Live News Now
 • హైదరాబాద్ లో టాటా-ఏఐజి టెక్నాలజీ డెవలప్ మెంట్ సెంటర్ ఏర్పాటు..
 • డబుల్ బెడ్ రూమ్ పథకంలో భాగస్వామ్యానికి టాటా గ్రూప్ అంగీకారం..
 • విజయవాడ: ముద్రగడను అభినందిస్తున్నా ..దీక్ష విరమించడం సంతోషం- సిఎం చంద్రబాబు..
 • తుని ఘటనలో అమాయకులపై ఎటువంటి చర్యలు వుండవు - చంద్రబాబు..
 • చిరంజీవి ఎందుకు పార్టీ పెట్టారు? కాపులకోసం ఏం చేశారు? ...
 • వెనకబడిన వర్గాలకు అన్యాయం జరగకుండా కాపులను బిసిల్లో చేర్చుతాం- చంద్రబాబు
 • హైదరాబాద్: కుషాయిగూడ ఎన్ఎఫ్ సిలో కూలిన భవనం..ఇద్దరు మృతి.ఏడుగురికి గాయాలు..
 • హైదరాబాద్: హిమాయత్ నగర్ లో కాల్పుల కలకలం.. ఇద్దరు డాక్టర్ల మద్య ఘర్షణ..
 • డాక్టర్ ఉదయ్ పై డాక్టర్ శశికుమార్ కాల్పులు.. తీవ్ర గాయాలు.. ఆస్పత్రికి తరలింపు..
 • లారియల్ ఆస్పత్రి లావాదేవీలకు సంబంధించి డాక్టర్ల మధ్య గొడవ..
ScrollLogo 12 వ తేదీకి బదులు మరో తేదీని పరిశీలిస్తున్న ప్రభుత్వం.. ScrollLogo రంగారెడ్డి: డిసిసి అధ్యక్షుడు క్యామ మల్లేష్ రాజీనామా... ScrollLogo గ్రేటర్ ఎన్నికల్లో ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా.. ScrollLogo హైదరాబాద్: ఈనెల 15లోపు జిల్లాల అధ్యక్షులను ఎన్నుకుంటాం - బిజెపి ఎమ్మెల్సీ రామచంద్రరావు ScrollLogo ఫ్రిబ్రవరి మూడో వారంలో రాష్ట్ర అధ్యక్షుడి ఎన్నిక.. ScrollLogo రాష్ట్ర అధ్యక్షుడి రేసులో చాలామంది వున్నారు.. అందరి నిర్ణయం మేరకే అధ్యక్షుడి ఎన్నిక.. ScrollLogo తిరుపతి: టిటిడి డిప్యూటి ఈవో భూపతిరెడ్డి ఇంట్లో ఏసిబి తనిఖీలు.. ScrollLogo ఆదాయానికి మించి ఆస్తులున్నాయన్న ఆరోపణలతో సోదాలు.. ScrollLogo బెంగుళూరు,తిరుపతిలో కోట్లాది రూపాయల ఆస్తులు గుర్తించాం - ఏసిబి డిఎస్పి శంకర్ రెడ్డి ScrollLogo ముంబై: టాటా గ్రూప్ ఛైర్మన్ సైరస్ మిస్త్రీని కలిసిన మంత్రి కెటిఆర్..
indo-china-military-drill
ఇండో-చైనా మధ్య సరిహద్దు స్నేహం చిగురిస్తోంది. ఇరు దేశాల ఆర్మీదళాలు ఉమ్మడిగా వాస్తవాధీన రేఖ నిర్వహణపై దృష్టి సారించాయి. ఇప్పటికే జాయింట్‌ టాక్టికల్‌ ఎక్సర్‌సైజ్‌ చేపట్టాయి.

ఇండో - చైనా సరిహద్దులోని వాస్తవాధీన రేఖ వెంబడి ఉద్రికత్తలు తగ్గుతున్నాయి. గతంలో చైనా బలగాలు చొరబాట్లకు పాల్పడింది. భారత్‌ బలగాలు కూడా తిప్పికొట్టేందుకు ప్రయత్నించాయి. దీంతో ఇరు దేశాల బోర్డర్‌లో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. అయితే కొంతకాలంగా ఇరు దేశాలు సరిహద్దులో శాంతి యుత వాతావరణం నెలకొల్పేందుకు చర్చలు చేపట్టాయి. సరిహద్దు నిర్వహణపై దృష్టి సారించాయి.

