Live News Now
 • చెన్నై: కరుణానిధిని కలిసిన అజాద్, ముకుల్ వాస్నిక్
 • ఎన్నికల్లో డిఎంకె,కాంగ్రెస్ కలిసి పోటీ చేయాలని నిర్ణయం - గులాంనబీ ఆజాద్..
 • విజయవాడ: ఇందిరాగాంధీ స్టేడియంలో రెండో విడత బిసి రుణమేళా..
 • చంద్రన్న ఉపాధి పథకం ప్రారంభించిన సిఎం.....
 • ముంబైలో మేకిన్ ఇండియా వారోత్సవ సదస్సు...హాజరైన మంత్రి నారాయణ..
 • విజయవాడ: టిడిపిలో చేరాల్సిన అవసరం ఇంతవరకు రాలేదు - వైసిపి ఎమ్మెల్యే జలీల్ ఖాన్..
 • నారాయణ్ ఖేడ్ లో ముగిసిన ఉపఎన్నిక పోలింగ్...79 శాతం నమోదు..
 • ఈనెల 16న కౌంటింగ్..
 • తిరుపతి: తిరుమలలో కార్మికుల కోసం 6 పడకల ఆస్పత్రిని నిర్మిస్తాం - దత్తాత్రేయ..
 • ఏపిలో మొత్తం 8 ఈఎస్ఐ ఆస్పత్రులను ఏర్పాటు చేస్తాం - దత్తాత్రేయ..
ScrollLogo తమిళనాడులో డిఎంకె, కాంగ్రెస్ మధ్య పొత్తు ప్రయత్నాలు... ScrollLogo 2013 తర్వాత డిఎంకె తో కలిసి పోటీ చేసేందుకు కాంగ్రెస్ సమాయత్తం.. ScrollLogo జమ్ముకాశ్మీర్: పూంఛ్ లో అనుమానిత ఐఎస్ఐ ఏజెంట్ ను అరెస్ట్ చేసిన పంజాబ్ పోలీసులు.. ScrollLogo హైదరాబాద్: ఓయులో రెండు విద్యార్ధి సంఘాల మధ్య గొడవ.. ScrollLogo జెఎన్ యు నేత అరెస్ట్ కు నిరసనగా ఏఐఎస్ఎఫ్ ర్యాలి... ScrollLogo అరెస్ట్ ను సమర్ధిస్తూ ఏబివిపి కార్యక్రమం... ScrollLogo కర్నూలు: వీర జవాన్ ముస్తాక్ అహ్మద్ కుటుంబానికి రు.5లక్షల పరిహారం.. ScrollLogo ఇల్లు నిర్మించి ఇస్తామని ప్రకటించిన ఏపి ప్రభుత్వం... ScrollLogo ఛత్తీస్ గఢ్: బీజాపూర్ జిల్లాలో పోలీసులు,మావోల మధ్య ఎదురు కాల్పులు.. ScrollLogo ముగ్గురు మావోయిస్టులు మృతి
tv 5 news: militants attack in jammu kashmir జమ్ము కాశ్మీర్లో ఉగ్రవాదులు మరోసారి పంజా విసిరారు. కుప్వారా సరిహద్దు ప్రాంతంలో భద్రతాదళాలపై దాడి చేశారు. దీంతో జవాన్లు ఎదురు కాల్పులు జరిపారు. ఉగ్రవాదులు ఓ ఇంట్లోకి వెళ్లి దాక్కున్నారు. అక్కడి నుంచే భద్రతాదళాలపై కాల్పులు జరిపారు. ఇరు వర్గాల మధ్య చాలా సేపు ఎదురు కాల్పులు జరిగాయి. జవాన్ల కాల్పుల్లో ఐదుగురు ఉగ్రవాదుల హతమయ్యారు. శీతాకాలంలో పాకిస్తాన్ వైపు నుంచి సరిహద్దులు దాటి భారత్ లో చొరబడటానికి టెర్రరిస్టులు ప్రయత్నిస్తుంటారు. అయితే జవాన్లు అప్రమత్తంగా ఉండటంతో ఈసారి చొరబాటు యత్నం ఫలించ లేదు. భద్రతాదశాలు సకాలంలో స్పందించడంతో ఐదుగురు ముష్కరులు హతమయ్యారు.
