యానాం రిజెన్సీ సిరమిక్స్ వద్ద ఉద్రిక్తత
* పోలీసుల అదుపులో ఉన్న కార్మికనేత మురళి మృతి
* ఆగ్రహంతో రెచ్చిపోయిన కార్మికులు
* ఆపరేషన్స్ ప్రెసిడెంట్ చంద్రశేఖర్‌పై దాడి
* దాడిలో చంద్రశేఖర్ మృతి
* రిజెన్సీ స్కూల్ బస్సులకు నిప్పు, ఆస్తుల ధ్వంసం
* ఫ్యాక్టరీలో నిప్పుపెట్టిన కార్మికులు
* అందినమేరకు లూటీ చేస్తున్న కార్మికులు
* కాకినాడ నుంచి అదనపు బలగాలు
యానాంలోని సిరామిక్స్ రెజెన్సీ కార్మికులు తలపెట్టిన ఆందోళన తీవ్ర ఉద్రిక్త పరిస్థితులకు దారి తీసింది. అగ్రిమెంట్ బాండ్లపై సంతకాలు పెట్టబోమంటూ ఫ్యాక్టరీ ముందు ఆందోళన చేస్తున్న వంద మంది కార్మికులను పోలీసులు అదుపులోకి తీసుకోగా వారిలో.. కార్మిక నేత మురళి అనుమానాస్పద స్థితిలో మరణించాడు. దీంతో కార్మికులు మరింత రెచ్చిపోయి విధ్వంసానికి దిగారు.
సంస్థకు చెందిన స్కూలు బస్సు, ఇతర వాహనాలను తగులబెట్టారు. ఆఫీసు ఫర్నిచర్ ధ్వంసం చేశారు. అడ్డుకోబోయిన పోలీసులనూ ప్రతిఘటించారు. పోలీస్ స్టేషన్ ను ముట్టడించేందుకు యత్నించడంతో పోలీసులు లాఠీఛార్జి చేసి.. గాల్లోకి కాల్పులు జరిపారు. ఈ ఘటనలో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. అటు, యాజమాన్యంపై ఆగ్రహంతో ఉన్న కార్మికులు కంపెనీ ఆపరేషన్స్ ప్రెసిడెంట్ చంద్రశేఖర్‌పై దాడికి పాల్పడ్డారు. తీవ్రంగా గాయపడ్డ ఆయన్ను కాకినాడ తరలించగా.. ఆయన చికిత్స పొందుతూ మరణించారు.
Published Date : Friday, 27/1/2012 5:18 PM IST

Be the first comment of this article
| |
|||
|
Don't post rude or nasty comments. Ethnic slurs, personal insults and abuses are rather uncool. Criticise, but know where to draw the line. No point putting in personal details or links, we won't publish them. |