తొలిసారిగా ఇండో-చైనా సరిహద్దు భద్రతా బలగాల మధ్య స్నేహపూర్వక వాతావరణం ఏర్పడింది. లడక్‌ సరిహద్దులో ఉమ్మడిగా మాక్‌ డ్రిల్‌ నిర్వహించాయి. భారత్‌- చైనా దేశాల సైనికులు కలిసి ఉమ్మడి ఆపరేషన్‌ చేపట్టడం ఇదే తొలిసారి. ఫిభ్రవరి 6న జరిగిన ఈ మాక్‌ డ్రిల్‌లో భారత్‌కు చెందిన 30 మంది ఆర్మీ బృందం పాల్గొంది. తీవ్రవాదుల చోరబాట్లు, ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు ఎలా ఎదుర్కోవాలో రెండు దేశాల ఆర్మీ బృందాలు మాక్‌ ఆపరేషన్‌ చేపట్టాయి. విపత్తులను ఎదుర్కోవడంతో పాటు.. సరిహద్దులో ఉండే ఇరు దేశాల బలగాల మధ్య స్నేహపూర్వక వాతావరణం నెలకొల్పడం కూడా దీని లక్ష్యమని రక్షణ శాఖ వర్గాలు తెలిపాయి.

ఇండో-చైనా మధ్య 3వేల 488 కిలోమీటర్ల సరిహద్దు ఉంది. ఈ వాస్తవాధీన రేఖ వెంబడి జాయింట్‌ టాక్టికల్‌ ఎక్సర్‌సైజ్‌కు రెండు నెలల క్రితమే బీజం పడింది. నార్త్‌ ఆర్మీ దళ కమాండర్‌ డిఎస్‌ హుడా చైనా పర్యటించారు. అక్కడి భద్రతాధికారులతో సరిహద్దు నిర్వహణపై చర్చించారు. అప్పుడే జాయింట్‌ టాక్టికల్‌ ఎక్సర్‌సైజ్‌ల ఆవశ్యకత గుర్తించారు. ఇరుదేశాలు సరిహద్దులో ఒక్కటిగా ఉంటే.. తీవ్రవాదులకు గట్టి సంకేతాలు పంపినట్టు అవుతుంది. అదే సమయంలో శాంతియుత వాతావరణం ఏర్పడుతుందని ఇరు దేశాలు గుర్తించాయి.
TRAI Rules in Favour of Net Neutrality - Trai Rejects Differential Pricing
ఫేస్ బుక్ ఫేస్ మాడిపోయే నిర్ణయమది. ఇంటర్నెట్ స్వేచ్ఛని కాపాడడంలో కీలక  ముందడుగు పడింది. ఫ్రీ బేసిక్స్ పేరుతో ఇంటర్నెట్ స్వేచ్ఛకు గండికొట్టే ప్రయత్నాలకు  చెక్ పడింది. ఒకే టారిఫ్ కింద.. వాడే కంటెంట్ ని బట్టి వేర్వేరు ఛార్జీ వసూలు  చెయ్యాలనుకున్న కుట్రదారుల చెంప చెల్లుమనిపించింది టెలికం నియంత్రణ సంస్థ  ట్రాయ్. 

ఫేస్ బుక్, ట్రాయ్ మధ్య వివాదానికి ఫుల్ స్టాప్ పడింది. ఫ్రీ-బేసిక్స్ పేరుతో భారత  కమ్యూనికేషన్ల రంగంలో పాగా వేద్దామనుకున్న ఫేస్ బుక్ కు పెద్ద షాకిచ్చింది టెలికం  రెగ్యులేటరీ అథారిటీ. డిఫరెన్షియల్ ప్రైసింగ్ పై అసలు చర్చే అవసరం లేదంటూ ఫ్రీ  బేసిక్స్ ప్రతిపాదనని నిర్ద్వంద్వంగా తోసిపుచ్చింది. ఇది నెట్ న్యూట్రాలిటీని  హరించడమే అంటున్న ట్రాయ్.. ఇంటర్నెట్ వినియోగంలో ప్రజలకు పూర్తి స్వేచ్ఛ  ఉండాల్సిందే అని స్పష్టం చేసింది. 

