నిజామాబాద్ జిల్లాలో మహిళల క్షీర విప్లవం
* ఆర్థిక స్వావలంబన సాధనలో సాఫల్యత
* పాడిపరిశ్రమతో లాభాలు గడిస్తున్న మహిళలు
* ప్రభుత్వం ఆర్థిక తోడ్పాటిస్తే మరిన్ని ఫలితాలు
ఎవరో వస్తారని ఏదో చేస్తారని వారు ఎదురు చూడలేదు. చేయి చేయి కలిపి నడుం బిగించారు. పాడి పరిశ్రమ ద్వారా క్షీర విప్లవాన్ని చేపట్టారు. ఆర్థిక ప్రగతి సాధించి అన్ని రంగాల్లోనూ రాణించాగలమని నిరూపిస్తున్నారు. లాభాల బాటలో పయనిస్తూ ఆర్థిక స్వావలంబనకు చేరువైన మహిళా సమాఖ్య సాధించిన ఫలితమిది. ఇది నిజామాబాద్ జిల్లా బాన్సువాడలోని పాలశీతలీకరణ కేంద్రం.
మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో 2007లో ఈ కేంద్రాన్ని నెలకొల్పారు. బీర్కూర్, పిట్లం, నిజాంసాగర్ మండలాల నుంచి 26 పాలసేకరణ కేంద్రాల ద్వారా ప్రతిరోజు 600 లీటర్ల పాలను సేకరిస్తున్నారు. మొత్తం 1127 మంది మహిళా పాల ఉత్పత్తి దారులు ఇందులో సభ్యులుగా కొనసాగుతున్నారు. ఇప్పటి వరకు 16లక్షల 50వేల లీటర్లు పాలను సేకరించారు. ఖర్చులు పోనూ ప్రస్తుతం 8 లక్షల ఆదాయంలో నడుస్తోంది. గ్రామ గ్రామాన పాల సేకరణ కేంద్రాలు ఏర్పాటు చేశారు.
ఒక్కో కేంద్రం 10వేల నుంచి లక్ష రూపాయల ఆదాయంతో నడుస్తోంది. గ్రామాల్లో పాల మిత్రలుగా ఏర్పాటైన మహిళలు రైతుల నుంచి పాలను సేకరిస్తున్నారు. ఐకెపి సహకారంతో మహిళా పొదుపు సంఘాల సభ్యులే స్వయంగా ఈ కేంద్రాన్ని నిర్వహిస్తున్నారు. ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ వందలాదఇ మందికి ఉపాధి కల్పిస్తున్నారు. ఇక సంఘ సభ్యులు బ్యాంకు రుణం ద్వారా గేదెలు కొనుగొలు చేసి పాల ఉత్పత్తితో ఆర్థికాభివృద్ది సాధిస్తున్నారు.
మేలిరకపు గడ్డిని పెంచి అదిలాబాద్, కరీంనగర్, కడప తదితర జిల్లాలకు ఎగుమతి చేస్తున్నారు. ప్రైవేటు డైరీల నుంచి పోటీని తట్టుకోడానికి ప్రభుత్వం నుంచి మరింత ఆర్థిక తోడ్పాటు అవసరమని మహిళాసంఘాలు కోరుతున్నాయి.
Published Date : Friday, 27/1/2012 5:00 PM IST

Be the first comment of this article
| |
|||
|
Don't post rude or nasty comments. Ethnic slurs, personal insults and abuses are rather uncool. Criticise, but know where to draw the line. No point putting in personal details or links, we won't publish them. |