అమలుకు నోచుకోని సంక్షేమ పథకాలు
* మొక్కుబడిగా కొనసాగుతున్న జవహర్ ఆరోగ్య బాల రక్ష
* ఆరునెలలైనా స్కూల్‌వైపు కన్నెత్తి చూడని వైద్య సిబ్బంది
* పథకాలు అమలయ్యేలా చర్యలు తీసుకోవాలంటున్నా గ్రామస్థులు
విద్యార్ధుల కోసం రాష్ట్రప్రభుత్వం ప్రవేశ పెడుతున్న వివిధ సంక్షేమ పథకాలు అమలుకు నోచుకోవడం లేదు. స్కూల్ పిల్లలకు వైద్య పరీక్షలు నిర్వహించేందుకు ప్రవేశపెట్టిన జవహర్ ఆరోగ్య బాల రక్ష శ్రీకాకుళంలో మొక్కుబడిగా కొనసాగుతోంది. నెలకొకసారి పిల్లలకు వైద్యపరీక్షలు నిర్వహించాల్సిన వైద్య సిబ్బంది ఆరునెలలు గడుస్తున్నా స్కూళ్ల వైపు కన్నెత్తి చూడడం లేదు.
ఇది శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలంలోని గోపీనాధపురం గ్రామంలోని మండల పరిషత్ ప్రాధమిక పాఠశాల. ఇక్కడ దాదాపు మూడొందల మంది విద్యార్ధులున్నారు. బడుగు బలహీన వర్గాల ప్రజలకు చెందిన పిల్లలు ఎక్కువగా ఇక్కడ విద్యను అభ్యసిస్తున్నారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన జవహర్ ఆరోగ్య బాల రక్ష పథకం జిల్లా వ్యాప్తంగా అమలు చెయ్యాలని ప్రభుత్వం జిల్లా విద్యాశాఖను ఆదేశించింది.
ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్ధులకు నెలకొకసారి వైద్య పరీక్షలు నిర్వహించి, ఉచితంగా మందులు కూడా పంపిణీ చెయ్యాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా గోపీనాధపురంలోని ప్రభుత్వ పాఠశాల్లో ఆరునెలల క్రితం వైద్యసిబ్బందిచే పిల్లలకు నామమాత్రపు వైద్యపరీక్షలు చేయించి పాఠశాల సిబ్బంది చేతులు దులుపుకున్నారు.
నెలకొకసారి వైద్య పరీక్షలు నిర్వహించాల్సి ఉండగా ఆరునెలలు గడుస్తున్నా ఈ స్కూల్ వంక వైద్యసిబ్బంది కన్నెత్తైనా చూడడం లేదు. ప్రభుత్వం పేద విద్యార్ధుల కోసం ప్రవేశ పెట్టిన ఈ పధకానికి సిబ్బంది నిర్వాకం వల్ల తూట్లు పడుతున్నాయి. ప్రభుత్వం స్పందించి జవహర్ ఆరోగ్యబాలరక్ష సక్రమంగా అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.
Published Date : Monday, 16/1/2012 5:17 PM IST

Be the first comment of this article
| |
|||
|
Don't post rude or nasty comments. Ethnic slurs, personal insults and abuses are rather uncool. Criticise, but know where to draw the line. No point putting in personal details or links, we won't publish them. |