వైభవంగా శ్రీబుగ్గ జాతర
* వేలాదిగా తరలి వస్తున్న భక్తులు
కార్తీక పౌర్ణమి రోజున ప్రారంభమయి 15రోజులు సాగే బుగ్గ జాతర రంగారెడ్డి జిల్లాలో వైభవంగా సాగుతోంది. రామలింగేశ్వరస్వామిని పూజించి తరించేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తున్నారు. ఇది రంగారెడ్డి జిల్లా మంచాల మండలం ఆరుట్ల పరిధిలోగల అటవీ ప్రాంతంలో శ్రీ బుగ్గ రామలింగేశ్వరాలయం ఉంది. సరిగ్గా కార్తీక పౌర్ణమి రోజున ప్రారంభమయి 15రోజుల పాటు ఇక్కడ జాతర జరుగుతోంది. ఇక్కడ కబీర్, గురునానక్ ఙ్ఞాన మందిరం ఉండటం విశేషం. ఆనాడు శ్రీరాముడు, మహాశివుని పూజించడానికి ఏర్పాటుచేసుకున్న స్ధలమిది.
ఈ జాతరలో ఓ ప్రత్యేకత ఉంది. జాతర జరిగిన రోజుల్లో మాత్రమే తూర్పు కొండ చర్యయల నుంచి పవిత్ర జలం ప్రవహిస్తుంది. ఇలా తూర్పు నుంచి పడమరకు ప్రవహించేది ఒక్క వారణాసి కాశీ విశ్వనాధుడి సన్నిధిలో మాత్రమేనని ప్రతీతి. అందుకే ఈ స్వామిని కాశీనాధుడు, విశ్వనాధుడని కూడా పిలుస్తారు. వన భోజనాలు ఏర్పాటుచేయడం ఈ ఆలయంలో మరో ప్రత్యేకత. కోరిన కోర్కెలుతీర్చే స్వామిగా పేరొందిన స్వామిని దర్శించుకునేందుకు వేలాదిగా భక్తులు తరలివస్తుంటారు. అయితే సౌకర్యాలు కల్పించడంలో సర్కారు విఫలమవుతోందని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Published Date : Tuesday, 15/11/2011 5:08 PM IST

Be the first comment of this article
| |
|||
|
Don't post rude or nasty comments. Ethnic slurs, personal insults and abuses are rather uncool. Criticise, but know where to draw the line. No point putting in personal details or links, we won't publish them. |