Telugu Horoscope Today : ఈ రాశివారికి బంధువులతో తగాదాలు.. ఆకస్మిక ప్రయాణాలు..!

Telugu Horoscope Today : ఈ రాశివారికి బంధువులతో తగాదాలు.. ఆకస్మిక ప్రయాణాలు..!
బంధువులతో తగాదాలు. ఆకస్మిక ప్రయాణాలు. దైవదర్శనాలు చేసుకుంటారు. ధనవ్యయం. వ్యాపారాలు, ఉద్యోగాలలో అంచనాలు తప్పుతాయి.

Telugu Horoscope Today :మంగళవారం, నవంబర్ 16, 2021, శ్రీ ప్లవ నామ సంవత్సరం, దక్షిణాయనం - శరదృతువు, కార్తీక మాసం - శుక్ల పక్షం, తిధి:ద్వాదశి ఉ8.55 తదుపరి త్రయోదశి, వారం:మంగళవారం(భౌమ్యవాసరే), నక్షత్రం:రేవతి, రా9.39వరకుతదుపరి అశ్విని, యోగం:సిద్ధి తె3.45వరకు, కరణం:బాలువ ఉ8.55 తదుపరి కౌలువ రా9.24 ఆ తదుపరి తైతుల, వర్జ్యం:ఉ9.03 - 10.44, దుర్ముహూర్తం:ఉ8.23 - 9.08 &రా10.28 - 11.19, అమృతకాలం:రా7.07 - 8.48, రాహుకాలం:మ3.00 - 4.30, యమగండ/కేతుకాలం:ఉ9.00 - 10.30, సూర్యరాశి:తుల ||చంద్రరాశి:మీనం, సూర్యోదయం:6.09 || సూర్యాస్తమయం:5.21, క్షీరాబ్ధి ద్వాదశి/ కైశిక ద్వాదశి వృశ్చిక సంక్రమణం రా12.25నుండి..

నేటి రాశిఫలాలు :

మేషం: బంధువులతో తగాదాలు. ఆకస్మిక ప్రయాణాలు. దైవదర్శనాలు చేసుకుంటారు. ధనవ్యయం. వ్యాపారాలు, ఉద్యోగాలలో అంచనాలు తప్పుతాయి.

వృషభం: శుభకార్యాలలో పాల్గొంటారు. పాతబాకీలు వసూలవుతాయి. సమాజంలో గౌరవం పెరుగుతుంది. భూలాభాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఆశలు ఫలిస్తాయి.

మిథునం: నూతన పరిచయాలు. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. బాకీలు వసూలవుతాయి. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూల పరిస్థితులు.

కర్కాటకం: కొత్త విషయాలు తెలుస్తాయి. ఆర్థిక విషయాలలో మరింత పురోగతి. సన్నిహితులతో ఆనందంగా గడుపుతారు. వాహనయోగం. వ్యాపారాలు, ఉద్యోగాలలో పరిస్థితులు అనుకూలిస్తాయి.

సింహం: కుటుంబసభ్యులతో తగాదాలు. ఆకస్మిక ప్రయాణాలు. ఆలయాలు సందర్శిస్తారు. విద్యార్థులకు ఫలితాలు ఉత్సాహాన్నిస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో సమస్యలు తీరతాయి.

కన్య: వ్యవహారాలలో ఆటంకాలు. బంధువులతో వివాదాలు. ఆస్తుల కొనుగోలులో జాప్యం. అనారోగ్యం. కుటుంబంలో ఒత్తిడులు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒడిదుడుకులు.

తుల: కొన్ని సమస్యలు ఎదురై చికాకు పరుస్తాయి. దూరప్రయాణాలు. ఆలయాలు సందర్శిస్తారు. పనులు వాయిదా పడతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు.

వృశ్చికం: శుభవార్తలు వింటారు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. సన్నిహితులతో సఖ్యత. విందువినోదాలు. కార్యజయం. వ్యాపారాలు, ఉద్యోగాలలో కీలక మార్పులు.

ధనుస్సు: నిరుద్యోగులకు శుభవార్తలు. వ్యవహారాలలో విజయం. ధనలాభం. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరింత అనుకూలత.

మకరం: కుటుంబసభ్యులతో తగాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. పనుల్లో అవాంతరాలు. ధనవ్యయం. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో వివాదాలు.

కుంభం:పనుల్లో జాప్యం. ఆర్థిక వ్యవహారాలు నిరాశ పరుస్తాయి. దూరప్రయాణాలు. దైవదర్శనాలు. కుటుంబసభ్యులతో తగాదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో నిదానం అవసరం.

మీనం:వ్యవహారాలలో విజయం. శుభవార్తలు. సమాజసేవలో పాల్గొంటారు. స్థిరాస్తి వృద్ధి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు తీరతాయి.

Tags

Read MoreRead Less
Next Story