Live News Now
 • నల్గొండ: 2019లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయం: అమిత్ షా
 • దక్షిణాదిలో బీజేపీ అధికారానికి తెలంగాణ ముఖద్వారం.. తెలంగాణ అభివృద్ధికి మోడి సర్కార్ కట్టుబడిఉంది
 • ఢిల్లీ: కవ్వింపుల పాక్ కు గుణపాఠం విరుచుకుపడ్డ భారత సైన్యం
 • ముంబై: దిగివచ్చిన పసిడి ధర రూ.28,915 పలికిన 22 క్యారెట్ల 10గ్రాముల బంగారం
 • రూ.315 పెరిగి రూ.39,815కి చేరిన కిలో వెండి
 • ఆప్ఘనిస్తాన్ లో ఉగ్రవాదుల ఘాతుకం.. ఆప్ఘాన్ సైనిక శిబిరం పై ముష్కరుల దాడి..
 • 10 మంది జవాన్లు మృతి, పలువురికి గాయాలు
 • బొగ్గు కుంభకోణం కేసులో నవీన్ జిందాల్ పై సీబీఐ చార్జిషీటు..
 • జిందాల్‌తో పాటు మరో నలుగురికి సమన్లు జారీ..
 • సెప్టెంబర్ 4న విచారణకు హాజరుకావాలని సమన్లు
ScrollLogo 13 పేజీల అఫిడవిట్ దాఖలు చేసిన ముస్లం లాబోర్డు ScrollLogo పత్తికొండ వైసీపీ ఇన్‌ఛార్జ్ చెరుకులపాడు నారాయణ రెడ్డి అంత్యక్రియలు.. అంత్యక్రియలకు హాజరైన జగన్ ScrollLogo ఢిల్లీ: కేజ్రీవాల్ పై రెండో పరువు నష్టం దావా వేసిన జైట్లీ... రూ.10 కోట్లకు పరువు నష్టం దావా వేసిన జైట్లీ ScrollLogo కేజ్రీవాల్‌కు నోటీసులు జారీ చేసిన హైకోర్టు.. జూలై 26న కోర్టుకు హాజరు కావాలని నోటీసులు ScrollLogo విజయవాడలో ఈ నెల 25న బూత్ కమిటీ సభ్యుల మహా సమ్మేళనం.. ScrollLogo సంస్థాగత నిర్మాణంలో పార్టీని బలోపేతం చేయడానికే ఈ కార్యక్రమం: కంభంపాటి హరిబాబు ScrollLogo కార్యకర్తలకు అమిత్ షా దిశానిర్ధేశం చేస్తారు ScrollLogo రేపు నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో టీడీపీ మినీ మహానాడు.. ఏర్పాట్లను పరిశీలించిన ఎల్.రమణ ScrollLogo మినీ మహానాడుకు చంద్రబాబు హాజరవుతారు.. టీటీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ ScrollLogo కడప: వైఎస్ రాజారెడ్డి 19వ వర్ధంతి సందర్భంగా పులివెందులలో నివాళులర్పించిన వైఎస్ జగన్
Lalu-Prasad-Yadav's-Daughter-Misa-Bharti's-CA-Arrested-By-Enforcement-Directorate
ఆర్జేడీ ప్రెసిడెంట్ లాలూ ప్రసాద్ యాదవ్ కుమార్తె మీసా భారతికి ఈడీ ఝలక్ ఇచ్చింది. ఆమె దగ్గర చార్టర్డ్ అకౌంటెంట్‌గా పని చేస్తున్న రాజేష్ అగర్వాల్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)అధికారులు అరెస్టు చేశారు. మనీలాండరింగ్ కేసులో రాజేష్ అగర్వాల్‌ను అరెస్టు చేసి ఢిల్లీలోని ఒక కోర్టులో ప్రవేశపెట్టారు. కాగా, న్యూఢిల్లీలో ఓ ఫాంహౌస్ కొనుగోలు చేసే నిమిత్తం ఒక షెల్ కంపెనీ ద్వారా మీసా భారతి మనీలాండరింగ్‌కు పాల్పడ్డారని బీజేపీ నేత సుశీల్ కుమార్ మోడీ ఇటీవలే ఆరోపించారు. ఆ కంపెనీ షేర్ల అమ్మకాలు, కొనుగోళ్లు పేరిట తన వద్ద బ్లాక్‌మనీగా మీసా భారతి మార్చుకున్నారని ఆయన ఆరోపించారు. ఈ ఆరోపణల నేపథ్యంలోనే ఆమె సీఏను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు అరెస్టు చేశారు.

