Less
Next Story