పునరావాస పనుల్లో నాణ్యతాలోపం
* పనులు పూర్తిగాకముందే దెబ్బతింటున్న వైనం
* అధికారుల పర్యవేక్షణలోపం
* ఎల్లంపల్లి శ్రీపాద ప్రాజెక్టు నిర్వాసితుల పాలిట శాపం
ఎల్లంపల్లి శ్రీపాద ప్రాజెక్టు నిర్వాసితులకోసం నిర్మిస్తున్న పునరావసం పనులు పనికి రాకుండా పోతున్నాయి. అధికారుల పర్యవేక్షణ లోపంతో పనుల్లో నాణ్యతకరవైంది. మొక్కుబడి పనులతో కాంట్రాక్టర్లు చేతులు దులుపుకున్నారు. నాసిరకపు పనులపై ఆందోళన వ్యక్తం అవుతోంది. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన జలయజ్ఞం రైతులకు మేలు చేయకపోయినా కాంట్రాక్టర్లకు జేబులు నింపింది.
ప్రాజెక్టు నిర్మణంలో భాగంగా ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాల సరిహద్దుల్లో మంచిర్యాల మండలం గూడిపేట వద్ద గోదావరి నదిపై నిర్మిస్తున్న ఎల్లంపల్లి శ్రీపాద సాగర్ ప్రజెక్టులో ముంపునకు గురౌతున్న నిర్వాసితులకు పునరావసం కల్పించడంకోసం 197ఎకరాల ప్రభుత్వ భూమిని 2730మందికి పంపిణి చేయడానికి రంగం సిద్దం చేసింది. పునరావాసం అభివృద్ధి పనులను కాంట్రక్టర్లకు అప్పగించింది.
అయితే ఈ పనులను రాజకీయాల్లో చక్రం తిప్పతున్న అధికారపార్టీకి చెందిన ఓ బడానాయకుడితో పాటు అయన అనుచరులు కాట్రక్టు పనులను చేజిక్కించుకుని పనులు చేస్తున్నారు. ఓ వైపు పనులు జరుగుతుండగానే ఒక వర్షానికి రోడ్లు కొట్టుకు పోగా, విద్యుత్ స్తంభాలు విరిగిపోయాయి.
వీటిసంగతి ఇలా ఉంచితే ఇప్పడిప్పడే నిర్మస్తున్న నిర్మాణపు పనుల్లో సైతం నాణ్యత కొరవడింది నిర్మస్తున్న మురికి కాలువలు ముసుకుపోతూ, కూలిపోతుండగా,కల్వర్టులు దెబ్బతిని కూలడానికి సిద్దంగా ఉన్నాయి. ప్రారంభానికి నోచుకోక ముందే పునరావాసం కాలనీ పనులు ఇలా ఉండటంతో నిర్వాసితుల్లో ఆందోళన వ్యక్తం అవుతోంది.
Published Date : Friday, 27/1/2012 4:45 PM IST

Be the first comment of this article
| |
|||
|
Don't post rude or nasty comments. Ethnic slurs, personal insults and abuses are rather uncool. Criticise, but know where to draw the line. No point putting in personal details or links, we won't publish them. |