టాలీవుడ్
 • 70mm-Entertainments-Prod-No:-2-Pre-Look-poster
 • sriramudinta-srikrishundudanta-release-date-poster
 • venkatapuram-poster
 • Amaram-Akhilam-Prema-Poster
 • keshava-movie-new-poster
సినీ గాసిప్స్
chaitanya-wants-to-act-with-samantha-once-again ప్రస్తుతం టాలీవుడ్ లో ఎక్కువ వార్తల్లో నిలిచే జంట సమంత, చైతులు.. వీరిద్దరి ప్రేమ, నిశ్చితార్ధం, పెళ్లి గురించి ఎప్పుడు వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది.. నిశ్చితార్ధం జరుపుకొన్న ఈ జంట అక్టోబర్ లో వివాహం చేసుకొనున్నట్లు చైతు ఇటీవల ఓ మీడియా ఇంటర్వ్యూలో తెలియజేశారు.. అంతేకాదు. చైతు, సామ్ కాంబినేషన్ లో వచ్చిన తొలిసినిమా ఏ మాయచేసావే లో జరిగినట్లు తమ పెళ్లి కూడా రెండు సార్లు జరుగుతుంది అని.. అంటే వివాహం హిందూ సంప్రదాయ ప్రకారం, అలాగే క్రిష్టియన్ మత ప్రకారం రెండు సార్లు జరుగుతుందని తెలిపాడు.. ఇక తమ హనీమూన్ 'ఏ మాయచేసావే' షూటింగ్ జరిపిన లండన్ లో జరుపుకోబోతున్నామని చెప్పాడు.. అంతేకాదు చైతు తనకు కాబోయే భాగస్వామి సమంత గురించి అనేక సంగతులను ఇష్టంగా పంచుకొన్నాడు.. తాను చాలా గోప్యంగా ఉంటానని.. కానీ సమంత అలా కాదు చాలా ఓపెన్ గా ఉంటుంది.. తాను సరదాగా వంట చేస్తే తనకు తెలియకుండా ఫోటోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది అని సమంత ఎప్పుడు అల్లరి చేస్తూనే ఉంటుంది అని చెప్పాడు.. అంతేకాదు సమంత కు అసలు వంట రాదని... ఎప్పుడూ జీవితాన్ని సరదాగా సంతోషంగా గడపడమే తెలుసు అని.. అంతేకాని వర్రీ, స్ట్రెస్, కుకింగ్ లాంటివి సమంతకు తెలియని విషయాలు అని చైతు నవ్వుతూ చెప్పాడు.. తామిద్దరం కలిసి మళ్ళీ ఓ ప్రేమ కధ సినిమాలో నటించాలని ఉందని.. తప్పకుండా కలిసి నటిస్తామని ఫ్యాన్స్ ఖుషీ అయ్యే వార్తను చెప్పాడు..

