Horoscope Today: ఈ రాశివారికి బంధుమిత్రుల నుంచి ధనలాభం

Horoscope Today: ఈ రాశివారికి బంధుమిత్రుల నుంచి ధనలాభం
Horoscope Today: వివిధ రాశుల వారి శుభాశుభ ఫలితాలు ఎలా ఉంటాయి.

Daily Horoscope: శ్రీ ప్లవ నామ సంవత్సరం| మంగళవారం| శ్రావణ మాసం, వర్ష ఋతువు, దక్షిణాయణం | సూర్యోదయం : 5.44| సూర్యాస్తమయం సా.6.27| తిథి శు. విదియ| నక్షత్రం మఘ |రాహుకాలం ప. 3.00 నుంచి 04.00 వరకు| యమగండం ఉ. 09.00 నుంచి 10.30 వరకు| వర్జ్యం రా.06.53 నుంచి 08.28వరకు| దుర్ముహూర్తం 08.17 నుంచి 9.07 వరకు పున: రా.10.55 నుంచి 11.45 వరకు | శుభసమయం ఉ.10.35 ని.

ఈ రోజు రాశి ఫలాలు

మేషం: ఈ రాశివారికి బంధుమిత్రుల నుంచి ధనలాభం. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆస్తిలాభం. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరింత ప్రోత్సాహం.

వృషభం: ఈ రాశివారికి కొన్ని వ్యవహారాలలో అవాంతరాలు. దూరప్రయాణాలు. సోదరులతో విభేదాలు. అనారోగ్యం. వ్యాపారాలు నిరాశ కలిగిస్తాయి. ఉద్యోగాలలో లేనిపోని చికాకులు. దైవదర్శనాలు.

మిథునం: ఈ రాశివారికి బంధువుల నుంచి ముఖ్య సమాచారం. ప్రముఖులతో పరిచయాలు. ఆస్తిలాభం. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో సమస్యలు తొలగుతాయి.

కర్కాటకం: ఈ రాశివారికి మిత్రులతో ఆనందంగా గడుపుతారు. పరిచయాలు పెరుగుతాయి. ఆర్థికం పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ఉద్యోగ, విద్యావకాశాలు. ఆస్తిలాభ సూచనలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరింత అభివృద్ధి.

సింహం: ఈ రాశివారికి మిత్రులతో మాటపట్టింపులు. ఆకస్మికప్రయాణాలు. కుటుంబంలో సమస్యలు. నిరుద్యోగుల యత్నాలు నత్తనడకన సాగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు మందగిస్తాయి.

కన్య: ఈ రాశివారికి పనుల్లో అవాంతరాలు. ఆర్థిక లావాదేవీలు మందగిస్తాయి. మిత్రులతో అకారణంగా విభేదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు.

తుల: ఈ రాశివారికి ఉద్యోగ యత్నాలు ఫలిస్తాయి. కొన్ని బాకీలు కూడా వసూలవుతాయి. భూ«,ధనలాభాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి.

వృశ్చికం: ఈ రాశివారికి ఒక సమాచారం ఊరటనిస్తుంది. వస్త్రలాభాలు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. వాహన,గృహయోగాలు. వ్యాపారాలు కొంత పుంజుకుంటాయి. ఉద్యోగులకు పనిభారం తొలగుతుంది.

ధనుస్సు: ఈ రాశివారికి రుణదాతల నుంచి ఒత్తిడులు. ఆకస్మిక ప్రయాణాలు. కుటుంబంలో సమస్యలు. అనారోగ్యం. వ్యాపారాలు నిరాశ పరుస్తాయి. ఉద్యోగులకు కొత్త బాధ్యతలు.

మకరం: ఈ రాశివారికి శ్రమ పడ్డా ఫలితం కనిపించదు. ఆస్తి వివాదాలు నెలకొంటాయి. ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉంటుంది. వ్యాపార లావాదేవీలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగాలలో బాధ్యతలు పెరుగుతాయి.

కుంభం: ఈ రాశివారికి ఉద్యోగావకాశాలు. చేపట్టిన కార్యక్రమాలలో విజయం. ప్రముఖులతో పరిచయాలు. పనులు విజయవంతంగా సాగుతాయి. ఆర్థిక వ్యవహారాలు సంతృప్తినిస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో నూతనోత్సాహం

మీనం: ఈ రాశివారికి పనులలో కొన్ని ఆటంకాలు. బంధువులతో విభేదాలు. ఆరోగ్య సమస్యలు. శ్రమ మరింత తప్పదు. అనుకోని ప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో నిరుత్సాహం ఉంటుంది.

Tags

Read MoreRead Less
Next Story