స్త్రీ రూపంలో పూజలు అందుకుంటున్న హనుమంతుడు…ఎక్కడంటే?

స్త్రీ రూపంలో పూజలు అందుకుంటున్న హనుమంతుడు…ఎక్కడంటే?
ఆంజనేయుని వీరభక్తుడైన రతన్‌పూర్ రాజు ఈ ఆలయాన్ని నిర్మించినట్టుగా ఆలయ పురాణం చెబుతుంది.

శ్రీరాముడికి హనుమంతుడికి మించిన భక్తుడు మరొకరు ఉండరు. చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరికి హనుమ అంటే చాలా ఇష్టం, భక్తి. ఇక ధైర్యసాహసాలకు పెట్టింది పేరు కూడా ఆయనే.. అలాంటి హనుమంతుడికి ప్రతి ఊరులోను దేవాలయాలు ఉన్నాయి. ద్వీముఖ ఆంజనేయుడిగా, పంచముఖ హనుమాన్‌‌గా భక్తులకి దర్శనం ఇస్తుంటాడాయన.. అటు ఆంజనేయుడు ఆ జన్మ బ్రహ్మచారి అని అందరికి తెలుసు.. అయితే హనుమంతుడిని స్త్రీ రూపంలో పూజించే ఆలయం ఉందని మీకు తెలుసా?

అవును మీరు చదివింది నిజమే... ఈ ఆలయం ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలోని రతన్‌పూర్ జిల్లాలోని గిర్జాబంద్‌లో ఉంది. ఇక్కడ హనుమ స్త్రీ రూపంలో కొలువై భక్తులకి దర్శనం ఇస్తున్నాడు. ఈ ఆలయంలో ఉన్న మరో ప్రత్యేకత ఏంటంటే.. రాముడు, సీతాదేవిలను తన భుజాలపై మోస్తున్న ఆంజనేయుని విగ్రహాన్ని మనం చూడవచ్చు. ఈ హనుమంతుని విగ్రహం దక్షిణముఖంగా ఉంటుంది. అందుకే ఇక్కడ స్వామివారిని దీనిని దక్షిణమూర్తి హనుమ అని కూడా అంటారు. ఇక్కడ భక్తుల కోరికలు కోరుకుంటే తప్పకుండా నెరవేరుతాయని భక్తుల ప్రగాడ విశ్వాసం.

ఆంజనేయుని వీరభక్తుడైన రతన్‌పూర్ రాజు ఈ ఆలయాన్ని నిర్మించినట్టుగా ఆలయ పురాణం చెబుతుంది. రతన్‌పూర్‌ను పృథ్వీ దేవజు అనే రాజు చాలా సంవత్సరాలు పరిపాలించాడు. ఒకానొక సందర్భంలో ఆయనకీ కుష్టు వ్యాధి సోకి ఇబ్బంది పడడంతో ఆయనకి ఓ రోజు రాత్రి కలలో హనుమంతుడు కనిపించి తన ఆలయం నిర్మించమని ఆదేశించాడట. ఆలయ పనులు ముగిసే సమయం వచ్చేసరికి మరోసారి స్వామివారు ఆ రాజుకి కలలో కనిపించి మహామాయ కుండ్ వద్ద ఉన్న విగ్రహాన్ని తెచ్చి ఆ ఆలయంలో ప్రతిష్ట జరపమని ఆదేశించాడట.

మరుసటి రోజు అక్కడికి వెళ్లి చూడగా ఆంజనేయుడి విగ్రహం స్త్రీ రూపంలో కనిపించిందట. ఆ గుడి పూర్తయ్యే సరికి ఆ రాజు ఆరోగ్యం కుదుటపడిందని స్థల పురాణం చెపుతుంది. రతన్‌పూర్‌‌‌లో చాలా వేడి ఎక్కువ ఉంటుంది కాబట్టి, చలికాలంలో ఈ ఆలయాన్ని సందర్శించడం మేలు.. ఈ ప్రదేశాన్ని సందర్శించడానికి అక్టోబర్ మరియు మార్చి నెలలు ఉత్తమం

Tags

Read MoreRead Less
Next Story