కృష్ణానది తీరంలో ఆధ్యాత్మిక శోభ

కృష్ణానది తీరంలో ఆధ్యాత్మిక శోభ

శార‌దా పీఠం ఉత్తరాధికారి స‌న్యాస స్వీకార మ‌హోత్సవం వైభవంగా సాగుతోంది. స్వరూపానందేంద్ర స్వామి ఆశీస్సులతో కాషాయ ధార‌ణ‌కు బాల స్వామి సిద్ధమ‌వుతున్నారు. కృష్ణా న‌దీ తీరంలో ఉండ‌వ‌ల్లి క‌ర‌క‌ట్టపై గ‌ణ‌ప‌తి స‌చ్చిదానంద ఆశ్రమంలో ఉత్తరాధికారి స‌న్యాస స్వీకార మ‌హోత్సవంతో ఆధ్యాత్మిక అల‌లు వీచాయి.

ఆదివారం ఉదయం 8 గంటల నుంచే కృష్ణా న‌దీ తీరంలో ఆధ్యాత్మిక‌త శోభ వెల్లివిరిసింది. మ‌ధ్యాహ్నం 12 గంటల వరకు సన్యాసాంగ అష్ట శ్రాద్దాలు తరువాత శాస్త్ర, అహితాగ్ని, వాక్యార్ధ మహాసభలు నిర్వహించారు. బాల స్వామి ద‌గ్గరుండి స్వామి స్వరూపానందేంద్ర బాల స్వామితో హోమాలు నిర్వహింప‌జేశారు. చంద్ర మౌళీశ్వర స్వామికి అభిషేకం నిర్వహించారు. భ‌క్తుల‌కు తీర్థ ప్రసాదాలు అందించారు.

శార‌దా పీఠ ఉత్తరాధికారి స‌న్యాస స్వీకార మ‌హోత్సవంలో ఆఖ‌రి రోజు కీల‌క ఘ‌ట్టం ఉంటుంది. విశాఖ శారదా పీఠానికి ఉత్తరాధికారిగా కిరణ్‌కుమార్ శర్మ కాషాయ వ‌స్త్రధార‌ణ‌తో ఆఖ‌రి రోజు ద‌ర్శనమిస్తార‌ని వివ‌రించారు. చివ‌రి రోజు ఉదయం 9 గంటలకు నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు వైశ్వానర స్థాలీపాకం, విరజాహోమాలు, సావిత్రీ ప్రవిలాపనం, శిఖా, కటిసూత్ర, యజ్ఞోపవీత పరిత్యాగం, ప్రేషోచ్చారణం, కాషాయ, దండ, కమండలలు ధారణ, గురుసమీపగమనం, ప్రణవ, మహావాక్యోపదేశం ఉంటాయి. మధ్యాహ్నం 3 గంటల నుంచి జగదుర్గు శ్రీ చరణులచే బాలస్వామి వారికి యోగ పట్టా అనుగ్రహం చేస్తారు. ఈ కార్యక్రమానికి ముగింపు ఘ‌ట్టంలో ముగ్గురు సీఎంలు కేసీఆర్, జ‌గ‌న్, న‌వీన్ ప‌ట్నాయ‌క్ లు హాజ‌రు కానున్నారు. వుతున్నార‌ని భ‌ర‌త్ రెడ్డి తెలిపారు.

Tags

Read MoreRead Less
Next Story