PV-Sindhu-to-have-a-guest-role-in-her-biopic? తెలుగు తేజం ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి.. ఒలింపిక్స్ రజత పతాక విజేత పీవీ సింధు జీవిత చరిత్రను వెండి తెరపై ఆవిష్కృతం కానున్నది. ఈ సినిమాను ప్రముఖ నటుడు సోనూ సూద్ నిర్మిస్తున్న సంగతి విధితమే.. కాగా ఈ బయోపిక్ లో సింధు కనీసం గెస్ట్ గా నటించినా సినిమాకు సార్ధకత చేకూరుతుందని సోనూ సూద్ భావిస్తున్నాడు.. ఇదే విషయాన్ని సోనూ సూద్ తెలియజేస్తూ... సింధు తన సినిమాలో నటించాలని కోరుకొంటున్నట్లు... హీరోయిన్ కాకపోయినా కనీసం అతిధిగా నటించనా ఒకే అని అన్నాడు. ప్రసుతమ్ స్క్రిప్ట్ పనులు జరుపుకొంటున్న ఈ సినిమా లో సింధు ఏ సన్నివేశంలో నటిస్తే బాగుంటుంది అని ఆలోచిస్తున్నా అని చెప్పాడు.. ఈ సినిమా సింధుపై బయోపిక్‌ బయోపిక్‌ కాబట్టి ఆమె కూడా ఉంటే సినిమా మరింత స్పెషల్‌గా ఉంటుందని భావిస్తున్నట్లు నిర్మాత సోనూ సూద్ తెలియజేశాడు.
Akhil's-second-movie-shooting-stalled అక్కినేని వారి చిన్నోడు అఖిల్ సెకండ్ సినిమా ప్రయాణం కూడా వాయిదాల పర్వం కొనసాగిస్తూ.. చివరకు ఒకే చేసుకొన్నది. తాజాగా అఖిల్ హీరోగా మనం దర్శకుడు విక్రమ్ కుమార్ దర్శకత్వంలో సినిమా షూటింగ్ మొదలైంది. శరవేగంగా షూటింగ్ జరుపుకొంటున్న ఈ సినిమా తో హిట్ కొట్టడం కోసం అఖిల్ చాలా కష్టపడుతున్నట్లు టాక్. కాగా ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ హీరో పై వచ్చే సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.. కాగా తాజాగా ఈ సినిమా షూటింగ్ కు బ్రేక్ పడినట్లుతెలుస్తోంది. అఖిల్ తో రొమాన్స్ చేసే హీరోయిన్ ఇంకా ఫైనల్ కానందున షూటింగ్ కు బ్రేక్ పడిందట. కాగా అఖిల్ కు జోడీగా నటించే హీరోయిన్ కోసం చాలా మంది బాలీవుడ్, టాలీవుడ్ హీరోయిన్ల పేర్లు వినిపించాయి.. కానీ ఎవరినీ ఫైంల్ చెయ్యలేదు.         
Sequel-for-Allu-Arjun's-Duvvada-Jagannadham-on-Cards? వరస హిట్స్ తో జోరుమీదున్న అల్లు అర్జున్ తాజాగా సినిమా దువ్వాడ జగన్నాథం.. హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ లాస్ట్ స్టేజ్ లో ఉన్నది.. ఇప్పటికే డీజే టైటిల్ సాంగ్ ను రిలీజ్ చేసిన యూనిట్ జూన్ 23 న రిలీజ్ సన్నాహల్లో ఉన్నది. కాగా ఈ సినిమా కు సీక్వెల్ చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు దర్శకుడు హరీష్ శంకర్ చెప్పాడనే టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే సీక్వెల్ కు సంబంధించిన కధను అల్లు అర్జున్ కు హరీష్ వినిపించడాని.. కంటెంట్ నచ్చడంతో బన్నీ ఒకే చెప్పడానే టాక్ వినిపిస్తోంది.. కానీ ఈ సినిమా సీక్వెల్ పట్టాలేక్కెది... డీజే సినిమా ఫలితం పై ఉంటుంది అని పలువురు అభిప్రాయం. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో పూజ హెడ్గే హీరోయిన్ గా నటిస్తోంది.
Mahesh-Babu-is-not-happy-with-Murugadoss అనుకున్నది ఒక్కటి జరుగుతున్నది మరొక్కటి. బ్లాక్ బస్టర్ అని, మార్కెట్ రేంజ్ పెరుగుతుందని మహేశ్ బాబు ఎన్నో ఊహించుకున్నాడు. ఇండస్ట్రీ కూడా చాలా ఎక్కువే ఎక్స్ పెక్ట్ చేసింది. కానీ ఇప్పుడు జరగుతున్నదంతా మరోలా ఉంది. స్పైడర్ పై భారీ హోప్స్ పెట్టుకున్న మహేశ్ ను మురుగదాస్ చిరాకు పెడుతున్నాడట. ఓపికకు పరిక్షలు పెడుతున్నాడట. దీంతో ప్రిన్స్ చాలా అసహనంగా ఉన్నాడట. మరి మహీ ఇంత ఇదైపోయేలా మురుగ ఏంచేశాడు? వివరాల్లోకి వెళ్తే..
