ఉప్పాడ చేనేతల అద్భుత సృష్టి జాందాని చీరలు

* నకిలీల బారినపడుతున్న చందానీ డిజైన్లు
* తమ ఆదాయాన్ని కొల్లగొడుతున్నారని చేనేతల ఆవేదన
ఆ ఊరి చేనేతల సృజనాత్మకతకు జాందానీ చీర ఒక నిదర్శనం. ఐతే కొందరు దానిని కాపీకొట్టి నేతన్నల పొట్టగొడుతున్నారు. తూర్పుగోదావరి జిల్లా ఉప్పాడలో తయారయ్యే జాందానీ చీరలపై ప్రత్యేక కథనం మీకోసం. ఇది తూర్పుగోదావరి జిల్లా ఉప్పాడ. ఇక్కడి జనాభాలో సగం మంది చేనేత కార్మికులు. ఉప్పాడ పట్టు చీరలు కంచి, ధర్మవరం, బెంగుళూరు, బనారస్ పట్టు చీరలమాదిరిగా ఎంతో పేరుగాంచినవి.
ఇక్కడి నేత కార్మికులు జందానీ అనే కొత్త రకం చీరకు రూపకల్పనచేసి తమ ప్రత్యేకతను చాటుకున్నారు. ఎటువైపు నుంచి చూసినా డిజైన్ ఒకేలా వుండటం దీని ప్రత్యేకత. అతికించినట్లుకానీ , అద్దినట్లుగానీ ఉండదు. సాధారణ నేత కార్మికులు ఈ చీర తయారు చేయలేరు. పదహారేళ్ల లోఉపు చిన్నారులే దీనికోసం పనిచేస్తారు. ఈ నేత చాలా సున్నితమైనందున చిన్నారుల లేత చేతులే నగిషీలను అల్లగలవు. తయారీకి 25రోజులు పడుతుంది.
దీనిని ధరిస్తే అప్పలమ్మ కూడా అప్సరసలా కనిపిస్తుందంటున్నారు ఉప్పాడవాసులు. మంత్రుల భార్యలు, సినిమాస్టార్లు దీనికోసం ఎగబడతారు. దీని ధర ఆరు వేల నుంచి లక్ష రూపాయల వరకు వుంటుంది. జాందాని చీరకు ఆదరణ పెరగటంతో ఇలాంటివే నకిలీ చీరలు పుట్టుకొస్తున్నాయి. దీంతో ఈ చీరల తయారీదారులు ఇబ్బందులు పడాల్సివస్తోంది. అసలు కన్నా నకిలీవే ఎక్కువ ఆకర్శనీయంగా ఉంటాయి.
అయితే అవి మూడు నాళ్ల ముచ్చటని కస్టమర్లకు తరువాత తెలిసివస్తోంది. కాని అప్పటికే జరిగే నష్టం జరిగిపోతుంది. అధికారులు చేనేత దుస్తులు ధరించాలనే నియమం ఉన్నా ..అది ఏమాత్రం అమలు కావటంలేదు. ఉప్పాడ నేత కార్మికులు కష్టపడి కనిపెట్టిన జాందానీవల్ల నాలుగు డబ్బులు సంపాదించుకునే సమయంలో నకిలీలు వారి పొట్టగొడుతున్నాయి. వీటిని అరికట్టకపోతే తమ పరిస్థితి అగమ్యగోచరమేనని నేతన్నలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Published Date : Wednesday, 13/7/2011 3:22 PM IST

Be the first comment of this article
| |
|||
|
Don't post rude or nasty comments. Ethnic slurs, personal insults and abuses are rather uncool. Criticise, but know where to draw the line. No point putting in personal details or links, we won't publish them. |