భారత్ లోని గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికీ ఇంటర్నెట్ వినియోగం ఏమాత్రం  పెరగలేదని.. వారికి ఆ సేవల్ని ఉచితంగా అందిస్తామంటూ ముందుకొచ్చింది ఫేస్ బుక్.  ఫ్రీ బేసిక్స్ ప్లాన్ కింద దాదాపు 30 వెబ్ సైట్లను ఫ్రీగా యాక్సెస్ చెయ్యొచ్చని చెప్తోంది.  ఇందుకోసం కిందటేడాదే రిలయన్స్ కమ్యూనికేషన్స్ తో ఒప్పందం కూడా  కుదుర్చుకుంది. అప్పట్లో దీనిపై పెద్ద దుమారం రేగింది. ఫ్రీబేసిక్స్ మాదిరిగానే ఎయిర్  టెల్ కూడా ఎయిర్టెల్ జీరో పేరుతో అదే బాటలో పయనించేందుకు సిద్దమైనా.. తీవ్ర  వ్యతిరేకత రావడంతో వెనక్కి తగ్గింది. ఈ రెండు పరిణామాల తర్వాత నెట్  న్యూట్రాలిటీపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఇంటర్నెట్ వినియోగంలో కస్టమర్ కు  పూర్తి స్వేచ్ఛ ఉండాల్సిందేనన్న డిమాండ్ కు దేశవ్యాప్త మద్దతు లభించింది. 

అటు ఫేస్ బుక్ మాత్రం తన ప్రయత్నం ఆపలేదు. ఫ్రీబేసిక్స్ కు మద్దతు  సంపాదించేందుకు భారత్ లో పెద్దఎత్తున క్యాంపెయినింగ్ చేసింది. పత్రికల్లో ఫుల్ పేజీ  యాడ్స్, టీవీ కమర్షియల్స్ తోపాటు దేశవ్యాప్తంగా అన్ని ప్రధాన నగరాల్లో హోర్డింగ్స్  తో ప్రచారం చేసింది. దాని వెనుక దాగిఉన్న కుట్రలపై దేశవ్యాప్తంగా చర్చ జరగడంతో  తగిన మద్దతు సంపాదించలేకపోయింది. అటు ట్రాయ్ దీనిపై మేధావి వర్గాలతో  బహిరంగ చర్చలు జరిపింది. ఒకే టారిఫ్ కింద.. వాడే కంటెంట్ ని బట్టి వేర్వేరు ఛార్జీల్ని  వసూలు చెయ్యాలనుకోవడం ఇంటర్నెట్ స్వేచ్ఛకు విఘాతం కల్గించడమే అని  తేల్చింది. ఇలాంటి ఆఫర్లు ఏ కంపెనీ ప్రవేశపెట్టకూడదని ఆదేశించింది. నెట్  న్యూట్రాలిటీని హరించే ఇలాంటి ప్రయత్నాలను ఉపేక్షించేది లేదంది. కాదని అలాంటి  ఒప్పందాలు కుదుర్చుకుంటే 50వేల నుంచి 50 లక్షల దాకా జరిమానా చెల్లించాల్సి  ఉంటుందని హెచ్చరించింది. 
టాలీవుడ్
 • GARAM
 • KVPG 4 Days to Go
 • Dictator 25 days poster
 • TV5 News: 'krishna Gadi Veera Prema Katha' wallposter
 • tv 5 news: rani gari bangala movie logo launch
సినీ గాసిప్స్
tammareddy bharadwaja controversial comments on rajashekar తన కెరీర్ నాశనం అవ్వడానికి కారణం రాజశేఖరే అంటూ ఒకప్పటి స్టార్ ప్రొడ్యూసర్ తమ్మారెడ్డి భరద్వాజ సంచలన వ్యాఖ్యలు చేశారు. 1995లో రాజశేఖర్ హీరోగా తమ్మారెడ్డి స్వీయ దర్శకత్వంలో ఆయనే నిర్మంచిన చిత్రం వేటగాడు. బాలీవుడ్ మూనీ 'బాజీగర్'కు రీమేక్‌గా ఆ సినిమా చేశారు. అయితే ఆ సినిమా పెద్ద డిజాస్టర్‌గా నిలిచింది. తీవ్ర నష్టాలపాలైన తమ్మా రెడ్డి ఏడాది పాటు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారట. అయితే అది రాజశేఖర్ తప్పు కాదని ఆయన అన్నారు. రాజశేఖర్ మేనరిజం తెలిసి కూడా ఆయనతో సినిమా చేశానని, ముందుగా దాన్ని శ్రీకాంత్‌తో చేయాలని అనుకున్నానని తెలిపారు. జీవిత, రాజశేఖర్ కోరడం వల్ల ఆ సినిమా చేశానని, అదే తన జీవితంలో పెద్ద తప్పు అని అన్నారు. 
TV5 News: ramgopal varma comments on pavan kalyan

టాలీవుడ్ టాప్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పై సెన్సెషనల్ డైరెక్టర్ రాంగోపాల్ వర్మ సెటైర్లు సంధించారు. కాపులకు రిజర్వేషన్ల విషయమై స్పందించడానికి ఇటీవల పవన్ కళ్యాణ్ మీడియా ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. పవన్ ప్రసంగం పై తాజగా వర్మ తనదైన శైలిలో స్పందించారు. 

