Tirupati laddu: శ్రీవారికి సమర్పించే 50 రకాల ప్రసాదాల ప్రత్యేకత..

Tirupati laddu: శ్రీవారికి సమర్పించే 50 రకాల ప్రసాదాల ప్రత్యేకత..
Tirupati laddu: 50 రకాల ప్రసాదాలను స్వామివారికి నైవేద్యంగా సమర్పిస్తారు.

Tirupati laddu: తిరుమల తిరుపతిలోని శ్రీవారి లడ్డూ కి ప్రపంచవ్యాప్తంగా పేరుంది. తిరుమలలోని మూలమూర్తికి సమర్పించే ప్రసాదాలను ఆగమశాస్త్రం ప్రకారం సమర్పిస్తారు. శ్రీవారికి సమర్పించే నైవేద్యాలలో మనకి తెలిసిన లడ్డునే కాకుండా 50 రకాల ప్రసాదాలను స్వామివారికి నైవేద్యంగా సమర్పిస్తారు.

ఆగమశాస్త్రం.. ఆ శ్రీనివాసునికి నిత్యం అందించే ప్రసాదాల గురించి వివరించింది. ఆ 50 రకాల ప్రసాదాల్లోను ఎన్నో ప్రత్యేకతలున్నాయి. వెయ్యేళ్ల కిందట శ్రీరామానుజాచార్యులు నిర్దేశించిన ప్రకారమే.. ఇప్పటికీ వెంకన్నస్వామికి ప్రసాదాలను నివేదిస్తున్నారు.

సుప్రభాత సమయంలో నవనీతం, గోక్షీరంతో తయారుచేసిన పదార్థాలను స్వామివారికి నివేదిస్తారు. తోమాల సేవ పూర్తి అయిన తరువాత నల్లనువ్వులు, బెల్లం, శొంఠితో కూడిన ప్రసాదం ఉంటుంది. సహస్రనామార్చన తరవాత మీగడ, వెన్న, పెరుగుతో పాటు అన్నాన్ని నైవేద్యంగా ఉంచుతారు.



మధ్యాహ్న ఆరాధనలో నాదుకం, లడ్డూ, దోసె, వడ, అప్పాన్ని స్వామివారికి సమర్పిస్తారు. సాయంకాలం అష్టోత్తర శతనామార్చన తరువాత శుద్ధన్నం, సీరా ప్రసాదాలుగా ఉంటాయి. రాత్రి నైవేద్య సమయంలో మిరియాలతో తయారుచేసిన మరీచ్చాన్నం, ఉడాన్నం.. రాత్రి ఆరాధన తరవాత విశ్రాంతి సమయంలో పాయసం స్వామికి నైవేద్యంగా పెడతారు.

మూడువందల యాభై ఏళ్ళ క్రితం కేవలం బియ్యప్పిండితో చేసిన లడ్డూను భక్తులకు శ్రీవారి ప్రసాదంగా అందించేవారు. బియ్యప్పిండి, బెల్లం కలిపి తయారు చేసిన ఈ లడ్డూలను "మనోహరం" అని పిలిచేవారు. కాని.. శ్రీ వెంకటేశ్వర స్వామీ కి అందిచే అనేక రకాల ప్రసాదాలలో శ్రీవారి లడ్డూకి ఉన్న ప్రాధాన్యత భక్తులకు బాగా తెలుసు.

రుమల వెంకన్న స్వామి దర్శనానికి వెళితే.. లడ్డూ లేకుండా ఇంటి ముఖం పట్టరు. ఇంటికి వచ్చాక.. ఆ ప్రసాదాన్ని స్వామివారి దగ్గర పెట్టి.. కుటుంబ సభ్యులతోపాటు ఇంటిల్లిపాదికి ఇస్తారు. చుట్టుపక్కల వాళ్లు, స్నేహితులు, బంధువులకు అందిస్తారు. ఆ ప్రసాదానికి భక్తుల మనసులో ఉన్న చోటు అలాంటిది.

భక్తులు భక్తి శ్రద్ధలతో మహా ఇష్టంగా స్వీకరించే ప్రసాదాల్లో తిరుపతి లడ్డూదే తొలిస్థానం. ఎందుకంటే ఈ లడ్డుకి ఉండే రుచి, మాధుర్యం, సువాసన ప్రపంచంలోనే మరే లడ్డూకి ఉండదు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఈ లడ్డూలకి "జియోగ్రపికాల్ పేటెంట్" కూడా ఉంది.

అంటే శ్రీవారి లడ్డు తయారీ విధానాన్ని మరెవరు అనుకరించడానికి వీలుండదు. మొదట్లో.. లడ్డు తయారిలో ఉపయోగించే బూందీని స్వామివారికి ప్రసాదంగా అందించేవారు. తరువాత కాలంలో ఆ తీపి బూందీయే శ్రీవారి లడ్డు ప్రసాదంగా ప్రాచుర్యంలోకి వచ్చింది. శ్రీవారి లడ్డులో వాడే ముడిసరుకులని "దిట్టం" అని పిలుస్తారు.

ఈ లడ్డూని తయారు చేసే వంటశాలని "పోటు" అని పిలుస్తారు. ప్రతి రోజు లక్ష లడ్డూలని తయారు చేసే సామర్థ్యం ఉంది తిరుమలలోని పోటుకి. పూర్వకాలంలో స్వామివారికి సమర్పించే ప్రసాదాన్ని 'తిరుప్పొంగం" అని పిలిచేవారు.

తరువాత కాలంలో సుఖీయం, అప్పం, వడ, అత్తిరసం, మనోహరపడి వంటివి కూడా స్వ్వామివారికి ప్రసాదంలా అందించేవారు. వీటిలో వడ తప్ప మిగతా ప్రసాదాలన్నీ ఎక్కువసేపు ఉండేవి కావు. అందుకే దూర ప్రాంతాల నుండి వచ్చే భక్తులు వడ పైనే ఎక్కువ మక్కువ చూపించేవారు.

భక్తుల కోరిక గమనించిన ప్రభుత్వం తొలిసారిగా 1803లో శ్రీవారి ఆలయంలో ప్రసాదాలు విక్రయించడం ప్రారంభించింది. ఇలా అనేక రూపాలు మారుతూ వచ్చిన శ్రీవారి ప్రసాదం.. చివరకు 1940లో తిరుపతి లడ్డూగా స్థిరపడింది. ప్రస్తుతం 2001లో సవరించిన "పడితరం దిట్టం" అనుసరిస్తూ లడ్దూని తయారు చేస్తున్నారు.

పడి అంటే 51 వస్తువులు అని అర్థం. దీని ప్రకారం.. 5100 లడ్డూల తయారీకి ఆవు నెయ్యి - 165 కిలోలు, శెనగపిండి 180 కిలోలు, చక్కెర - 400 కిలోలు, యాలుకలు - 4 కిలోలు, ఎండు ద్రాక్ష - 16 కిలోలు, కలకండ - 8 కిలోలు,

Tags

Read MoreRead Less
Next Story