Horoscope Today : ఈ రాశివారికి అనుకోని సంఘటనలు.. ఆప్తులతో వివాదాలు..!

Horoscope Today : ఈ రాశివారికి అనుకోని సంఘటనలు.. ఆప్తులతో వివాదాలు..!
Horoscope Today : చేపట్టిన పనులు అనుకున్న విధంగా సాగుతాయి. సన్నిహితులతో వివాదాలు పరిష్కారం. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది.

మేషం : చేపట్టిన పనులు అనుకున్న విధంగా సాగుతాయి. సన్నిహితులతో వివాదాలు పరిష్కారం. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. వ్యాపారాలు సాఫీగా సాగుతాయి. ఉద్యోగాలలో అనుకూలస్థితి.

వృషభం : కుటుంబసభ్యులతో లేనిపోని వివాదాలు. ఆదాయం నిరాశ కలిగిస్తుంది. వ్యవహారాల్లో చికాకులు. ఆరోగ్య సమస్యలు. భాగస్వామ్య వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగాల్లో చిక్కులు తప్పకపోవచ్చు.

మిథునం : ఉద్యోగ, వివాహయత్నాలు సానుకూలం. సంఘంలో గౌరవమర్యాదలు పొందుతారు. ఆస్తి విషయాల్లో అగ్రిమెంట్లు. వాహనాలు, భూములు కొంటారు. ఆకస్మిక ధనలబ్ధి. వ్యాపారాలు సాఫీగా సాగుతాయి. ఉద్యోగులకు ఉన్నతస్థాయి నుంచి పిలుపు.

కర్కాటకం : అనుకోని సంఘటనలు. ఆప్తులతో వివాదాలు నెలకొంటాయి. అనారోగ్యం. ప్రయాణాలు వాయిదా పడతాయి. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపార విస్తరణయత్నాలలో ఆటంకాలు. ఉద్యోగులకు ఆకస్మిక బదిలీలు.

సింహం : బంధువులతో విరోధాలు. శ్రమాధిక్యం. పనుల్లో ఆటంకాలు. వ్యయప్రయాసలు. స్వల్ప అనారోగ్యం. ఆర్థిక వ్యవహారాలు మందగిస్తాయి. ఉద్యోగులకు మార్పులు. వ్యాపారాలు నిరాశ కలిగిస్తాయి.

కన్య : ఆర్థిక పరిస్థితి నిరుత్సాహపరుస్తుంది. ఆకస్మిక ప్రయాణాలు ఉంటాయి. సన్నిహితులతో విభేదాలు.శ్రమాధిక్యం. అనారోగ్యం. వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగాలలో చికాకులు.

తుల : పలుకుబడి పెరుగుతుంది. కష్టానికి తగ్గ ఫలితం దక్కుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. ధనలబ్ధి. కొత్త వ్యాపారాలు చేపడతారు. ఉద్యోగాలలో ఉన్నత పోస్టులు.

వృశ్చికం : నూతనోత్సాహం. ఆర్థిక లావాదేవీలు ఆశించిన రీతిలో ఉంటాయి. సన్నహితులతో ఆనందంగాగడుపుతారు. వ్యాపారులకు నూతన పెట్టుబడులు. ఉద్యోగాల్లో సమస్యలు తీరతాయి.

ధనుస్సు : కొత్త పరిచయాలు. ఆలోచనలు అమలు చేస్తారు. ఒక ప్రకటన ఆకట్టుకుంటుంది. వాహనాలు, స్థలాలు కొంటారు. వ్యాపారాలలో ముందంజ. ఉద్యోగులకు పదోన్నతి సూచనలు.

మకరం : ముఖ్యమైన పనులు ముందుకు సాగవు. సోదరులు, మిత్రులతో కలహాలు. ఆధ్యాత్మిక భావాలు పెంచుకుంటారు. ఆర్థిక ఇబ్బందులు. వ్యాపారాలలో నిదానం అవసరం. ఉద్యోగులకు ఆకస్మిక మార్పులు.

కుంభం : ప్రయత్నాలకు సన్నిహితుల చేయూత. పనులలో ముందడుగు వేస్తారు. ఆశ్చర్యకరమైన సంఘటనలు. విలువైన సమాచారం. ఆర్థిక లావాదేవీలు సంతృప్తినిస్తాయి. వ్యాపార లావాదేవీలలో లాభాలు. ఉద్యోగులకు కొత్త హోదాలు.

మీనం : పరిస్థితులు అనుకూలించవు. రాబడి కంటే ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. సన్నిహితులతో విభేదాలు. ఆరోగ్యభంగం. వ్యాపారాలలో ఆటుపోట్లు తప్పవు. ఉద్యోగులకు బాధ్యతలు పెరుగుతాయి

Tags

Read MoreRead Less
Next Story