మురగదాస్ పై మహేశ్ బాబు చాలా అసహనంగా ఉన్నాడట. తాను ఎంతో ఊహించుకుంటే మురగ తన ఆశలను నొక్కి పెడుతున్నాడని, తన ఫ్యాన్స్ ను హర్ట్ చేస్తున్నాడని ఫీలవుతున్నాడట. తెలుగు,తమిళ్ బైలింగ్వల్ మూవీ, మురుగదాస్ డైరెక్టర్.. ఇక ఆ సినిమా ఓరేంజ్ లో ఉంటుంది, కెరీర్ కు చాలా ప్లస్ అవుతుంది, కోలీవుడ్ లోనూ మార్కెట్ క్రియేట్ అవుతుందని చాలా ఎక్స్ పెక్ట్ చేశాడట మహేశ్. కానీ ఇప్పుడు జరుగుతుందా మరోలా ఉంది. దీంతో మహేశ్ లోలోపల చాలా సఫర్ అవుతున్నాడట.
మురుగదాస్-మహేశ్ కాంబినేషన్ లో స్టార్ట్ అయిన స్పైడర్ సినిమా ఈ సమ్మర్ లోనే రిలీజ్ కావల్సి ఉంది. ఏప్రిల్ 28న స్పైడర్ విడుదల అని యూనిట్ నుంచి వార్తలు కూడా వచ్చాయి. కానీ ఈ టైం కు షూటింగ్ కూడా ఫినిష్ చెయ్యలేదు మురుగ. తనకు కావల్సినట్లుగా అవుట్ పుట్ వచ్చేంత వరకు రీషూట్స్ చేస్తూ షెడ్యూల్స్ ని సాగదీస్తున్నాడు. దీంతో స్పైడర్.. జూన్, జూలై అంటూ ఆగస్ట్ మీదుగా ప్రయాణించి ఫైనల్ గా సెప్టెంబర్ రిలీజ్ దగ్గర ఆగిపోయింది. ఇదే మహేశ్ ను కలవరపెడుతోందట.
మహేశ్ బాబు స్పైడర్ ను సమ్మర్ లో దింపి బిగ్గెస్ట్ హిట్ కొట్టాలని ప్లాన్ చేసుకున్నాడు. మేనెలలలో కొరటాల శివతో కలిసి భరతను నేను సినిమాను స్టార్ట్ చెయ్యాలనుకున్నాడు. కానీ ఇప్పటికీ స్పైడర్ క్లైమాక్స్ షూటింగ్ లోనే ఉంది. సో సినిమా భరత్ ఇంకా మొదలుకాలేదు. దీంతో ప్రిన్స్ చాలా బాదపడుతున్నాడట. కానీ మురుగదాస్ ను మాత్రం స్పీడప్ చెయ్యమని అడగలేకపోతున్నాడట. ఇండియన్ సినిమాలో ఓ స్పెషల్ ఇమేజ్ ఉన్న దర్శకుడిని ఎందుకు క్వశ్చన్ చెయ్యడం అని సైలెంట్ గానే షూటింగ్ కు వెళ్తున్నాడట. అయినా మార్కెట్ పెంచుకోవాలి, బంపర్ హిట్స్ రావాలి అనుకున్నప్పుడు ఇలాంటి వెయిటింగ్స్ ను భరించకతప్పదు కదా.