అసలు మీడియా సమావేశంలో పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలు ఆయనకైనా అర్ధమయ్యాయా అంటూ వర్మ ప్రశ్నించారు. ప్రెస్ మీట్ కు వచ్చేటప్పుడు తన పక్కనున్న వ్యక్తి చెప్పిన మాటలనే పవన్ కళ్యాణ్ వల్లే వేశారని వ్యాఖ్యానించారు. అయినా జనసేనపార్టీ ఆవిర్భావం సందర్భంగా చేసిన ప్రసంగాన్ని పవన్ మరోమారు చూసుకోవాలని వర్మ సూచించారు. ప్రజారాజ్యం పార్టీ స్థాపించిన చిరంజీవి ఆ తర్వాత విఫలమైన దానికంటే, ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఘోరంగా విఫలమయ్యారని కూడా ఆయన ఆరోపించారు. పవన్ కళ్యాణ్ అభిమానిగా తాను వ్యక్తపరచిన నిజాలను వ్యతిరేకించే వారెవరైనా తన దృష్టిలో నమ్మక ద్రోహులేనని కూడా వర్మ తేల్చేశారు. 

తెలంగాణ రాష్ట్రంలో పోలీసు ఉద్యోగాల కోస ఎదురుచూస్తున్నా అభ్యర్దులకు శుభవార్త. ఈ మేరకు 510 ఎస్ఐ పోస్టులకు నోటిఫికేషన్ రిలీజైంది. ఇందులో సివిల్ విభాగంలో 201, ఏఆర్ విభాగంలో 74, టీఎస్ఎస్పీ విభాగంలో 205, ఎస్పీఎఫ్ విభాగంలో 12, ఎస్ఏఆర్ సీపీఎల్ విభాగంలో 2 ,తొమ్మిది స్టేషన్ ఫైర్ ఆఫీసర్లకు నోటిఫికేషన్ విడుదలైంది. దరఖాస్తులను ఈ నెల 10 నుంచి మార్చి 3 వరకు ఆన్ లైన్ లో స్వీకరిస్తారు. ప్రిలిమినరీ రాత పరీక్ష ఏప్రిల్ 17న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు జరుగుతుంది. 


Study Time మనదేశంలో తెలుగు రాష్ట్రాల్లో అనేకమంది తల్లితండ్రులకు, విద్యార్థులకు IIT JEEచదవాలనే లక్ష్యం ఉంటుంది. దానికోసం ఎటువంటి ఫౌండేషన్ కావాలి..? ఏ ఇనిస్టిట్యూట్ లో జాయిన్ అవ్వాలి..? ప్రిపరేషన్ ఎలా ఉండాలి..? అసలు IIT JEEకి ఎప్పటి నుంచి ప్రిపేర్ అవ్వాలి..? ఏ ఇనిస్టిట్యూట్ లో జాయిన్ అయితే..IIT JEEలో మంచి ర్యాంక్ సాధించవచ్చు..? లాంటి అనేక సమాధానాలు లేని ప్రశ్నలు..ఇటువంటి అనేక ప్రశ్నలకు సమాధానం లభించాలనే నిశ్చయంతో ఎంతోమందిని IITయన్లుగా తీర్చిదిద్దిన అపార అనుభవం కలిగిన రాధాకృష్ణ, వంశీకృష్ణల ఆధ్వర్యంలో పుట్టుకొచ్చిన సంస్థ వెలాసిటీ IIT JEE అకాడమీ..ఈ సంస్థ డైరెక్టర్స్ రాధాకృష్ణ మరియు వంశీకృష్ణ గారు మన స్టూడియోకి వచ్చేశారు. వారిని అడిగి పూర్తి వివరాలు తెలుసుకుందాం.
medplus offer
NRI Edition
AP News
Telangana News
Pata
Super Movie
Sports
Daily Specials