పూరిలోని జగన్నాథ్ ఆలయం.. 11 ఆశ్చర్యకరమైన వాస్తవాలు

పూరిలోని జగన్నాథ్ ఆలయం.. 11 ఆశ్చర్యకరమైన వాస్తవాలు
ఇది 1078 సంవత్సరంలో సహస్రాబ్ది క్రితం నిర్మించిన ఒక శక్తివంతమైన చారిత్రక నిర్మాణంగా పేర్కొంటారు.

ఒడిశాలో ఉన్న ప్రసిద్ధ పుణ్యక్షేత్రం పూరి జగన్నాథ్ ఆలయాన్ని జీవితంలో ఒక్కసారైనా సందర్శించాలని భక్తులు విశ్వసిస్తారు. ఈ ఆలయ నిర్మాణంలో ఎన్నో అధ్భుతాలు దాగున్నాయి. వాటి గురించి తెలుసుకుందాం. ఈ జగన్నాథుని ఆలయ నిర్మాణానికి మూడు తరాలు పట్టింది. చార్-ధామ్ తీర్థయాత్రలో భాగంగా భక్తులు ఈ ఆలయాన్ని కూడా సందర్శిస్తారు. ఇది 1078 సంవత్సరంలో సహస్రాబ్ది క్రితం నిర్మించిన ఒక శక్తివంతమైన చారిత్రక నిర్మాణంగా పేర్కొంటారు. స్వామి జగన్నాథుడి ఆశీర్వాదం పొందడానికి లక్షల మంది ప్రజలు ఒడిశాను సందర్శిస్తారు.

ఈ ఆలయంలో ప్రతి ఏటా నిర్వహించే రథయాత్ర ప్రసిద్ధి చెందింది. మూడు భారీ రథాల్లో దేవుళ్లను ఊరేగించేటప్పుడు జనం తండోపతండాలుగా ఇక్కడికి చేరుకుంటారు. స్వామి ఊరేగింపుని కనులారా చూసేందుకు భక్తులు పోటీపడుతుంటారు. జగన్నాథుని రథ యాత్ర ప్రపంచవ్యాప్తంగా ప్రయాణికుల దృష్టిని ఆకర్షించింది. ఈ ఆలయంలో కనిపించే మరికొన్ని అద్భుతాలు.

1. ప్రకృతి ప్రవర్తనా నియమావళిని ధిక్కరించడం




ఈ విషయం ఒక చిన్న పిల్లవాడిని అడిగినా చెబుతాడు. గాలి ఎటు వైపు వీస్తే అటు వైపే పట్టుకున్న గాలి పటం వెళుతుందని కానీ జగన్నాథ్ ఆలయం పైభాగంలో అమర్చిన జెండాకు ప్రత్యేకమైన మినహాయింపు ఉందేమో అనిపిస్తుంది. ఈ ప్రత్యేకమైన జెండా గాలికి వ్యతిరేక దిశలో ఎగురుతుంది.

2. అధిరోహణ

ప్రతిరోజూ ఒక పూజారి 45 అంతస్తుల భవనానికి సమానమైన ఎత్తులో ఉన్న ఆలయ గోపురం పైన జెండాను మార్చుతారు. ఈ ఆచారం ఆలయం నిర్మించిన రోజు నుండి కొనసాగుతోంది. ఎటువంటి రక్షణ చర్యలు తీసుకోకుండానే కేవలం చేతులతో పైకి ఎక్కి జెండాను మార్చుతారు పూజారులు. ఏదైనా ఒకరోజు ఈ పని చేయకపోతే ఆలయం 18 సంవత్సరాల పాటు మూసివేయబడుతుంది.

3. ఈ ఆలయానికి నీడ కనిపించదు.

రోజులో ఏ సమయంలోనైనా ఈ విధంగానే ఉంటుంది. ఇది ఆలయ అద్భుత నిర్మాణ కౌశలాన్ని స్పష్టం చేస్తుంది. ఇది మానవాళికి జగన్నాథ్ ప్రభువు ఇచ్చిన సందేశం కావచ్చు అని భక్తులు విశ్వసిస్తారు.

4. సుదర్శన్ చక్రం యొక్క చిక్కు



ఆలయ శిఖరం పైన ఉన్న సుదర్శన్ చక్రంలో రెండు రహస్యాలు ఉన్నాయి. మొదటి విచిత్రం ఒక టన్ను బరువున్న హార్డ్ మెటల్. ఆలయం నిర్మించిన ఆ శతాబ్దంలో ఎలాంటి యంత్రాలు లేకుండా కేవలం మానవ శక్తితో అంత బరువున్న సుదర్శన చక్రాన్ని అక్కడకు ఎలా చేర్చారో అన్నది అంతుపట్టని విషయం. రెండవది చక్రానికి సంబంధించిన నిర్మాణ సాంకేతికత. మీరు చూసే ప్రతి దిశ నుండి ఒకే విధంగా కనిపించేలా రూపొందించబడింది.

