కష్టాలు తొలగించే గజానన్ సంకష్ట వ్రతం.. శుభ ముహూర్తం, పూజా విధానం

కష్టాలు తొలగించే గజానన్ సంకష్ట వ్రతం.. శుభ ముహూర్తం, పూజా విధానం
పవిత్రమైన శ్రావణ మాసంలో వచ్చే సంకష్టాన్ని గజానన్ సంకష్ఠ చతుర్థి అని పిలుస్తారు. ఆ రోజు గణపతి మరియు విష్ణుమూర్తిలను భక్తితో పూజించి వ్రతమాచరిస్తారు భక్తులు.

పవిత్రమైన శ్రావణ మాసంలో వచ్చే సంకష్టాన్ని గజానన్ సంకష్ఠ చతుర్థి అని పిలుస్తారు. ఈ వ్రతంలో గణపతి మరియు విష్ణుమూర్తిలను భక్తితో పూజించి వ్రతమాచరిస్తారు.

కృష్ణ పక్ష నాలుగవ రోజు (చతుర్థి తిథి) సందర్భంగా, మహారాష్ట్ర భక్తులు మరియు దేశంలోని మిగిలిన ప్రాంతాలు గజానన్ సంకష్టి లేదా సంకట్ హరా చతుర్థి వ్రతాన్ని పాటిస్తారు. ఏ విఘ్నాలు లేదా అవాంతరాలు లేని సుఖమైన జీవితం కోసం వ్రతాన్ని ఆచరిస్తుంటారు.

గజానన్ సంకష్టి సమయంలో ఏం చేయకూడదు?

- బియ్యం, గోధుమలు, పప్పు ధాన్యాలు ఏ రూపంలోనూ తినకూడదు. పండ్లు, పాలు తీసుకోవచ్చు.

తెల్లవారుజాము నుండి రాత్రి పూట ఆకాశంలో చంద్రుడు పూర్తి రూపం దాల్చే వరకు ఈ వ్రతాన్ని ఆచరించాలి.

- ఆ రోజున బ్రహ్మచర్యాన్ని కొనసాగించాలి. అంటే, జీవిత భాగస్వామి లేదా భాగస్వామితో అన్ని రకాల సన్నిహిత సంబంధాలను నివారించాలి.

ఆ రోజును ఒక సెలవుదినంగా తీసుకోకూడదు. అంటే ఉదయాన్నే మేల్కోవాలి. తెల్లవారకముందే, స్నానం చేయాలి. రోజంతా వ్యక్తిగత పరిశుభ్రతను పాటించాలి.

గజానన్ సంకష్టి పూజ శుభ ముహూర్తం..

గజానన్ సంకష్టి వ్రతం ఆచరించేందుకు ఈసారి మొత్తం మూడు ధర్మ ముహూర్తాలు ఉన్నాయి. అవి:

అభిజీత్ ముహుర్తం - 11:59 AM నుండి 12:55 PM వరకు

విజయ్ ముహుర్తం - 2:44 PM నుండి 3:38 PM వరకు

గోధూళి ముహుర్తం - 7:05 PM నుండి 7:29 PM వరకు

గజానన్ సంకష్టి పూజ విధి విధానం..

పై ముహుర్తాలలో దేనినైనా తీసుకుని గణేశుడిని ఆరాధించవచ్చు. మొదట ధ్యానం చేయడం ద్వారా గణేశుడిని ప్రార్థించాలి. నూనె లేదా నెయ్యితో దీపాన్ని వెలిగించి ఆ రోజంత దీపం కొండెక్కకుండా చూసుకోవాలి. మీకోసం, మీ కుటుంబసభ్యుల శ్రేయస్సు కోసం గణేశుడి శ్లోకాలు, మంత్రాలు జపించండి.

Tags

Read MoreRead Less
Next Story