TTD : శ్రీవారి బ్రహ్మోత్సవాల తేదీలు ఖరారు చేసిన టీటీడీ..!

TTD : శ్రీవారి బ్రహ్మోత్సవాల తేదీలు ఖరారు చేసిన టీటీడీ..!
TTD : తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల తేదీలను టీటీడీ ఖరారు చేసింది. అక్టోబర్ 7వ తేదీ నుంచి 15 వరకు బ్రహ్మోత్సవాలు జరగనున్నట్లు తెలిపింది.

TTD : తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల తేదీలను టీటీడీ ఖరారు చేసింది. అక్టోబర్ 7వ తేదీ నుంచి 15 వరకు బ్రహ్మోత్సవాలు జరగనున్నట్లు తెలిపింది. కరోనా నిబంధనలనకి అనుగుణంగా ఈ ఏడాది కూడా ఏకాంతంగా స్వామివారి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తామని పేర్కొంది. ఈ బ్రహ్మోత్సవాలకి భక్తులను అనుమతించడం లేదని వెల్లడించింది. స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీవారి వాహనసేవల వివరాలను తిరుమల తిరుపతి దేవస్థానం ప్రకటించింది.

06-10-2021: అంకురార్పణ (సాయంత్రం 6 నుంచి 7 గంటల వ‌ర‌కు)

07-10-2021: ధ్వజారోహణం (ఉదయం) - పెద్దశేష వాహనసేవ (సాయంత్రం)

08-10-2021: చిన్నశేష వాహ‌నసేవ (ఉదయం) - హంస వాహనసేవ (సాయంత్రం)

09-10-2021: సింహ వాహ‌న సేవ (ఉదయం)- ముత్యపుపందిరి వాహ‌న సేవల (సాయంత్రం)

10-10-2021: క‌ల్పవృక్ష వాహ‌నసేవ (ఉదయం)- సర్వభూపాల వాహనసేవ (సాయంత్రం)

11-10-2021: మోహినీ అవ‌తారం (ఉదయం)- గ‌రుడ‌ వాహనసేవ‌ (సాయంత్రం)

12-10-2021: హ‌నుమంత వాహ‌నసేవ (ఉదయం)- గ‌జ వాహ‌నసేవ (సాయంత్రం)

13-10-2021: సూర్యప్రభ వాహ‌నసేవ (ఉదయం)- చంద్రప్రభ వాహ‌నసేవ (సాయంత్రం)

14-10-2021: రథోత్సవానికి బ‌దులుగా సర్వభూపాల వాహనసేవ (ఉదయం)- అశ్వ వాహ‌నసేవ (సాయంత్రం)

15-10-2021: ప‌ల్లకీ ఉత్సవం, తిరుచ్చి ఉత్సవం (ఉదయం)- ధ్వజారోహణం (సాయంత్రం)

Tags

Read MoreRead Less
Next Story