టాలీవుడ్
 • tv 5 news: jathagaa valentines day wall poster
 • tv 5 news: krishnashtami release date wall poster
 • TV5 News: 'MALUPU' wall poster
 • TV5 News: 'VEERI VEERI GUMMADI PANDU' wall poster
 • TV5 News: 'krishna gadi veera prema katha' wall poster
సినీ గాసిప్స్
tv 5 news: chiranjeevi's daughter srija wedding arrangements మెగాస్టార్ చిరంజీవి రెండో కూతురు శ్రీజ ప్రేమ పెళ్లి వ్యవహారం లో ఎన్నో మలుపులు చోటు చేసుకున్నాయి. చివరికి ఆ ప్రేమ పెళ్లి ఒక కూతురు పుట్టిన తర్వాత విడాకులతో ముగిసింది. కాగా ప్రస్తుతం చిరు శ్రీజ కు రెండో పెళ్లి చేయనున్నారనే వార్త హల్ చల్ చేస్తోంది. కానీ పెళ్ళికి సంబంధించిన విషయంపై అధికారిక ప్రకటన వెలువడలేదు. కానీ మెగా ఫ్యామిలీలో పెళ్లి సందడి మొదలైందని కానీ మెగా ఫ్యామిలీ కాబోయే అల్లుడు విషయం బయటకు వెల్లడించడానికి ఇష్ట పడడం లేదు. కానీ ప్రముఖులకు సంబంధించిన పెళ్లి విషయం కనుక ఎంత రహస్యంగా ఉంచుదామనుకొంటే.. వేగంగా బయటకి లీక్ అవుతాయి. చిరు కాబోయే వ్యక్తి పేరు వివరాలు సన్నిహితుల ద్వారా బయటకు వెల్లడయ్యాయి.
శ్రీజ పెళ్లి చేసుకోబోయే వ్యక్తి పేరు కళ్యాణ్... శ్రీజ, కళ్యాణ్ లు క్లాస్ మేట్స్ ఆట. దీంతో తన గురించి అన్నీ తెలుసున్న వ్యక్తి ఐతే బాగుంటుందని శ్రీజ ఈ పెళ్లి కళ్యాణ్ ను పెళ్లి చేసుకొనేందుకు అంగీకరించిందట. కాగా కళ్యాణ్ చిత్తూరు జిల్లాకు చెందిన వ్యాపార వేత్త కిషన్ కుమారుడని అంటున్నారు. యూఎస్ లో బిజినెస్ మెన్ గా సెటిల్ అయ్యాడ. వీరిద్దరూ పెళ్లి చేసుకోవడానికి అంగీకరించడంతో ఇరు కుటుంబాలు పెళ్లి ఏర్పాట్లలలో ఉన్నట్లు టాక్. ఇప్పటికే శ్రేజ చేతి నిండా గాజులతో చీరతో సంప్రదాయం ఉన్న ఫోటో ఒక బయటకు వచ్చింది. కాగా ఇప్పుడు చిరు ఇంట్లో పెళ్లి సందడి మొదలైన ఫోటో ఒకటి బయటకు వచ్చింది. కాగా ఈ ఫోటో శ్రేజ నిశ్చితార్ధం వేడుకకు సంబంధించిందని తెలియవస్తుంది. తన ఇంట ప్రస్తుతం జరిగే చివరి వివాహ మహోత్సవం కనుక ఈ వివాహాన్ని చాలా గ్రాండ్ గా చేయడానికి చిరు నిర్ణయించారట. ఈ పెళ్లి విషయం పై త్వరలో అధికారికంగా ప్రకటన వెలువడనున్నది.

