Telugu Horoscope Today : ఈ రాశివారికి రాబడికి మించి ఖర్చులు.. సోదరులతో విభేదాలు..!

Telugu Horoscope Today : ఈ రాశివారికి రాబడికి మించి ఖర్చులు.. సోదరులతో విభేదాలు..!
Telugu Horoscope Today : రాబడికి మించి ఖర్చులు. దూరప్రయాణాలు. సోదరులతో విభేదాలు. భూవివాదాలు. వ్యాపారాలు సాధారణంగా కొనసాగుతాయి. ఉద్యోగాలలో కొన్ని సమస్యలు.

Telugu Horoscope Today : గురువారం, అక్టోబర్ 21, 2021, శ్రీ ప్లవ నామ సంవత్సరం, దక్షిణాయనం - శరదృతువు, ఆశ్వయుజ మాసం - బహుళ పక్షం, తిధి:పాడ్యమి రా8.37వరకు తదుపరి విదియ, వారం:గురువారం(బృహస్పతివాసరే), నక్షత్రం:అశ్విని మ3.56 తదుపరి భరణి, యోగం:వజ్రం రా9.37తదుపరి సిద్ధి , కరణం:బాలువ ఉ7.58 తదుపరి కౌలువ రా8.37 ఆ తదుపరి తైతుల, వర్జ్యం:ఉ11.38 - 1.21 & రా2.23 - 4.07, దుర్ముహూర్తం:ఉ9.49 - 10.35 & మ2.27 - 3.13, అమృతకాలం:ఉ8.12 - 9.55, రాహుకాలం :మ1.30 - 3.00, యమగండం/కేతుకాలం:ఉ6.00 - 7.30, సూర్యరాశి:తుల || చంద్రరాశి:మేషం, సూర్యోదయం:5.57 || సూర్యాస్తమయం: 5.34

మేషం : రాబడికి మించి ఖర్చులు. దూరప్రయాణాలు. సోదరులతో విభేదాలు. భూవివాదాలు. వ్యాపారాలు సాధారణంగా కొనసాగుతాయి. ఉద్యోగాలలో కొన్ని సమస్యలు.

వృషభం : ఆకస్మిక ప్రయాణాలు. కొత్తరుణయత్నాలు. బంధువులు, మిత్రుల నుంచి సమస్యలు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలు అంతగా కలిసిరావు.

మిథునం: వ్యవహారాలలో ఆటంకాలు. కొత్త రుణాలు చేస్తారు. ఆత్మీయులతో కలహాలు. దూరపు బంధువుల కలయిక. మానసిక అశాంతి. వ్యాపారాలు, ఉద్యోగాలు నత్తనడకన సాగుతాయి.

కర్కాటకం. : పనులు సజావుగా సాగుతాయి. ఆప్తుల సలహాలు స్వీకరిస్తారు. సంఘంలో ఆదరణ. వాహనయోగం. స్థిరాస్తి వివాదాలు తీరతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో లక్ష్యాలు సాధిస్తారు.

సింహం : పనులు ముందుకు సాగుతాయి. ఆకస్మిక ప్రయాణాలు. ఇంటాబయటా సమస్యలు. ఆస్తుల కొనుగోలులో అవాంతరాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో వివాదాలు.

కన్య : రుణాలు చేయాల్సిన పరిస్థితులు. పనులలో అవాంతరాలు. బాధ్యతలు మరింత పెరుగుతాయి. మీ ఆలోచనలు నిలకడగా ఉండవు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరుత్సాహపరుస్తాయి.

తుల : కొత్త పనులు చేపట్టి సజావుగా పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి శుభవార్తలు. వాహనయోగం. భూవివాదాలు తీరతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు సంతృప్తికరంగా సాగుతాయి.

వృశ్చికం : పనులు మధ్యలో వాయిదా వేస్తారు. ఆర్థిక ఇబ్బందులు. ఆకస్మిక ప్రయాణాలు. అనారోగ్యం. శ్రమకు ఫలితం కనిపించదు. వ్యాపారాలు, ఉద్యోగాలు గందగోళపరుస్తాయి.

ధనుస్సు : నూతన విద్యావకాశాలు పొందుతారు. ఆత్మీయుల నుంచి కీలక సమాచారం. కుటుంబంలో కొన్ని వేడుకల నిర్వహణ. వ్యాపారాలు, ఉద్యోగాలలో మీ మాటే చెల్లుబాటు కాగలదు.

మకరం : పరిచయాలు విస్తృతమవుతాయి. ఆశ్చర్యకరమైన సంఘటనలు ఎదురవుతాయి. వాహనయోగం. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒడిదుడుకులు తొలగుతాయి.

కుంభం : పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు. బంధువులతో సఖ్యత. ముఖ్య నిర్ణయాలు. స్థిరాస్తివృద్ధి. వ్యాపారాలు, ఉద్యోగాలలో ప్రోత్సాహకరంగా ఉంటుంది.

మీనం : కొత్త విషయాలు గ్రహిస్తారు. సమాజంలో ప్రత్యేక గౌరవం. ఆస్తి వివాదాలు తీరతాయి. వస్తు, ధనలాభాలు. పాతమిత్రుల కలయిక. వ్యాపారాలు, ఉద్యోగాలలో అవాంతరాలు తొలగుతాయి.

Tags

Read MoreRead Less
Next Story