Tv5 Telugu News Channel :: Latest Andhra News, Latest News in Telugu, Tollywood News and Gossips, India News, Picture Galore, Telugu Movie News, Latest Sports news, ICC World Cup 2011
 
""
logo tv5
Districts    >>
Adilabad
Ananthapur
Chittoor
Cuddapah
East Godavari
Guntur
Hyderabad
Karimnagar
Khammam
Krishna
Kurnool
Mahaboobnagar
Medak
Nalgonda
Nellore
Nizamabad
Prakasam
Rangareddy
Select One
Srikakulam
Vishakapatnam
Vizianagaram
Warangal
West Godavari

SocialTwist Tell-a-Friend
నాగర్‌కర్నూలు ఉప ఎన్నికల్లో రసవత్తరపోరు
AA

* ఎన్నికల బరిలో టీడీపీ అభ్యర్థిగా మర్రి జనార్థనరెడ్డి
* నాగం జనార్థనరెడ్డిపై మండిపడుతున్న ప్రజాప్రతినిధులు
* పరువు-ప్రతిష్టలకోసం రాజకీయనాయకులు తాపత్రయం


మహబూబ్‌నగర్ జిల్లా నాగర్‌కర్నూల్‌లో ఉప ఎన్నికల సెగ రగులుకుంటోంది. రాజకీయాల్లో చక్రం తిప్పిన నాగం జనార్ధన్‌రెడ్డితో.....యువ పారిశ్రామిక వేత్త మర్రి జనార్ధన్‌రెడ్డి తలపడేందుకు సిద్ధంకావడంతో అక్కడి రాజకీయం వేడెక్కింది. రాజకీయ పార్టీలు పరువును కాపాడుకునేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నాయి.

తెలంగాణా ఉద్యమ నేపథ్యంలో రాజకీయపార్టీల్లో మార్పు వచ్చినట్టుగానే... నేతల్లోనూ మార్పులొచ్చాయి. ఈ మార్పుల్లోనే నాగం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. దీంతో ఇక్కడే టిడిపికి కష్టాలు మొదలయ్యాయి. ఉప ఎన్నికలు త్వరలో జరుగబోతున్నాయి. తెలుగుదేశంపార్టీకి నాగం పై ప్రత్యర్థిని వెతుక్కోవడం మరో సమస్యగా మారింది.

ఎన్నికల బరిలో దింపేందుకు మేధోమదనం చేసి మర్రి జనార్థనరెడ్డిని తమ అభ్యర్థిగా దింపేందుకు టీడీపీ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. మహబూబ్‌నగర్ జిల్లాలో జరుగనున్న ఉప ఎన్నికల్లో అందరి దృష్టి నాగర్‌కర్నూల్ నియోజకరవ్గంపైనే ఉంది. ఒక్క సారిగా పారిశ్రామిక వేత్త జేసి బ్రదర్స్ అధినేత మర్రి జనార్ధన్‌రెడ్డి టీడిపి సైకిల్ ఎక్కడంతో....ఇక్కడ రాజకీయాలకు ఊపొచ్చింది.

పరువు కాపాడుకునేందుకు టీడిపి.... తన ప్రతిష్టను నిలుపుకునేందుకు నాగం జనార్ధన్‌రెడ్డి ప్రయత్నిస్తుండడంతో.... నాగర్‌కర్నూల్ నియోజకవర్గం రసవత్తరంగా మారింది. ఇన్నాళ్లు స్తబ్ధుగా ఉన్న ప్రజాప్రతినిధులందరూ....ఇప్పడు నాగంపై విరుచుకుపడుతున్నారు. నాగర్‌కర్నూలు ఉప ఎన్నికల్లో గెలుపు గుర్రాన్ని ఎవరెక్కుతారో వేచి చూద్దాం!

Published Date : Friday, 27/1/2012 4:15 PM IST