Telugu Horoscope Today : ఈ రాశివారు శుభవార్తలు వింటారు..!

Telugu Horoscope Today : ఈ రాశివారు శుభవార్తలు వింటారు..!
Telugu Horoscope Today : సోమవారం, డిసెంబర్ 6, 202, శ్రీ ప్లవ నామ సంవత్సరం, దక్షిణాయనం - హేమంతఋతువు, మార్గశిర మాసం - శుక్ల పక్షం, తిధి:విదియ ఉ9.09 తదుపరి తదియ

Telugu Horoscope Today : సోమవారం, డిసెంబర్ 6, 202, శ్రీ ప్లవ నామ సంవత్సరం, దక్షిణాయనం - హేమంతఋతువు, మార్గశిర మాసం - శుక్ల పక్షం, తిధి:విదియ ఉ9.09 తదుపరి తదియ, వారం:సోమవారం (ఇందువాసరే), నక్షత్రం:మూల ఉ8.36 తదుపరి పూర్వాషాఢ, యోగం:గండం రా12.55 తదుపరి వృద్ధి, కరణం:కౌలువ ఉ9.09 వరకు తదుపరి తైతుల రా8.01ఆ తదుపరి గరజి , వర్జ్యం:ఉ7.04 - 8.36 సా5.34 - 7.04, దుర్ముహూర్తం:మ12.12 - 12.56 & మ2.24 - 3.08, అమృతకాలం:రా2.32 - 4.02, రాహుకాలం:ఉ7.30 - 9.00, యమగండ/కేతుకాలం:ఉ10.30 - 12.00, సూర్యరాశి:వృశ్చికం || చంద్రరాశి: ధనుస్సు, సూర్యోదయం:6.20 || సూర్యాస్తమయం:5.21

మేషం : నూతన ఉద్యోగాలు దక్కుతాయి. పలుకుబడి పెరుగుతుంది. వ్యవహారాలలో విజయం. చిన్ననాటి మిత్రుల కలయిక. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొత్త ఆశలు.

వృషభం : వ్యవహారాలలో విజయం. విద్యార్థుల కృషి ఫలిస్తుంది. నూతన వ్యక్తుల పరిచయం. సమావేశాలలో పాల్గొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొన్ని ఇబ్బందులు.

మిథునం : వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. ఆప్తుల నుంచి ముఖ్య సమాచారం. ఆస్తులు కొంటారు. చిన్ననాటి మిత్రుల కలయిక. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఉత్సాహవంతంగా ఉంటుంది.

కర్కాటకం : రుణదాతల ఒత్తిడులు. పనులు ముందుకు సాగవు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. నిర్ణయాలలో మార్పులు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో సమస్యలు.

సింహం : వ్యవహారాలలో అవాంతరాలు. కొత్త రుణాలు చేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. నూతన ఒప్పందాలలో ఆటంకాలు. ఆరోగ్యభంగం. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు.

కన్య : వ్యవహారాలు ముందుకు సాగవు. ఆలోచనలు కలిసిరావు. బాధ్యతలతో ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. ఆర్థిక పరిస్థితి నిరాశ పరుస్తుంది. వ్యాపారాలు, ఉద్యోగాలు గందరగోళంగా ఉంటాయి

తుల : పరిస్థితులు అనుకూలిస్తాయి. సంఘంలో గౌరవం. ఆస్తి వివాదాలు తీరతాయి. వాహనాలు కొంటారు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ప్రోత్సాహం.

వృశ్చికం : కుటుంబంలో ఒత్తిడులు. దైవదర్శనాలు. పనుల్లో అవాంతరాలు. కొన్ని సమస్యలు చికాకు పరుస్తాయి.వ్యాపారాలు, ఉద్యోగాలలో గందరగోళంగా ఉంటుంది.

ధనుస్సు : కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు అందుతాయి. పనులు సాఫీగా సాగుతాయి. స్థిరాస్తి వివాదాలు తీరతాయి. వాహనాలు కొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొన్ని మార్పులు.

మకరం : పనులు నత్తనడకన సాగుతాయి. ఆర్థిక ఇబ్బందులు. ఆకస్మిక ప్రయాణాలు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో మార్పులు.

కుంభం : బంధువులతో తగాదాలు. దూరప్రయాణాలు. ఆ«ధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. అనారోగ్య సూచనలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో శ్రమాధిక్యం.

మీనం : ఆస్తిలాభం. సన్నిహితులతో ఉత్సాహంగా గడుపుతారు. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలలో లాభాలు. ఉద్యోగాలలో చిక్కులు వీడతాయి.

Tags

Read MoreRead Less
Next Story