శ్రీశైలం దేవస్థానం దొంగతనంపై మాక్ డ్రిల్
* సెక్యూరిటీ లోపాలపై లోతుగా అధ్యయనం
* విచారణను వేగవంతం చేసిన అధికారులు
శ్రీశైలం దేవస్థానంలో చోరీకి సంబంధించి విచారణను వేగవంతం చేశారు. దుండగులు ఆలయంలోకి ఎలా ప్రవేశించారన్న దానిపై మాక్ డ్రిల్ నిర్వహించారు. వారు సెక్యూరిటీ కళ్లుగప్పి లోనికి ఎలా వెళ్లారన్నదానిపై లోతుగా అధ్యయనం మొదలు పెట్టారు. దీనిద్వారా నిఘాలోపాలను గుర్తించాలన్నది సెక్యూరిటీ విభాగం ఆలోచనగా ఉంది. శ్రీశైలం దేవస్థానంలో ఇటీవలి దొంగతనం నిఘా వైఫల్యాన్ని కళ్లకు కట్టింది. దీంతో ఆలయ భద్రతపై సర్వత్రా ఆందోళన వ్యక్తం కావడమే గాకుండా విమర్శలు వెల్లువెత్తున్నాయి.
దీంతో భవిష్యత్‌లో మళ్లీ ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకునే పనిలో అధికారులు పడ్డారు. పట్టుబడ్డ దొంగలతోనే మాక్ డ్రిల్ నిర్వహించి దొంగతనం జరిగిన తీరును పరిశీలించారు. కమిటీ విచారణ జరుపుతోందని, నివేదిక వచ్చాక బాధ్యులపై చర్యలు తీసుకుంటామని ఇవో హన్మంతరావు తెలిపారు.
దొంతనం జరిగిన కళ్యాణ మండపాన్ని హిందూ దేవాలయాల పరిరక్షణ సమితి అధ్యక్షుడు కమలానంద భారతీ తీర్థస్వామి పరిశీలించారు. మొత్తానికి దొంగతనం వ్యవహారం ఇప్పుడు అధికారుల గుండెల్లో రైళ్లు పరుగెట్టిస్తోంది. సెక్యూరిటీ డొల్ల బయటపడడంతో తప్పులు దిద్దుకునే పనిలో పడ్డారు.
Published Date : Monday, 23/1/2012 4:49 PM IST

Be the first comment of this article
| |
|||
|
Don't post rude or nasty comments. Ethnic slurs, personal insults and abuses are rather uncool. Criticise, but know where to draw the line. No point putting in personal details or links, we won't publish them. |