క్రిమిసంహారక గుళికలు మింగి పోలీస్ స్టేషన్‌కి వెళ్ళిన రౌడీషీటర్‌

క్రిమిసంహారక గుళికలు మింగి  పోలీస్ స్టేషన్‌కి వెళ్ళిన రౌడీషీటర్‌

కర్నూలు జిల్లా సంజామల మండలం ముడిగెడు గ్రామంలో ఓ విషాద ఘటన జరిగింది. శివారెడ్డి అనే రౌడీషీటర్‌ క్రిమిసంహారక గుళికలు మింగి సంజామల పోలీస్ స్టేషన్ కి వెళ్ళాడు... ఎస్ఐని కలవాలని లోపలికి వెళ్తుండగా ఒక్కసారిగా తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. .. పోలీస్ స్టేషన్‌లో తనకు న్యాయం జరగలేదని అందుకే తాను విషగుళికలు మింగానని శివారెడ్డి చెప్పడంతో పోలీసులు ఆందోళనకు గురయ్యారు. వెంటనే అతన్ని కోయిలకుంట్ల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు .. పరిస్థితి విషమంగా ఉండడంతో నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లగా అక్కడ చికిత్స పొందుతూ శివారెడ్డి మృతి చెందాడు...

ముదిగేడు గ్రామానికి చెందిన శివారెడ్డి కుటుంబానికి గత మూడు రోజుల క్రితం అదే గ్రామానికి చెందిన ఆలీ , లక్ష్మి రెడ్డి కుటుంబాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది . ఈ ఘటనపై సంజామల పోలీసులు ఇరువర్గాలపై కేసు నమోదు చేశారు.. అయితే.. తమ తండ్రిని ప్రతిరోజు విచారణ పేరుతో వేధించడంతో తీవ్ర మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడ్డాడని ... మృతుడు శివారెడ్డి కుమారులు ఆరోపిస్తున్నారు.

అయితే.. మృతుడు శివారెడ్డి పై రౌడీ షీట్ ఉందని అందుకే పోలీస్ స్టేషన్ కు పిలిపించి విచారించామని పోలీసులు చెబుతున్నారు. గత ఎన్నికల్లో తమ కుటుంబం టిడిపికి అండగా ఉండటంతో వైసిపి పార్టీకి చెందిన ఆలీ ,లక్ష్మీ రెడ్డిలు పోలీసుల ద్వారా తమ తండ్రి శివారెడ్డిని వేధించారని అందుకే తమ తండ్రి ఆత్మహత్య చేసుకున్నాడని మృతుడి కుమారులు ఆరోపిస్తున్నారు

Tags

Read MoreRead Less
Next Story