Vikarabad: వికారాబాద్ బాలిక హత్య కేసులో ట్విస్ట్.. కన్నతల్లే ప్లాన్ చేసి..

Vikarabad: వికారాబాద్ బాలిక హత్య కేసులో ట్విస్ట్.. కన్నతల్లే ప్లాన్ చేసి..
Vikarabad: తెలంగాణలో సంచలనం రేపుతున్న వికారాబాద్ జిల్లా చిట్టంపల్లి బాలిక హత్యోదంతంలో కొత్త ట్విస్ట్ చోటుచేసుకుంది.

Vikarabad: తెలంగాణలో సంచలనం రేపుతున్న వికారాబాద్ జిల్లా చిట్టంపల్లి బాలిక హత్యోదంతంలో కొత్త ట్విస్ట్ చోటుచేసుకుంది. బాలిక తల్లి వివాహేతర సంబంధమే హత్యకు కారణమని పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. బాలిక తల్లిని అదుపులోకి తీసుకుని పోలీసులు విచారణ చేపట్టారు. అయితే విచారణలో ఆమె పొంతనలేని సమాధానాలు చెప్పింది.

బాలికను ఇంట్లోనే హత్య చేసి.. ఆ హత్యను ఉద్దేశపూర్వకంగా బాలిక ప్రియుడుపై మోపే ప్రయత్నం చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. మరోవైపు ఈ దారుణానికి ఒడిగట్టారని అనుమానిస్తున్న మహేందర్, అశోక్‌తో పాటు మరో వ్యక్తిని పోలీసులు అదుపులో తీసుకున్నారు. హత్య కేసులో ఎంత మంది హస్తం ఉందనే కోణంలో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. స్థానికంగా ఉన్న వారి నుంచి స్టేట్‌మెంట్ రికార్డు చేసుకున్నారు.

Tags

Read MoreRead Less
Next Story