తెలిసీ తెలియక ఇలాంటి పనులు చేస్తే 'లక్ష్మీదేవి'..

తెలిసీ తెలియక ఇలాంటి పనులు చేస్తే లక్ష్మీదేవి..
తెలిసీ తెలియకుండా చేసి కొన్ని తప్పులు లక్ష్మీ దేవి ఇంటిని వదిలి వెళ్లడానికి కారణమవుతాయి.

లక్ష్మీదేవి అనుగ్రహం ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. సిరిసంపదలు ప్రతి ఇంటా వెల్లి విరియాలంటే ఆ దేవిని ఆరాధించడంతో పాటు అమ్మవారి ఆగ్రహానికి గురికాకుండా ఉండాలి. ప్రశాంతత ఉన్న గృహంలోనే లక్ష్మీదేవి తాండవిస్తుందని నమ్ముతారు. తెలిసీ తెలియకుండా చేసి కొన్ని తప్పులు లక్ష్మీ దేవి ఇంటిని వదిలి వెళ్లడానికి కారణమవుతాయి. వాటి గురించి తెలుసుకుందాం..

ఇంట్లో పాత్రలను ఎలాపడితే అలా ఉంచకూడదు. రాత్రిపూట కిచెన్‌లోని సింకులో ఎంగిలి పాత్రలను అలానే ఉంచకూడదు. ఇది మంచి విషయం కాదు. ఇలా చేయడం ద్వారా లక్ష్మీ దేవి ఇంటి నుంచి వెళ్లిపోతుందని నమ్ముతారు. అందువల్ల ఇంటిని అన్ని సమయాల్లో శుభ్రంగా ఉంచడానికి ప్రయత్నించాలి.

వాస్తు శాస్త్రం ప్రకారం ఉత్తరాన కుబేర స్థానం ఉంటుంది. ఇది లక్ష్మీ దేవి యొక్క దిశగా పరిగణించబడుతుంది. కాబట్టి ఇంటి ఉత్తరాన వ్యర్థాలు నిల్వ చేయవద్దు. ఇంటిలోని ఈ భాగం సానుకూల శక్తితో నిండి ఉంటుంది. కనుక ఆ దిశలో చెత్తను ఉంచకుండా శుభ్రంగా ఉంచుకోవాలి.

అలాగే ఖాళీ పాత్రలు స్టవ్ పైన ఉంచకూడదు. స్టౌని కూడా ఎప్పుడూ శుభ్రంగా ఉంచాలి. ఇది ఇంట్లో ఆనందానికి, శాంతికి దారితీస్తుంది. ఖాళీ పాత్రలను స్టౌపైన ఉంచడం ద్వారా లక్ష్మీ దేవి ఇంట్లో నివసించదు. పూజ గది తర్వాత ఇంట్లో వంట గది అత్యంత అనువైన ప్రదేశం.

సాయింత్రం ఆరుగంటల తరువాత ఇల్లు ఊడ్చకూడదు. ఆ సమయంలో తుడవడం దురదృష్టానికి సూచికగా పరిగణించబడుతుంది. లక్ష్మీదేవి చీపురులో నివసిస్తుందని నమ్ముతారు. సూర్యాస్తమయం సమయంలో చీపురు ఉపయోగిస్తే లక్ష్మీదేవి ఇంటి నుంచి వెళ్లిపోతుంది.

అలాగే గంధపు చెక్కను ఒక చేత్తో రుద్దకూడదు. అలా చేస్తే విష్ణుమూర్తిని అవమానించినట్లవుతుంది. లక్ష్మీదేవికి కోపం వచ్చి ఇంటి నుంచి వెళ్లి పోతుంది. లక్ష్మీదేవిని ఆరాధించే వారు విష్ణుమూర్తిని కూడా ఆరాధించాలి. ఇద్దరినీ లక్ష్మీనారాయణన్ అంటారు. లక్ష్మీదేవి పూర్తి ఆశీర్వాదం పొందడానికి, లక్ష్మితో పాటు విష్ణువును పూజించాలి.

సూర్యోదయానికి ముందే మేల్కోవాలి. ఇంటా, బయట మహిళను గౌరవించాలి. మహిళను అవమానించడం లేదా వేధించడం ద్వారా లక్ష్మీదేవి ఇంటి నుంచి వెళ్లిపోతుందని చెబుతారు. అదే విధంగా ఇంట్లో ఉన్న వృద్ధులను, పేదలను అవమానించడం కూడా దేవత కోపానికి కారణమవుతుంది. ఉన్నదానితో తృప్తి చెందాలి. మీ వద్ద ఉన్నదానితో తృప్తి చెందితే దేవత అనుగ్రహానికి పాత్రులవుతారు.

వీలైనంత వరకు పేదలకు సహాయం చేయాలి. మీ సంపద మీ వద్దే ఉంచుకుంటే లక్ష్మీదేవి కోపానికి బలవుతారు. స్వార్థాన్ని విడిచి పెట్టి, నిస్వార్థంగా ఉన్నప్పుడే లక్ష్మీదేవి మీరు కోరుకోకుండానే సంపదను సంతృప్తికరంగా ఇస్తుంది.

Tags

Read MoreRead Less
Next Story