బుద్దిగా ఉండండి - జల్సా చేసుకోండి
.jpg)
* మద్యం అమ్మకాలపై ఆంక్షలు
* రాత్రి 11 తర్వాత అమ్మితే లాఠిన్యమే!
* తాగి ఊగితే తోలు తీయడం ఖాయం
* న్యూసెన్స్ చేస్తే చిప్పకూడే
* న్యూఇయర్ \\\'అతి\\\'క్రమించకుండా రూల్స్
న్యూ ఇయర్ వేడుకలపై కాప్స్ ఫోకస్ చేస్తున్నారు. హైదరాబాద్ లో భారీ ఆంక్షలు విధించిన పోలీసులు, రూల్స్ క్రాస్ చేస్తే తాట తీస్తామని వార్నింగ్ ఇచ్చారు. అటు బార్లు,పబ్‌లపై ఓ కన్నేశారు. డ్రంక్ అండ్ డ్రైవర్స్ కోసం స్పెషల్ చెక్ పోస్టులు ఏర్పాటు చేస్తున్నారు. మరోవైపు రాత్రి ఫ్లై ఓవర్లు మూసేయడంతోపాటు భారీగా ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. నూతన సంవత్సర వేడుకలపై గ్రేటర్ పోలీసులు ప్రత్యేక దృష్టి పెట్టారు. నగర వ్యాప్తంగా పటిష్ట బందోబస్తు చర్యలు చేపడుతున్నారు. శాంతిభద్రతల పరిరక్షణ కోసం పలు ఆంక్షలు విధించారు.
ఎలాంటి అవాంచనీయ ఘటనలు చేటుచేసుకోకుండా నిఘా పెంచారు. ప్రధాన రహదారులలో 15 ప్రత్యేక చెక్ పోస్టులను, ముఖ్య కూడళ్లలో బారికేడ్లను ఏర్పాటు చేస్తున్నారు. ప్రత్యేకంగా నియమించిన సిబ్బంది తనిఖీలు నిర్వహిస్తున్నారు. డ్రంక్ అండ్ డ్రైవర్స్ కోసం చెకింగ్ స్పాట్ లు ఏర్పాటు చేశారు. మద్యం దుకాణాలకు రాత్రి 11గంటల వరకే సమయమిచ్చారు. ఆ తర్వాత అమ్మకాలు సాగిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరికలు జారి చేశారు. ఇక న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కు అర్ధరాత్రి ఒంటిగంటవరకే అనుమతిచ్చారు.
స్టేజీషోలతో పాటు ఇతరత్రా కార్యక్రమాలన్నింటిని నిర్ణిత సమయంలో ముగించాలని, నిబంధనలు అతిక్రమిస్తే తాటతీస్తామని వార్నింగ్ ఇస్తున్నారు నగర పోలీసులు. అటు నగర వ్యాప్తంగా భారీ ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. హుస్సెన్ సాగర్ పరిసరాలపై ప్రత్యేక నిఘా పెట్టిన ఖాకీలు, రాత్రి 10 గంటల తర్వాత ప్లై ఓవర్లను మూసేస్తున్నట్టు ప్రకటించారు. నెక్లెస్ రోడ్‌తో పాటు అప్పర్ ట్యాంక్ బండ్ పై రాకపోకలు నిషేదించారు. మరికొన్ని ప్రదాన మార్గాల్లో ట్రాఫిక్ ను మళ్లిస్తున్నారు. ఖైరతాబాద్ నుంచి నెక్లెస్ రోడ్, ఎన్టీఆర్ మార్గ్ వెళ్లె వాహానాలను రాజ్ భవన్ మీదుగా మళ్లిస్తున్నారు.
బీఆర్కే భవన్ నుంచి నెక్లెస్ రోడు వచే వెహికిల్స్ ను లక్డికపూల్ ,ఆయోద్య జంక్షన్ మీదుగా పంపిస్తున్నారు. ఇక లిబర్టి నుంచి సికింద్రాబాద్ వెళ్లే వాహనదారులు ఎంసీహెచ్ కార్యాలయం, రవీంద్రభారతి, ఆయోద్య జంక్షన్ మీదుగా వెళ్లాలని సూచించారు. ఖైరతాబాద్ మార్కెట్ నుంచి నెక్లెస్ రోడ్ వెళ్లే వారు మీరాటాకీస్ మీదుగా వెళ్లాలని తెలిపారు. మింట్ కంపౌడ్, సచివాలయం రహదారిని పూర్తిగా బంద్ చేస్తున్నారు. మరోవైపు శాంతియుత వాతావరణంలో వేడుకలు జరుపుకుని న్యూ ఇయర్ కు వెల్ కం చెప్పాలని నగర ప్రజలకు పోలీసులు సూచిస్తున్నారు. సో బీకేర్ ఫుల్ బ్రదర్స్ .....
Published Date : Saturday, 31/12/2011 4:32 PM IST

Be the first comment of this article
| |
|||
|
Don't post rude or nasty comments. Ethnic slurs, personal insults and abuses are rather uncool. Criticise, but know where to draw the line. No point putting in personal details or links, we won't publish them. |