నాణాలు,కరెన్సీ సేకరణ నాయుబ్ దినచర్యలో భాగం
* వివిధ దేశాల నాణాలను భావితరాలకు చూపాలనన తపన
* 90 దేశాలకు చెందిన నాణాలు, కరెన్సీ సేకరణ
అతనికి కష్టపడితే గానీ పూట గడవదు, ఆర్ధికంగా పేదవాడయినా ఏదో సాధించాలనే తపన...నిత్యం నాణాలు, కరెన్సీ నోట్ల సేకరణ ఆయన దినచర్యలో భాగం. వివిధ దేశాలకు సంబంధించిన నాణాలను సేకరించి వాటిని భావితరాలకు చూపాలన్న తలంపుతో ముందుకుపోతున్న వ్యక్తి. ఆయన సేకరించిన వివిధ దేశాల కరెన్సీ, నాణాలను మీరు చూడాలనుకుంటున్నారా? అయితే నెల్లూరు జిల్లాకు వెళ్లాల్సిందే. ఇతని పేరు మహ్మద్‌నాయుబ్.
శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా ఏఎస్ పేటమండలం అనుసముద్రం గ్రామానికి చెందిన ఇతను ముప్పయేళ్ల క్రితం కూలీ పనికోసం చైన్నై కి వెళ్లాడు. అక్కడే ఈయనకు కాయిన్స్ కలెక్షన్ హాబీగా మారింది. ఇప్పటి వరకు బ్రిటన్, సింగపూర్, మలెషియా, జర్మనీ, జపాన్ , భారత్ వంటి 90 దేశాల కరెన్సీ, నాణేలను సేకరించాడు.
వివిధ రాష్ట్రాల నైజాం పాలనకు చెందిన నాణాలను కూడా స్వీకరించడమే గాక మన దేశంలో మొట్టమొదట ముద్రించిన రూపాయిని కూడా సేకరించినాడు. ఇలాంటి నాణాల సేకరణను ప్రభుత్వం గుర్తించి ప్రోత్సహిస్తే అపూర్వమైన నాటి చిహ్నాల ఆనవాళ్లను భావితరాల వారికి అందించినట్లవుతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.
Published Date : Tuesday, 10/1/2012 5:11 PM IST

Be the first comment of this article
| |
|||
|
Don't post rude or nasty comments. Ethnic slurs, personal insults and abuses are rather uncool. Criticise, but know where to draw the line. No point putting in personal details or links, we won't publish them. |