Horoscope Today: ఈ రాశి వారి గౌరవమర్యాదలకు లోటు ఉండదు

Horoscope Today: ఈ రాశి వారి గౌరవమర్యాదలకు లోటు ఉండదు
Horoscope Today: వివిధ రాశుల వారి శుభాశుభ ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి.

Daily Horoscope: శ్రీ ప్లవ నామ సంవత్సరంసోమవారం| శ్రావణ మాసం, వర్ష ఋతువు, దక్షిణాయణం | సూర్యోదయం : 5.48| సూర్యాస్తమయం సా.6.20| తిథి శు. పంచమి సా.6.28 వరకు తదుపరి షష్ఠి, అశ్వని నక్షత్రం రా.1.30 వరకు తదుపరి భరణి |రాహుకాలం ఉ. 10.30 నుంచి 12.00 వరకు| యమగండం ప. 03.00 నుంచి 04.00 వరకు| వర్జ్యం రా.09.00 నుంచి 10.55వరకు| దుర్ముహూర్తం 08.17 నుంచి 09.21 వరకు పున: మ.12.25 నుంచి 01.19 వరకు | శుభసమయం ఉ.07.30 ని.

ఈ రోజు రాశి ఫలాలు

మేషం: ఆదాయం అంతగా కనిపించదు. ఆకస్మిక ప్రయాణాలు ఉంటాయి. సన్నిహితులతో విభేదాలు. శ్రమాధిక్యం. అనారోగ్యం. నిర్ణయాలలో ఆచితూచి అడుగువేయండి. వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగాలలో చికాకులు.

వృషభం: ఉద్యోగ ప్రయత్నాలకు సన్నిహితుల చేయూత. కార్యజయం. ఆశ్చర్యకరమైన సంఘటనలు. విలువైన సమాచారం అందుతుంది. అదనపు ఆదాయం. వ్యాపార లావాదేవీలలో లాభాలు. ఉద్యోగాలలో లక్ష్యాలు సాధిస్తారు.

మిథునం: కొత్త పరిచయాలు. ఆలోచనలు అమలు చేస్తారు. ప్రత్యర్థుల నుంచి సైతం సాయం అందుతుంది. ఒక సంఘటన ఆకట్టుకుంటుంది. వ్యాపారాలలో ముందడుగు. ఉద్యోగాలలో సమస్యలు తీరతాయి..

కర్కాటకం: బంధువులతో విరోధాలు. కొన్ని పనుల్లో ఆటంకాలు. వ్యయప్రయాసలు. అనారోగ్యం. సకాలంలో సొమ్ము అందక ఇబ్బంది. ఉద్యోగాలలో మార్పులు. వ్యాపారాలలో నిరుత్సాహం.

సింహం: దూరప్రయాణాలు. ఆప్తులతో వివాదాలు. ఆరోగ్యభంగం. ప్రయాణాలు వాయిదా పడతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలపై దృష్టి. వ్యాపారాల విస్తరణయత్నాలు వాయిదా. ఉద్యోగాలలో ఆకస్మిక బదిలీలు.

కన్య: చేపట్టిన పనులు సజావుగా సాగుతాయి. సన్నిహితులతో వివాదాలు పరిష్కారం. ఆదాయం సంతృప్తికరం. కొన్ని సమస్యల పరిష్కారం. వ్యాపారాలలో అనుకున్న లాభాలు. ఉద్యోగాల్లో ప్రగతి.

తుల: కుటుంబసభ్యులతో వివాదాలు. ఆదాయం నిరాశ కలిగిస్తుంది. వ్యవహారాల్లో చికాకులు. అనారోగ్యం. వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగాల్లో చిక్కులు తప్పకపోవచ్చు. ధనవ్యయం.

వృశ్చికం: కొన్ని పనులు విజయవంతంగా సాగుతాయి. అదనపు ఆదాయం. సన్నిహితులతో ఆనందంగా గడుపుతారు. వ్యాపారాలలో కొత్త పెట్టుబడులు. ఉద్యోగాల్లో అనుకూల పరిస్థితులు..

ధనుస్సు: ముఖ్యమైన వ్యవహారాలలో అవాంతరాలు. మిత్రులతో విభేదాలు. ఆధ్యాత్మిక భావాలు పెంచుకుంటారు. రాబడి కొంత తగ్గి నిరుత్సాహం చెందుతారు. వ్యాపారాలలో నిదానం అవసరం. ఉద్యోగాలలో కొన్ని చిక్కులు.

మకరం: పలుకుబడి పెరుగుతుంది. కష్టానికి తగ్గ ఫలితం దక్కుతుంది. ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆదాయం సంతృప్తినిస్తుంది. కొత్త వ్యాపారాలలో మరింత ఉత్సాహం. ఉద్యోగాలలో శుభవార్తలు.

కుంభం: ఉద్యోగ,వివాహయత్నాలు సానుకూలం. సంఘంలో గౌరవమర్యాదలు పొందుతారు. ఆస్తి విషయాల్లో అగ్రిమెంట్లు. వాహనాలు కొంటారు. వ్యాపారాలు సాఫీగా సాగుతాయి. ఉద్యోగాలలో ఉత్సాహవంతమైన కాలం.

మీనం: పరిస్థితులు అనుకూలించవు. రాబడి కంటే ఖర్చులు అధికం.. సన్నిహితులతో విభేదాలు. విలువైన వస్తువులు జాగ్రత్త. వ్యాపారాలలో ఆటుపోట్లు. ఉద్యోగాలలో వివాదాలు..

Tags

Read MoreRead Less
Next Story