Telugu Horoscope Today : ఈ రాశివారు కొత్త పనులు చేపడతారు. ఆత్మీయుల నుంచి శుభవార్తలు...!

Telugu Horoscope Today :  ఈ రాశివారు కొత్త పనులు చేపడతారు. ఆత్మీయుల నుంచి శుభవార్తలు...!
Telugu Horoscope Today : కొత్త పనులు చేపడతారు. ఆత్మీయుల నుంచి శుభవార్తలు. వాహనయోగం. చర్చలు ఫలిస్తాయి. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలలో మరింత ప్రగతి. ఉద్యోగాలలో ఒడిదుడుకులు తొలగి ఊరట చెందుతారు.

శ్రీ ప్లవ నామ సంవత్సరం,దక్షిణాయనం - శరదృతువు,ఆశ్వయుజ మాసం - బహుళ పక్షం,తిధి:అష్టమి ఉ9.00వరకు తదుపరి నవమి ,నక్షత్రం:పుష్యమి ఉ7.56 తదుపరి ఆశ్రేష, యోగం:శుభం రా11.20 తదుపరి శుక్లం,కరణం:కౌలువ ఉ9.00 తదుపరి తైతుల రా9.18 ఆ తదుపరి గరజి,వర్జ్యం:రా9.21 - 11.02,దుర్ముహూర్తం:ఉ8.29 - 9.15 & మ12.20 - 1.07,అమృతకాలం: లేదు,రాహుకాలం:ఉ10.30 - 12.00, యమగండం/కేతుకాలం:మ3.00 - 4.30,సూర్యరాశి:తుల || చంద్రరాశి:కర్కాటకం, సూర్యోదయం:6.00 || సూర్యాస్తమయం:5.30

నేటి రాశిఫలాలు :

మేషం : కొత్త పనులు చేపడతారు. ఆత్మీయుల నుంచి శుభవార్తలు. వాహనయోగం. చర్చలు ఫలిస్తాయి. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలలో మరింత ప్రగతి. ఉద్యోగాలలో ఒడిదుడుకులు తొలగి ఊరట చెందుతారు.

వృషభం : ఆకస్మిక ధనలబ్ధి. పరిచయాలు మరింత పెరుగుతాయి. ఆశయాలు నెరవేరతాయి. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో అనుకూల పరిస్థితులు.

మిథునం : .శ్రమ మరింత పెరుగుతుంది. ఆశ్చర్యకర విషయాలు తెలుస్తాయి. ప్రముఖులతో పరిచయాలు. చిత్రమైన సంఘటనలు. ధనలాభాలు. వ్యాపారాలు మరింత అనుకూలిస్తాయి. ఉద్యోగాలలో బదిలీ అవకాశాలు.

కర్కాటకం : అనుకున్న పనుల్లో అవాంతరాలు. రుణాలు చేస్తారు. శ్రమ పెరుగుతుంది. ఆరోగ్యసమస్యలు. దైవదర్శనాలు. వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. ఉద్యోగాలలో కొన్ని చికాకులు.

సింహం : అనుకున్న పనుల్లో అవాంతరాలు. రుణాలు చేయాల్సివస్తుంది. బంధువిరోధాలు. అనారోగ్య సూచనలు. ప్రయాణాలు వాయిదా వేస్తారు. వ్యాపారాలు నిరాశ కలిగిస్తాయి. ఉద్యోగాలలో గందరగోళ పరిస్థితి.

కన్య : వ్యవహారాలలో విజయం. శుభకార్యాలరీత్యా ఖర్చులు. సోదరులతో సఖ్యత. ముఖ్య నిర్ణయాలలో ఆటంకాలు. ఆస్తుల వివాదాలు తీరతాయి. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో ఇబ్బందులు తొలగుతాయి.

తుల : చిన్ననాటి విషయాలు తెలుసుకుంటారు. సంఘంలో గౌరవం. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితుల నుంచి సహాయం అందుతుంది. వస్తులాభాలు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో మీదే పైచేయిగా ఉంటుంది.

వృశ్చికం : రుణబాధలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబ సమస్యలు వేధిస్తాయి. పనులలో ఆటంకాలు. శ్రమ తప్పదు. దూరప్రయాణాలు. వ్యాపారాలు సాధారణంగా ఉంటాయి. ఉద్యోగాలలో మరిన్ని బాధ్యతలు.

ధనుస్సు : వ్యయప్రయాసలు. బంధుమిత్రులతో కలహాలు. అనారోగ్యం. కుటుంబసమస్యలు. పనులు మధ్యలో విరమిస్తారు. దూరప్రయాణాలు. వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగాలలో కొత్త బాధ్యతలు.

మకరం : చిన్ననాటి మిత్రుల నుంచి వస్తులాభాలు. ప్రముఖులతో పరిచయాలు. సంఘంలో గౌరవం. వివాదాలు తీరతాయి. భూములు, వాహనాలు కొంటారు. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. ఉద్యోగాలలో ఎదురుండదు.

కుంభం : కొత్త వ్యక్తుల పరిచయం. శుభకార్యాలలో పాల్గొంటారు. పాతబాకీలు సైతం వసూలవుతాయి. ఆశ్చర్యకర విషయాలు తెలుసుకుంటారు. సంఘంలో ఆదరణ. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో కొన్ని అనుకూల మార్పులు.

మీనం : పరిస్థితులు అనుకూలించవు. వ్యయప్రయాసలు. బంధువులతో తగాదాలు. శ్రమపడ్డా ఫలితం కనిపించదు. ఆస్తుల వ్యవహారాలలో చికాకులు. వ్యాపారాలు నిరాశ పరుస్తాయి. ఉద్యోగాలలో పనిఒత్తిడులు.

Tags

Read MoreRead Less
Next Story