Horoscope Today: ఈ రాశివారికి ఆకస్మిక ధనలబ్ధి

Daily Horoscope

రాశి ఫలాలు

Horoscope Today: ఈ రోజు వివిధ రాశుల వారి దినఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి

Horoscope Today: శ్రీ ప్లవ నామ సంవత్సరం| బుధవారం| ఆషాఢ మాసం, గ్రీష్మ ఋతువు, ఉత్తరాయణం | సూర్యోదయం : 5.34 | సూర్యాస్తమయం సా.6.35| తిథి శు.చవితి ఉ.6.56 వరకు తదుపరి పంచమి గురువారం తె.6.56 వరకు|నక్షత్రం పుబ్బ రా.2.59 వరకు| తదుపరి ఉత్తర|రాహుకాలం : ప. 12.00 నుంచి 1.30 వరకు| యమగండం ఉ.07.30 నుంచి 09.00 వరకు| వర్జ్యం ప.11.08 నుంచి 12.44 వరకు| దుర్ముహూర్తం ప.11.43 నుంచి 12.23 వరకు| అమృతఘడియలు ఉ.11.18.

ఈ రోజు రాశి ఫలాలు

మేషరాశి: ఈ రాశివారికి చేయపట్టిన ప్రయత్నాలు సఫలం అవుతాయి. ఇంటిలో సంతోషకర వాతావరణం నెలకొంటుంది. తరచుగా వేదిస్తున్న రుగ్మతల నుంచి విముక్తి కలుగుతుంది. సంఘంలో గౌరవ మర్యాదలు పొందుతారు. ఆకస్మిక ధనలాభం. వ్యాపారాలలో ఊహించని లాభాలు. ఉద్యోగస్తులకు శ్రమ తగ్గుతుంది.

వృషభరాశి: ఈ రాశివారికి అన్నింట వ్యయప్రయాసలు తప్పవు. చేపట్టిన వ్యవహారాలలో ఆటంకాలు కలుగుతాయి. దూరప్రయాణాలు చేయాల్సివస్తుంది. దైవచింతన ఎంతో అవసరం. బంధువులతో తగాదాలు . వ్యాపారాలు, ఉద్యోగాలలో కొత్త చిక్కులు రావొచ్చు.

మిథునరాశి: ఈ రాశివారికి సంఘంలో పరిచయాలు పెరుగుతాయి. ఆత్మీయుల ఆదరణ పొందుతారు. భూ,వాహనయోగాలు. ముఖ్య నిర్ణయాలు. శుభవార్తా శ్రవణం. వ్యాపారాలలో ఆశించిన లాభాలు. ఉద్యోగాలలో మరింత అనుకూలత.

కర్కాటకరాశి: ఈ రాశి ఉద్యోగార్ధులకు శుభవార్తలు వింటారు. వాహనయోగం ఉంది. ముఖ్య వ్యవహారాలు సాఫీగా పూర్తి చేస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు తొలగుతాయి.

సింహరాశి: ఈ రాశివారికి వ్యవహారాలలో అవాంతరాలు గోచరిస్తున్నాయి. కొత్త రుణాలు చేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. దైవదర్శనాలు చేసుకుంటారు. కుటుంబంలో కొన్ని సమస్యలు వస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు కొంత మందగిస్తాయి.

కన్యారాశి: ఈ రాశివారు రుణాలు చేస్తారు. కష్టపడ్డా ఫలితం ఉండదు. ఆరోగ్యభంగం కలుగుతుంది. పనుల్లో ప్రతిబంధకాలు. శ్రమాధిక్యంగా ఉంటుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో మార్పులు జరిగే వీలుంది.

తులారాశి: ఈ రాశివారు ఉత్సాహంగా పనులు పూర్తి చేస్తారు. ఒక సమాచారం ఊరటనిస్తుంది. నూతన ఉద్యోగయోగం. శ్రమ ఫలిస్తుంది. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఊహించని అభివృద్ధి.

వృశ్చికరాశి: ఈ రాశివారికి శుభవార్తాలు వింటారు. ధనలాభం. చిన్ననాటి మిత్రుల కలయిక. భూవివాదాలు పరిష్కారం. వాహనాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలు సంతృప్తినిస్తాయి.

ధనుస్సురాశి: ఈ రాశివారికి ఆశ్చర్యకరమైన సంఘటనలు తెలుస్తాయి. ఆర్థిక ఇబ్బందులు. కొత్త రుణాలు చేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. పనులు మధ్యలో వాయిదా వేస్తారు. వ్యాపారాలు కాస్త ఇబ్బంది కలిగిస్తాయి. ఉద్యోగాలలో ఒడిదుడుకులు అధికంగా ఉండే అవకాశం ఉంది.

మకరరాశి: ఈ రాశివారికి శ్రమాధిక్యం. పనులు నెమ్మదిగా పూర్తి చేస్తారు. ఆత్మీయులతో విభేదాలు. అనారోగ్యం. ఆకస్మిక ప్రయాణాలు చేస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో మార్పులు. ఆలయ దర్శనాలు చేస్తారు.

కుంభరాశి: ఈ రాశివారికి పనుల్లో పురోగతి ఉంటుంది. దూర ప్రాంతాల నుంచి శుభవార్తలు వింటారు. వాహనయోగం కలుగుతుంది. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. తమ వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో ఉన్నత పోస్టులు లభిస్తాయి.

మీనరాశి: ఈ రాశివారికి కొన్ని వ్యవహారాలు ముందుకు సాగవు. అనుకోని ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. దైవదర్శనాలు చేస్తారు. కుటుంబసభ్యులతో వివాదాలు తీరతాయి. ఆరోగ్యభంగం కలిగే అవకాశాలు కనిపిస్తు్న్నాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఆశించిన ఫలితాలు కనిపించవు.

Tags

Read MoreRead Less
Next Story