Horoscope Today: ఈ రోజు మీ రోజు! ఈ రాశివారు శుభవార్తలు వింటారు

Horoscope Today: ఈ రోజు మీ రోజు! ఈ రాశివారు శుభవార్తలు వింటారు
Horoscope Today: వివిధ రాశుల వారి శుభాశుభ ఫలితాలు ఇలా ఉన్నాయి.

Daily Horoscope: శ్రీ ప్లవ నామ సంవత్సరం| బుధవారం| ఆషాఢ మాసం, గ్రీష్మ ఋతువు, దక్షిణాయణం | సూర్యోదయం : 5.39| సూర్యాస్తమయం సా.6.33| తిథి శు. పంచమి తె.04.29 వరకు తదుపరి షష్టి గురువారం వరకు|నక్షత్రం పూర్వాభద్ర ప.01.26 వరకు| తదుపరి ఉత్తరాభద్ర|రాహుకాలం ప. 12.00 నుంచి 01.30 వరకు| యమగండం ప.7.30 నుంచి 09.00 వరకు| వర్జ్యం రా.11.33 నుంచి 01.14 వరకు| దుర్ముహూర్తం ఉ.11.40 నుంచి 12.32 వరకు | శుభసమయం సా.7.15 ని.

ఈ రోజు రాశి ఫలాలు

మేషరాశి: ఈ రాశివారికి ఈ రోజు విశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి. బాధ్యతలు పెరుగుతాయి. ఆలోచనలు కలసిరావు. కుటుంబంలో చికాకులు. అనారోగ్యం. ఆస్తుల వ్యవహారాలలో చికాకులు. వృత్తి, వ్యాపారాలలో మార్పులు.

వృషరాశి: ఈ రాశివారి శ్రమ ఫలిస్తుంది. నూతనోత్సాహంతో పనులు పూర్తి. సంఘంలో గౌరవం. ఆస్తి వివాదాలు కొలిక్కి వస్తాయి. వృత్తి, వ్యాపారాలు మరింత అనుకూలిస్తాయి.

మిథునరాశి: పాతమిత్రుల కలయిక. ఆకస్మిక ప్రయాణాలు. కుటుంబ, ఆరోగ్య సమస్యలు. బంధువులతో స్వల్ప తగాదాలు. వృత్తి, వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి.

కర్కాటకరాశి: అనుకున్న పనుల్లో ఆటంకాలు. రుణాలు చేస్తారు. మిత్రుల నుంచి ఒత్తిడులు. దైవదర్శనాలు. ఆరోగ్యభంగం. వృత్తి, వ్యాపారాలు సాదాసీదాగా ఉంటాయి

సింహరాశి: ఆర్థిక లావాదేవీలు మందగిస్తాయి. శ్రమాధిక్యం. మిత్రుల నుంచి ఒత్తిడులు. ఆధ్యాత్మిక చింతన. స్వల్ప అనారోగ్యం. వృత్తి, వ్యాపారాలలో నిరుత్సాహమే

కన్యారాశి: పరిచయాలు పెరుగుతాయి. ఆర్థికాభివృద్ధి. కీలక నిర్ణయాలు.పనులు చకచకా సాగుతాయి. భూవివాదాల పరిష్కారం. బంధువుల కలయిక. వృత్తి, వ్యాపారాలలో ముందడుగు.

తులారాశి: కుటుంబసమస్యలు. రుణయత్నాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. బంధువులను కలుసుకుంటారు. ఉద్యోగయత్నాలు మందగిస్తాయి. వృత్తి, వ్యాపారాలలో అసంతృప్తి.

వృశ్చికరాశి: నూతన వ్యక్తుల పరిచయం. శుభవార్తలు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిíß తులతో సఖ్యత. వృత్తి, వ్యాపారాలు ఉత్సాహవంతంగా ఉంటాయి.

ధనుస్సురాశి: కష్టానికి ఫలితం కనిపించదు. ఆస్తి వివాదాలు. పనుల్లో జాప్యం. ఆలోచనలు స్థిరంగా ఉండవు. ఆరోగ్య సమస్యలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో నిరుత్సాహం

మకరరాశి: ఆహ్వానాలు అందుతాయి. వ్యవహారాలలో పురోగతి. ఇంటాబయటా ప్రోత్సాహకరంగా ఉంటుంది. వాహనయోగం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు తొలగుతాయి.

కుంభరాశి: కొత్త కార్యక్రమాలకు శ్రీకారం. శుభవార్తలు. ఆర్థికాభివృద్ధి. నూతన ఉద్యోగాలు. బంధువుల కలయిక. స్థిరాస్తి వృద్ధి. వృత్తి, వ్యాపారాలలో పురోభివృద్ధి.

మీనరాశి: ఈ రాశివారికి వ్యతిరేక ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తి, వ్యాపారాలు నిరాశాజనకంగా ఉంటాయి. వ్యవహారాలలో ఆటంకాలు. ఖర్చులు పెరుగుతాయి. ఆలోచనలు స్థిరంగా ఉండవు. ఆకస్మిక ప్రయాణాలు. ఆలయ దర్శనాలు.

Tags

Read MoreRead Less
Next Story