Dasara Navaratri 2021: 9వ రోజు అమ్మవారు అన్నపూర్ణాదేవి అలంకారంలో..

Dasara Navaratri 2021: 9వ రోజు అమ్మవారు అన్నపూర్ణాదేవి అలంకారంలో..
Dasara Navaratri 2021:నవరాత్రి తొమ్మిది రోజుల పండుగ. భక్తులు తొమ్మిది రూపాల్లో దుర్గాదేవిని పూజిస్తారు.

Dasara Navaratri 2021: నవరాత్రి తొమ్మిది రోజుల పండుగ. భక్తులు తొమ్మిది రూపాల్లో దుర్గాదేవిని పూజిస్తారు. భారతదేశమంతటా హిందువులు అత్యంత ఉత్సాహంతో జరుపుకునే ముఖ్యమైన పండుగలలో దసరా ఒకటి. ఒక సంవత్సరంలో మొత్తం నాలుగు నవరాత్రులు ఉన్నాయి, కానీ కేవలం రెండు - చైత్ర నవరాత్రి మరియు శరద్ నవరాత్రి మాత్రమే ఎక్కువగా జరుపుకుంటారు.

దేశంలోని వివిధ ప్రాంతాలలో ప్రజలు ఒకే పండుగను విభిన్నంగా జరుపుకుంటారు. వారు ఒకే దేవుడిని ఆరాధించినప్పటికీ, విభిన్న ఆచారాలను నిర్వహిస్తారు. దసరా నవరాత్రులను, విజయదశమి వేడుకలను ఆయా ప్రాంత ఆచారాలను బట్టి నిర్వహిస్తుంటారు. అమ్మవారిని భక్తి శ్రద్ధలతో కొలిచి అమ్మ కృపకు పాత్రులవుతారు.

సంస్కృతంలో 'నవరాత్రి' అంటే 'తొమ్మిది రాత్రులు'.

ఈ తొమ్మిది రాత్రులు, ప్రజలు ఉపవాసం పాటిస్తారు. తొమ్మిది రూపాల్లో కొలువై ఉన్న దుర్గామాతకు ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు. దుర్గామాత పార్వతీదేవి అవతారం. మహిషాసురుడిని అంతం చేయడానికి ఆమె దుర్గా దేవి అవతారం ఎత్తుతుంది. దుర్గమ్మను తొమ్మిది రూపాల్లో అలంకరింది తొమ్మిది ప్రసాదాలు నైవేద్యంగా పెడతారు.

మొదటి రోజు బాలా త్రిపుర సుందరిగా, రెండవరోజు బ్రహ్మచారిణిగా, మూడవ రోజు గాయత్రి మాతకా కొలువై ఉన్న అమ్మవారు నాల్గవ రోజు అన్నపూర్ణా దేవి రూపంలో భక్తులకు దర్శనమిస్తారు.

4. అన్నపూర్ణాదేవి అలంకారం

ఈరోజు అమ్మవారిని అన్నపూర్ణాదేవిగా అలంకరిస్తారు. ఈ దేవిని కాషాయం రంగు వస్త్రంతో అలంకరిస్తారు. ఈ రంగు గుణానికి సంకేతం. ఆ తల్లి అనుగ్రహంతో సమస్త జీవులకు ఆహారం చేకూరుతుంది. ఆ తల్లి అన్ని జీవరాసులకు ఆహారాన్ని ఇస్తుంది. అమ్మను శాంతపరచడానికి గారెలను నైవేద్యంగా పెడతారు.

Tags

Read MoreRead Less
Next Story