Horoscope Today: ఈ రోజు మీ రోజు! ఈ రాశివారికి కష్టమే తప్ప ఫలితం కనిపించదు

Daily Horoscope Rasi Phalalu

Horoscope Today 

Horoscope Today: వివిధ రాశుల వారి దిన ఫలాలు.

Daily Horoscope: శ్రీ ప్లవ నామ సంవత్సరం| శనివారం| ఆషాఢ మాసం, గ్రీష్మ ఋతువు, దక్షిణాయణం | సూర్యోదయం : 5.39| సూర్యాస్తమయం సా.6.33| తిథి శు.పౌర్ణమి ఉ.08.12 వరకు తదుపరి పాడ్యమి ఆదివారం వరకు|నక్షత్రంఉత్తరాషాఢ ప.01.45 వరకు| తదుపరి శ్రవణం|రాహుకాలం ఉ. 09.00 నుంచి 10.30 వరకు| యమగండం ప.1.30 నుంచి 3.00 వరకు| వర్జ్యం సా.5.37 నుంచి 07.20 వరకు| దుర్ముహూర్తం ఉ.07.12 నుంచి 07.20 వరకు | అమృతఘడియలు ఉ.07.30 నుంచి 09.10 వరకు

ఈ రోజు రాశి ఫలాలు

మేషరాశి: ఈ రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి. ఆర్థికపరిస్థితులు బాగుంటాయి. ఆర్థికాభివృద్ధి ఉంటుంది. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. వస్తు, వస్త్రలాభాలు. పలుకుబడి పెరుగుతుంది. స్థిరాస్తి వృద్ధి. వ్యాపారాల విస్తరణ. ఉద్యోగాలలో మరింత ప్రోత్సాహం ఉంటుంది.

వృషభరాశి: ఈ రాశి వారు ఈ రోజు ప్రతి విషయంలోనూ ఆచితూచి వ్యవహారించాలి. బంధువులు, సన్నిహితులతో విభేదాలు. ఆర్థిక విషయాలు నిరాశాజనకంగా ఉంటాయి. పనుల్లో ప్రతిష్ఠంభన. ఆకస్మిక ప్రయాణాలు. దైవచింతన. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొత్త చిక్కులు వచ్చిపడతాయి.

మిథునరాశి: ఈ రాశి వారికి శ్రమాధిక్యం. రాబడికి మించిన ఖర్చులు. బంధుమిత్రులతో విభేదాలు. ప్రయాణాలు వాయిదా వేసుకుంటారు. పనులు కొన్ని విరమిస్తారు. వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. ఉద్యోగాలలో స్వల్ప వివాదాలు.

కర్కాటకరాశి: ఈ రాశి వారికి ముఖ్యమైన వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. కొత్త మిత్రుల పరిచయం. శుభవార్తలు. ధనలబ్ధి. ఆలోచనలు అమలు చేస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో మీ లక్ష్యాలు ఫలిస్తాయి.

సింహరాశి: ఈ రాశి వారికి పనుల్లో ప్రతిబంధకాలు. ప్రయాణాలలో అవాంతరాలు. కొత్తగా రుణయత్నాలు. శ్రమ తప్ప ఫలితం కనిపించదు. ఆస్తులు వివాదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు సాదాసీదాగా ఉంటాయి.

కన్యారాశి: ఈ రాశి వారికి పలుకుబడి పెరుగుతుంది. ఆస్తి వివాదాల నుంచి బయటపడతారు. ఆలయాలు సందర్శిస్తారు. కొన్ని పనులు అప్రయత్నంగా పూర్తి చేస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో పరిస్థితులు అనుకూలిస్తాయి.

తులారాశి: ఈ రాశి వారికి చేపట్టిన పనులు మధ్యలో విరమిస్తారు. ఆలోచనలు నిలకడగా ఉండవు. కుటుంబసమస్యలు చికాకు పరుస్తాయి. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొద్దిపాటి గందరగోళం.

వృశ్చికరాశి: ఈ రాశి వారికి శుభవార్తా శ్రవణం. ఆర్థిక లావాదేవీలు ప్రోత్సాహకరంగా ఉంటాయి. పనులలో పురోగతి. బంధువుల నుంచి కీలక సమాచారం. వ్యాపారాలలో లాభాలు. ఉద్యోగాలలో ఉన్నత పోస్టులు..

ధనుస్సురాశి: ఈ రాశి వారు చేసిన రుణాలు తీరుస్తారు. ఆశ్చర్యకరమైన సంఘటనలు ఎదురైవుతాయి. విలువైన సమాచారం. దైవదర్శనాలు. ప్రముఖుల పరిచయం. వ్యాపారాలు, ఉద్యోగాలలో సానుకూల పరిస్థితులు.

మకరరాశి: ఈ రాశి వారికి కుటుంబంలో సమస్యలు. ముఖ్యమైన వ్యవహారాలలో ఆటంకాలు. దూరప్రయాణాలు. నిరుద్యోగులకు నిరుత్సాహం. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు సామాన్యంగా ఉంటాయి.

కుంభరాశి: ఈ రాశి వారు శ్రమపడ్డా ఫలితం ఉండదు. వ్యవహారాలు ముందుకు సాగవు. ఆకస్మిక ప్రయాణాలు. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ధనవ్యయం. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు.

మీనరాశి: ఈ రాశి వారికి పనులు విజయవంతంగా సాగుతాయి. ఆప్తుల నుంచి కీలక సమాచారం. ఆలయ దర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో అంచనాలు నిజమవుతాయి. ధన,వస్తులాభాలు. పరిచయాలు పెరుగుతాయి.

Tags

Read MoreRead Less
Next Story