5. దేవునికి పైన ఏమీ లేదు.

ఆకాశంలో పక్షులు స్వేచ్చగా విహరిస్తాయి. వాటికి ఆకాశమే హద్దు. పక్షులు నిజానికి ఆలయ గోపురాలపై విశ్రాంతి తీసుకోవడం, ఎగురుతూ ఉండటం మనం చూస్తాము. కానీ, ఈ ప్రత్యేక ప్రాంతం అందుకు మినహాయింపు. ఆలయ గోపురం పైన ఒక్క పక్షి కూడా ఎగరదు.

6. ఆహారం ఇక్కడ ఎప్పుడూ వృధా కాదు



ఆహారాన్ని వృధా చేయడం మంచిది కాదు. ఆలయ సిబ్బంది అదే అనుసరిస్తారు. ఈ ఆలయాన్ని సందర్శించే వారి సంఖ్య ప్రతిరోజూ 2 వేల నుండి 2 లక్షల మధ్య ఉంటుంది. నిజంగా అద్భుతం కాకపోతే మరేమిటి.. ప్రతిరోజూ తయారుచేసిన ప్రసాదం ఎప్పుడూ వృధా కాదు, రుచి కూడా ఒకే విధంగా ఉంటుంది.

7. సముద్ర ఘోష వినిపించదు



మీరు సింహ ద్వార నుండి ఆలయం లోపల మొదటి అడుగు వేసిన తరువాత, సముద్రపు తరంగాల సవ్వడి మీకు వినిపించదు. మీరు ఆలయం నుండి బయలుదేరినప్పుడు శబ్దం తిరిగి వస్తుంది. భక్తుల విశ్వాసం ప్రకారం ఆలయ ద్వారం లోపల ప్రశాంతత కోరుకునే ఇద్దరు ప్రభువుల సోదరి సుభద్ర మాయి సంకల్పం అని చెబుతారు. అందువల్ల ఆమె సంకల్పం సక్రమంగా నెరవేరింది అని అంటారు.

8. గాలి వ్యతిరేక దిశలో

భూమిపై ఏ ప్రదేశమైనా తీసుకోండి. పగటిపూట సముద్రం నుండి వచ్చే గాలి భూమికి చేరుకుంటుంది. కానీ, పూరిలో దానికి వ్యతిరేకంగా జరుగుతుంది. పగటిపూట, గాలి భూమి నుండి సముద్రానికి వీస్తుంది. సాయంత్రం దీనికి విరుద్ధంగా జరుగుతుంది.

9. ప్రసాదం వండే పద్ధతి కూడా విచిత్రంగా..



ఇక్కడ ఒక సాంప్రదాయ పద్దతిని అనుసరించి ప్రసాదం వండుతారు. సరిగ్గా ఏడు కుండలను ఒకదానిపై ఒకటి అమర్చి కట్టెలు ఉపయోగించి వండుతారు. ముందు పైన అమర్చిన కుండలోని పదార్థం ఉడుకుతుంది. ఆ తరువాత మిగిలినవి అదే క్రమాన్ని అనుసరించి ఉడుకుతాయి. ప్రతి రోజూ ఈ విధంగానే ప్రసాదాన్ని తయారు చేస్తారు పూజారులు.

10. దేవతలు విచ్ఛిన్నం

ప్రతి 14 నుండి 18 సంవత్సరాలకు దేవతలను ఖననం చేస్తారు. వాటి స్థానంలో కొత్త విగ్రహాలు అమరుస్తారు. ఈ దేవతలు వేప చెక్కతో తయారవుతాయి. 14 సంవత్సరాల తర్వాత అవే స్వంతంగా విచ్ఛిన్నమవుతాయని నమ్ముతారు.

11. రథయాత్ర



రథయాత్రలో దేవతలను ఊరేగిస్తారు. ఆలయం వెలుపల ఉన్న రథాల్లో విగ్రహాలను ఉంచి తీసుకువెళతారు. ఈ విగ్రహాలను 3 పడవల్లో ఎక్కించి నదిని దాటిస్తారు. అక్కడి నుంచి రెండవ రథంలోకి విగ్రహాలను ఎక్కించి మౌసీ మా ఆలయానికి దేవతలను తీసుకువెళతారు.

Tags

Read MoreRead Less
Next Story