అభివృద్ధికి నోచుకోని అందమైన గ్రామం
* కనీస వసతులులేని జివిఎమ్‌సి పరిధిలోని గ్రామం
అందమైన ప్రకృతిసోయగాలకు నిలయమైన ఆ గ్రామం అభివృద్ధి మాత్రం ఆమడదూరంలో ఉంది. గ్రేటర్ విశాఖ పరిధిలో ఉన్న ఆ గ్రమాస్తులు కనీస వసతులులేక అల్లాడుతున్నారు. వారి బాధలను పట్టించుకున్న నాథుడే కరువయ్యాడు. విశాఖ అందాలకు అద్దంపట్టే పర్యాటక ప్రాంతాల్లో శంభువానిపాలెం ఒకటి. నగరానికి ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ఊరు జివిఎమ్‌సి నాలుగవ వార్డు పరిధిలోకి వస్తుంది.
చుట్టూ విశాలమైన కొండలు ...అందమైన ప్రకృతి అందాలు దీని ప్రత్యేకత. తుంబరిగడ్డ చెరువు ...దట్టమైన ఫారెస్టు ఇక్కడకు వచ్చినవారికి తియ్యని అనుభూతినిస్తాయి. నాలుగు వందల జనాభాగల ఈ గ్రామానికి పాలకుల ఆదరణ కరువైంది. గ్రేటర్ విశాఖ పరిధిలో ఉన్నా కనీసం బస్ సౌకర్యం లేదు. ఏ చిన్నపనికైనా కనీసం ఎనిమది కిలో మీటర్లు నడిచి పి.ఎమ్. పాలెం వెళ్లాల్సిందే. దీంతో ఇక్కడి పిల్లలు విద్యకు కూడా దూరమవుతున్నారు.
ఉపాధి అవకాశాలు లేవు..వ్యవసాయానికి అవసరమైన మౌలిక వసతులు లేక సాగుచేయలేకపోతున్నారు. పారిశుధ్యం లోపంచి ప్రజలు అనారోగ్యంబారిన పడుతున్నారు. శంభువానిపాలెంను పర్యాటకంగా అభివృద్ధిచేసే దిశగా ప్రభుత్వం దృష్టిసారిస్తే గమ కష్టాలు గట్టుక్కెతున్నాయని ఆ గ్రామస్తులు ఆశాభావం వ్యక్తంచేస్తున్నారు.
Published Date : Friday, 27/1/2012 5:33 PM IST

Be the first comment of this article
| |
|||
|
Don't post rude or nasty comments. Ethnic slurs, personal insults and abuses are rather uncool. Criticise, but know where to draw the line. No point putting in personal details or links, we won't publish them. |