Irumudi: శబరిమల అయ్యప్ప.. 'ఇరుముడి'లో ఏం ఉందయ్యా..

Irumudi: శబరిమల అయ్యప్ప.. ఇరుముడిలో ఏం ఉందయ్యా..
Irumudi: అంతటి మహిమాన్వితమైన ఆ ఇరుముడిలో ఏమేం ఉంటాయనేది చాలా మంది భక్తులకు కూడా తెలియని అంశం.

Irumudi: స్వామియే శరణం అయ్యప్ప అంటూ మాల ధరించిన అయ్యప్ప భక్తులు శబరిమలలోని ఆ స్వామిని దర్శించుకునేందుకు కాలినడకన కొండమీదకు పయనమవుతారు. నల్లని వస్త్రాలు ధరించి తలపైన ఓ నల్లటి మూటను ఉంచుకుని బయలుదేరుతారు. ఆ మూటనే ఇరుముడిగా పిలుస్తారు.

దర్శనానికి బయలుదేరే ముందు గురుస్వామి ఒక్కొక్కరికి ఇరుముడిని అందజేస్తారు. అత్యవసర సమయాల్లో తప్ప దానికి కింద పెట్టకూడదని చెబుతారు. అంతటి మహిమాన్వితమైన ఆ ఇరుముడిలో ఏమేం ఉంటాయనేది చాలా మంది భక్తులకు కూడా తెలియని అంశం.

అయ్యప్ప ఆరాధనలో ఇరుముడి ఒక ముఖ్యమైన భాగం. శబరిమల యాత్రకు ఇరుముడితో విడదీయరాని బంధం ఉంది. ఇరు అంటే రెండు అని, ముడి అంటే కట్ట అని అర్ధం చెబుతారు అయ్యప్ప భక్తులు. ఇరుముడిని తయారు చేయడాన్ని కెట్టు నిరక్కల్ లేదా పల్లికెట్టు అని కూడా అంటారు. 41 రోజులు దీక్ష తీసుకున్న భక్తులు ఇరుముడి కెట్టును తలపై ఉంచుకుని స్వామి దర్శనానికి వెళతారు.

అయ్యప్ప స్వామి గుడికి వెళ్లే 18 మెట్లు ఎక్కాలంటే ఇరుముడి కెట్టు తప్పనిసరి. ఇరుముడి లేని భక్తులను మెట్ల మార్గం గుండా అనుమతించరు. ఇరుముడి కెట్టు అనేది ఒక చిన్న సంచిలో రెండు కంపార్ట్‌మెంట్లు ఉంటాయి. ముందు భాగాన్ని మున్ముడి అని, వెనుక భాగాన్ని పిన్ముడి అని అంటారు. మున్ముడిలో ఉంచే సామాగ్రి స్వామి కోసం అయితే పిమ్మడిలో ఉంచేవి భక్తుని వ్యక్తిగత వస్తువులు ఉంటాయి.

ఇరుముడిలో నేతితో నింపిన కొబ్బరికాయ, రెండు కొబ్బరికాయలు, వక్కలు, తమలపాకులు, నాణాలు, పసువు, గంధంపొడి, విభూతి, పన్నీరు, బియ్యం, అటుకులు, మరమరాలు, బెల్లం, కలకండ, అగరువత్తులు, కర్పూరం,మిరియాలు, తేనె, ఎండుద్రాక్ష వంటి దేవునికి సమర్పించే వస్తువులు అన్నీ ముందు భాగంలో ఉంచుతారు. సంచి వెనుక భాగంలో వారి వ్యక్తిగత వస్తువులు, బట్టలు ఉంచి ముడి వేస్తారు. దీక్షాధారులు ఇరుముడిని తలమీద పెట్టుకుని ప్రయాణం చేయవలసి ఉంటుంది.

Tags

Read MoreRead Less
Next Story