Telugu Horoscope Today : ఈ రాశివారికి ఆకస్మిక ధనలాభం... కీలక నిర్ణయాలు..!

Telugu Horoscope Today : ఈ రాశివారికి ఆకస్మిక ధనలాభం... కీలక నిర్ణయాలు..!

Rasi Phalalalu 18th October (Tv5News.in) 

Telugu Horoscope Today : వ్యవహారాలలో విజయం. శుభవార్తలు. వాహనయోగం. పరిచయాలు పెరుగుతాయి. ఆలయ దర్శనాలు. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో హోదాలు దక్కుతాయి.

Telugu Horoscope Today : సోమవారం, అక్టోబర్ 18, 2021, శ్రీ ప్లవ నామ సంవత్సరం, దక్షిణాయనం - శరదృతువు, ఆశ్వయుజ మాసం - శుక్ల పక్షం, తిధి:త్రయోదశి సా6.14వరకు తదుపరి చతుర్థశి, వారం:సోమవారం (ఇందువాసరే), నక్షత్రం:పూర్వాభాద్ర మ12.06 తదుపరి ఉత్తరాభాద్ర , యోగం:ధృవం రా10.56 తదుపరి వ్యాఘాతం, కరణం:కౌలువ ఉ6.21 తదుపరి తైతుల సా6.14 ఆ తదుపరి గరజి, వర్జ్యం:రా10.00 - 11.40, దుర్ముహూర్తo:మ12.08 - 12.54 &మ2.27 - 3.14, అమృతకాలం: లేదు, రాహుకాలం:ఉ7.30 - 9.00, యమగండం/కేతుకాలం:ఉ10.30 - 12.00, సూర్యరాశి:తుల || , చంద్రరాశి:మీనం, సూర్యోదయం:5.56 || సూర్యాస్తమయం:5.35

Telugu Horoscope Today : నేటిరాశిఫలాలు :

మేషం : పనులలో తొందరపాటు. ఆర్థిక ఇబ్బందులు. కొత్త రుణాలు చేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలు అనుకూలిస్తాయి.

వృషభం : ఆర్థిక వ్యవహారాలు గందరగోళంగా ఉంటాయి. సన్నిహితులతో విభేదాలు. ఆకస్మిక ప్రయాణాలు. దూరపుబంధువుల కలయిక. స్వల్ప అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలు అనుకూలించవు.

మిథునం : వ్యవహారాలలో అవాంతరాలు. కొత్త రుణాలు చేస్తారు. బాధ్యతలు కొన్ని చికాకు పరుస్తాయి. ఆరోగ్యభంగం. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొత్త సమస్యలు ఎదురుకావచ్చు.

కర్కాటకం : పరిచయాలు విస్తృతమవుతాయి. ఆలోచనలు కార్యరూపంలో పెడతారు. చిన్ననాటి మిత్రుల కలయిక. వాహనయోగం. ధనలబ్ధి. వ్యాపారాలు, ఉద్యోగాలు మరింత అనుకూలిస్తాయి.

సింహం : వ్యవహారాలలో ఆటంకాలు. బంధుమిత్రులతో వివాదాలు. నిరుద్యోగులకు నిరుత్సాహం. దూరప్రయాణాలు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు సామాన్యస్థితిలో ఉంటాయి.

కన్య : పనులు నత్తనడకన సాగుతాయి. ఎంత శ్రమపడ్డా ఫలితం కనిపించదు. ఆస్తి వివాదాలు. ఆలయాలు సందర్శిస్తారు. బంధువులతో తగాదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో గందరగోళం.

తుల : ఇంటర్వ్యూలు అందుకుంటారు. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలు పూర్తి. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఉత్సాహాన్నిస్తుంది.

వృశ్చికం : శుభవార్తా శ్రవణం. ఆకస్మిక ధనలాభం. కీలక నిర్ణయాలు. సమావేశాలలో పాల్గొంటారు. స్థిరాస్తి వృద్ధి. వ్యాపారాలు, ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి.

ధనుస్సు : సన్నిహితులతో ఆనందంగా గడుపుతారు. వస్తు,వస్త్రలాభాలు. చిన్ననాటి విషయాలు గుర్తుకు వస్తాయి. ఆలయ దర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి.

మకరం : పనులు ముందుకు సాగవు. ఆలోచనలు నిలకడగా ఉండవు. బంధువులతో తగాదాలు. అనుకోని ధనవ్యయం. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో నిరాశ.

కుంభం : నూతన పరిచయాలు. ఆసక్తికర సమాచారం. విందువినోదాలు. యత్నకార్యసిద్ధి. సోదరులతో వివాదాలు పరిష్కారం. వ్యాపారాలు, ఉద్యోగాలలో గందరగోళం తొలగుతుంది.

మీనం : వ్యవహారాలలో విజయం. శుభవార్తలు. వాహనయోగం. పరిచయాలు పెరుగుతాయి. ఆలయ దర్శనాలు. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో హోదాలు దక్కుతాయి.

Tags

Read MoreRead Less
Next Story