TV5 News: Two Mega heroes in one film

ఆ మధ్య ఎవడు సినిమాలో మెగా హీరోలు రామ్ చరణ్ , అల్లు అర్జున్ కలిసి నటించిన సంగతి తెలిసిందే. మెగా అభిమానులకు  ఆ సినిమా ఓ పండుగ అయింది. ఈ క్రమంలో ఇప్పుడు మెగా ఫ్యామిలీకి చెందిన మరో ఇద్దరు హీరోలు కలిసి ఓ చిత్రంలో నటిస్తుండడం విశేషం. పటాస్ ఫేం అనిల్  రావిపూడి దర్శకత్వంలో సాయిధరమ్ తేజ్ హీరోగా దిల్ రాజు తాజాగా సుప్రీం పేరిట ఓ చిత్రాన్ని నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో గెస్టు గా కనిపించే ఓ ముఖ్య పాత్ర ఉండడంతో అందుకోసం బన్నీ సోదరుడు శిరీష్ ని సంప్రదించగా, చేయడానికి అతను హ్యాపీగా ఒప్పుకున్నాడట. దాంతో ఈ సినిమాకి మరింత క్రేజ్ వస్తుందని నిర్మాత ఆశిస్తున్నాడు. సాయి, శిరీష్ మధ్య వచ్చే సన్నివేశాలను త్వరలో చిత్రీకరిస్తారు. కాగా, ఈ సినిమాలో రాశీఖన్నా హీరోయిన్ గా నటిస్తోంది. 


lavanya tripathi shocks taapsee pannu
అసలే మంచి అవకాశాలు లేక ఇబ్బంది పడుతోన్న తాప్సీకి భలే భలే మగాడివోయ్‌తో ఫాంలోకి వచ్చిన చిన్నది లావణ్యా త్రిపాఠి షాక్ ఇచ్చింది. భలే భలే మగాడివోయ్‌తో పాటు  సోగ్గాడే చిన్ని నాయనా చిత్రం కూడా కలిసి రావడంతో లావణ్య దశ మారిపోయింది. ఆ రెండు సినిమాల తర్వాత వచ్చిన 'లచ్చిందేవికి ఓ లేక్కుంది' కాస్త దెబ్బ కొట్టినా సరే లావణ్యకు మాత్రం ప్రస్తుతం అవకాశాలు బాగానే వస్తున్నాయి. తాజాగా ఈ సుందరికి సందీప్ కిషన్ హీరోగా మలయాళ  సూపర్ హిట్ 'నేరం' తెలుగు రీమేక్‌లో ఛాన్స్ వచ్చింది. అయితే ఇందులో ముందుగా తాప్సీని తీసుకున్నారట. అయితే ఏమైందో తెలియదు కానీ ఆ ప్లేస్‌లోకి లావణ్య వచ్చి చేరింది. దీనితో పాటు ప్రస్తుతం అల్లు శిరీష్ సినిమాలోనూ ఆడిపాడుతోంది. హీరోగా తెరకెక్కుతున్న చిత్రంలో కూడా హీరోయిన్ గా నటిస్తోంది.
Rajasekhar Turns Villain For Director Teja
హీరోగా సక్సెస్‌లు లేకపోవడంతో.. ఇప్పుడు సీనియర్లు అంతా జగపతి బాటలో నడుస్తున్నారు. అంటే విలన్లుగా మారిపోతున్నారు. తాజాగా మరో సీనియర్ హీరో రాజశేఖర్ కూడా విలన్‌గా చేసేందుకు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. చాలా కాలంగా సరైన హిట్స్ లేక ఇబ్బంది పడుతోన్న రాజశేఖర్ ఇప్పుడు బాగా ఆలోచించి విలన్‌గా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని టాక్. అది కూడా అసలు ఫాంలో లేని, సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన దర్శకుడు తేజతో. అధికారికంగా ప్రకటించనప్పటికీ తేజ విలన్ రాజశేఖర్ అని వార్తలు వస్తున్నాయి. మరి విలన్‌గా అయినా రాజశేఖర్ హిట్ కొట్టి సెకండ్ ఇన్నింగ్స్ హ్యాపీగా స్టార్ట్ చేస్తాడా అన్నది తెలియాలంటే కొంత కాలం ఆగాల్సిందే. 

ఇప్పుడు అంతా పరీక్షల కాలం. తాజాగా.. ఇంటర్మీడియట్ ప్రాక్టికల్స్ ఎగ్జామ్స్ ప్రారంభమయ్యాయి. ప్రాక్టికల్ ఎగ్జామ్స్ పేరుతో ప్రైవేట్ కాలేజీలు వసూళ్ల దందాకు తెరతీశాయి. నల్గొండ జిల్లాలో వేలకువేలు ఫీజులు దండుకున్న కాలేజీలు..ఇప్పుడు ప్రాక్టికల్ ఫీజులు వసూలు చేస్తుండటంతో విద్యార్థులు లబోదిబోమంటున్నారు.

