Dasara Navaratri 2021: నవరాత్రుల్లో మూడో రోజు.. గాయత్రి మాత రూపంలో అమ్మవారు

Dasara Navaratri 2021: నవరాత్రుల్లో మూడో రోజు.. గాయత్రి మాత రూపంలో అమ్మవారు
Dasara Navaratri 2021: దుర్గామాతను ఈ రూపంలో కొలిస్తే సమస్యలను దూరం చేస్తుందని భక్తులు విశ్వసిస్తారు.

Dasara Navaratri 2021: దుర్గామాతను పూజించే పండుగ దసరా. అమ్మవారిని వనరాత్రుల పేరుతో తొమ్మిది రోజులు రోజుకో అలంకారం చేస్తూ అమ్మకు ఇష్టమైన ప్రసాదాన్ని ప్రత్యేకంగా తయారు చేసి నైవేద్యంగా సమర్పిస్తారు. మహిళలు విజయదశమికి ముందు తొమ్మిది రోజులు బతుకమ్మల ఆటలతో సందడి చేస్తారు.

మొదటి రోజు బాలా త్రిపుర సుందరిగా, రెండవ రోజు బ్రహ్మచారిణిగా కొలువై పూజలందుకున్న అమ్మవారు, మూడవ రోజు శాంతి మరియు ప్రశాంతతకు ప్రతీకగా గాయత్రీమాత రూపంలో దర్శనమిస్తారు. దుర్గామాతను ఈ రూపంలో కొలిస్తే సమస్యలను దూరం చేస్తుందని భక్తులు విశ్వసిస్తారు.

ఈ రోజు పసుపు రంగు వస్త్రాలను అమ్మవారికి అలంకరిస్తారు. భక్తులు అమ్మవారిని ప్రసన్నం చేసుకోవడానికి పాలు నైవేద్యంగా అందిస్తారు. అన్ని మంత్రాలకు మూల శక్తి గాయత్రీ మంత్రం. మూడో రోజు ముక్త, విద్రుమ, హేమ, నీల, ధవళ వర్ణాలు కలిగిన ఐదు ముఖాలతో శంఖం, చక్రం, గద, అంకుశం, ధరించి దర్శనమిస్తుంది.



గాయత్రీ ఉపాసనతో మంత్రసిద్ధి, బ్రహ్మ జ్ఞానం కలుగుతాయి. గాయత్రీ మంత్ర జపంతో చతుర్వేద పారాయణ ఫలితం లభిస్తుంది. 'ఓం భూర్భువస్వ: తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య థీమహి ధియోయోన: ప్రచోదయాత్' అనే మంత్రాన్ని జపిస్తూ అమ్మని ప్రార్థించాలి.

శ్లోకం: ముక్తావిద్రుమ హేమనీల ధవళచ్ఛాయైుర్ముఖైస్త్రీక్షణై:

యుక్తామిందుని బద్ధరత్న మకుటాం తత్త్వార్ధ వర్ణాత్మికామ్,

గాయత్రీం వరదాభయాంకుశ కశాశ్శుభ్రం కపాలం గదాం

శంఖం చక్ర మధారవింద యుగళం హస్తైర్వహంతీ భజే

Tags

Read MoreRead Less
Next Story