Baahubali-2:-The-Conclusion-makes-box-office-history-in-Kerala బాహుబలి సినిమాతో ప్రభాస్ దేశ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకొన్నాడు.. ముఖ్యంగా మళయాళీలకు ప్రభాస్ మానియా పట్టుకుంది. ప్రభాస్ కటౌట్ తో పాటు బాహుబలి సినిమాలోని కంటెంట్ కి పిధా అయ్యింది మాలీవుడ్. ప్రభాస్ గురించి ఆరాతీసే నెట్ జెన్లు లలో కేరళ శాతం ఎక్కువుగా ఉందట. 1500కోట్లు సాధించిన తొలి ఇండియన్ సినిమా అవతరించిన బాహుబలి తెచ్చిన ఫేమ్ ప్రభాస్ ను అన్ని భాషలకు దగ్గర చేసింది. ఒక కొచ్చి లోనే మూడు కోట్లు వసూళ్ళు సాధించింది. మళయాళంలో 60 కోట్ల వసూళ్ళను సాధించి మరే తెలుగు సినిమా ఇప్పట్లో దరిచేరలేని మార్క్ సెట్ చేసింది బాహుబలి.. ఈ సినిమా సృష్టించిన ప్రభంజనం కు ప్రభాస్ ఇమేజ్ కేరళలో కూడా ఓ రేంజ్ లో పెరిగిపోయింది.. కాగా ఇప్పటికే కేరళ వాసులకు అల్లు అర్జున్ అంటే చాలా ఇష్టం అనే సంగతి విధితమే.. తాజాగా ఈ లిస్ట్ లో ప్రభాస్ కూడా చేరాడు..

అంబేద్కర్ యూనివర్సిటీ ద్వారా నేరుగా డిగ్రీ చదవాలనుకునే విద్యార్థులకు మరో అవకాశం కల్పించింది యూనివర్సిటీ.  ఇందు కోసం జులై 2న అర్హత పరీక్ష జరపనున్నారు.  మొదటి విడతలో అప్లై చేయలేకపోయినవారికి ఇప్పుడు మరో అవకాశం వచ్చింది.  దీని కోసం ఆన్‌లైన్ దరఖాస్తులు జూన్ 22 వరకు చేసుకోవచ్చు.  18 ఏళ్ళు నిండి, పదోతరగతి కూడా పూర్తి చేయని వారు నేరుగా అప్లైచేసుకోవచ్చు.  జులై 2న ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు.  ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు జరిగే ఈ పరీక్షకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చని వర్సిటీ వెల్లడించింది.  యూనివర్సిటీ వెబ్‌పోర్టల్  www.braouonline.in ద్వారా విద్యార్థులు పరీక్ష కేంద్రాన్ని ఎంచుకోవాల్సి ఉంటుంది.

 20 Apprentice-Vacancies-in-Govt-of-India-Press నాసిక్‌లోని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రెస్ యూనిట్‌లో 20 అప్రెంటిస్‌షిప్ ఖాళీల భర్తీకి ప్రకటన వెలువడింది.
ఖాళీలు: బుక్‌బైండర్ 10, ఆఫ్‌సెట్ మెషిన్ మిండర్ 5, ప్రోగ్రామింగ్ అండ్ సిస్టమ్ అడ్మినిస్ట్రేషన్ అసిస్టెంట్ (పీఏఎస్ఏఏ)1, డిప్లొమా ఇన్ ప్రింటింగ్ 4
అర్హతలు: సంబంధిత పోస్టులను అనుసరించి ఎనిమిది/పదోతరగతి లేదా తత్సమాన విద్యార్హత/ఐటీఐ కోపా ట్రేడ్/డిప్లొమా ఇన్ ప్రింటింగ్ టెక్నాలజీ
వయోపరిమితి: దరఖాస్తు తుది గడువు నాటికి 19 ఏళ్ల లోపు ఉండాలి.  రిజర్వేషన్ కేటగిరీ అభ్యర్థులకు వయోపరిమితిలో నిబంధనల మేరకు సడలింపు ఉంటుంది.
దరఖాస్తు చేరడానికి చివరి తేదీ: ఎంప్లాయిమెంట్ న్యూస్ ప్రకటన వెలువడిన 21 రోజుల్లోపు
పూర్తి వివరాలు వెబ్‌సైట్‌లో చూడొచ్చు
వెబ్‌సైట్:
www.dop.nic.in
Sri Visista Sri Visista
NRI Edition
AP News
Telangana News
Sports
Daily Specials