నల్గొండ జిల్లా మిర్యాలగూడలో దాదాపు 15 ఇంటర్మీడియట్ కాలేజీలున్నాయి.  ఏ కాలేజీలోనూ ప్రాక్టికల్స్ కు అవసరమైన ల్యాబ్స్, ఎక్విప్ మెంట్, నిపుణులైన అధ్యాపకులు ఉండరు. కేవలం.. పేపర్ల మీద మాత్రమే ఈ తతంగమంతా జరుగుతుంటుంది. సీనియర్ ఇంటర్లో ఫిజిక్స్, కెమిస్ట్రీ ప్రాక్టికల్ ఎగ్జామ్స్ తూతూమంత్రంగా నిర్వహిస్తుంటారు. కాసులు ముట్టచెబితే విద్యార్థులను పాస్ చేస్తుంటారు. 

నల్లగొండ జిల్లాలోని.. నల్లగొండ, మిర్యాలగూడా, భువనగిరి, సూర్యాపేట్, దేవరకొండ, కోదాడ ప్రాంతాల్లోని ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలన్నీ.. అధికారులతో కుమ్మక్కయ్యారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రాక్టికల్ ఎగ్జామ్ ఫీజు ప్రభుత్వం నిర్ణయించిన ఫీజు 350రూపాయలైతే..రెండున్నర నుంచి మూడువేల వరకు వసూలు చేస్తున్నారు. కాలేజీల దోపిడీపై ఇంటర్ బోర్డ్ అధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేదని విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి. 

ప్రాక్టికల్స్ ఎగ్జామ్ పేరుతో వేలకువేలు దండుకుంటుండటంపై విద్యార్థుల తల్లిదండ్రులు మండిపడుతున్నారు. ఎలాంటి మౌలిక సదుపాయలు లేకుండా.. రేకుల షెడ్లలో తరగతులు నిర్వహిస్తోన్నా.. ఇంటర్ బోర్డ్ అధికారులు పట్టించుకోకపోవడంపై ఫైరవుతున్నారు. 

మరోవైపు..తెలంగాణ ప్రభుత్వం జబ్లింగ్ విధానంలో ప్రాక్టికల్ పరీక్షల నిర్వహిస్తామన్నప్పటికీ.. ప్రైవేట్ కాలేజీ యాజమాన్యాల ఒత్తిడితోనే ఆ నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నట్లు తెలుస్తోంది. దీంతో.. విద్యార్థులనుంచి లక్షల రూపాయలు ఫీజుల రూపంలో వసూల్ చేస్తోన్న సదరు కాలేజీ మెనేజ్ మెంట్లు..మౌళిక సదుపాయల కల్పనలో పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

Study Time మనదేశంలో తెలుగు రాష్ట్రాల్లో అనేకమంది తల్లితండ్రులకు, విద్యార్థులకు IIT JEEచదవాలనే లక్ష్యం ఉంటుంది. దానికోసం ఎటువంటి ఫౌండేషన్ కావాలి..? ఏ ఇనిస్టిట్యూట్ లో జాయిన్ అవ్వాలి..? ప్రిపరేషన్ ఎలా ఉండాలి..? అసలు IIT JEEకి ఎప్పటి నుంచి ప్రిపేర్ అవ్వాలి..? ఏ ఇనిస్టిట్యూట్ లో జాయిన్ అయితే..IIT JEEలో మంచి ర్యాంక్ సాధించవచ్చు..? లాంటి అనేక సమాధానాలు లేని ప్రశ్నలు..ఇటువంటి అనేక ప్రశ్నలకు సమాధానం లభించాలనే నిశ్చయంతో ఎంతోమందిని IITయన్లుగా తీర్చిదిద్దిన అపార అనుభవం కలిగిన రాధాకృష్ణ, వంశీకృష్ణల ఆధ్వర్యంలో పుట్టుకొచ్చిన సంస్థ వెలాసిటీ IIT JEE అకాడమీ..ఈ సంస్థ డైరెక్టర్స్ రాధాకృష్ణ మరియు వంశీకృష్ణ గారు మన స్టూడియోకి వచ్చేశారు. వారిని అడిగి పూర్తి వివరాలు తెలుసుకుందాం.
medplus offer
NRI Edition
AP News
Telangana News
Pata
Super Movie
Sports
Daily Specials