విజయనగరం జిల్లాలో అస్తవ్యస్థంగా ఉపాధి హామీ
* కాకి లెక్కలతో కాలక్షేపం చేస్తున్న అధికారులు
* ఆర్థిక ఇబ్బందులతో కూలీలు సతమతం
* విధిలేని పరిస్థితుల్లో పోరుబాటకు సమాయత్తం
ఉత్తుత్తి హామీ పథకంలా మారిన ఉపాధి హామీ పథకంపై కూలీలు విసిగి వేసారిపోయారు. పనులు లేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆకలికి తాళలేక పోరుబాట పట్టారు. విజయనగరం జిల్లాలో ఉపాధి హామీ కూలీల దయనీయస్థితిపై ప్రత్యేక కథనం. విజయనగరం జిల్లాలో ఈ ఏడాది సంభవించిన కరువు పరిస్థితులు అటు రైతులకు, ఇటు వ్యవసాయ కూలీలకు కడగండ్లు మిగిల్చాయి.
ఈ నేపథ్యంలో కూలీలను ఆదుకునేందుకు అధికారులు ఉపాధి హామీ పథకాన్ని కొనసాగిస్తున్నా, పనులు అంతంత మాత్రంగానే సాగుతున్నాయి. అస్తవ్యస్థంగా మారిన ఈ పథకం వల్ల కూలీలు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారు. జిల్లాలో నాలుగు లక్షల డబ్బైఏడు వేల ఉపాధి కార్డులను అధికారులు మంజూరు చేశారు. ప్రస్తుతం గ్రామాల్లో పండ్ల తోటలకు గట్లు వేయడం, సాగునీటి కాలువ, పంట కాలువలు తవ్వడం తదితర పనులు కూలీలకు కలగజేస్తున్నారు.
అయితే, అధికారులు ఈ పనులు కొన్ని శ్రమ శక్తి సంఘాలకే పరిమితం చేశారని, పనులు లభించని కూలీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు పనులు లభించినవారు కూడా గిట్టుబాటు ధర లభించడం లేదని వాపోతున్నారు. ఈ నేపథ్యంలో ఉపాధి హామీ పథకం పనులు పూర్తిస్థాయిలో కల్పించాలని కూలీలు పోరుకు దిగుతున్నారు. రైతు సంఘాలు కూలీలకు మద్దతుగా నిలుస్తున్నాయి. ఇప్పటికైనా అధికారులు పథకాన్ని సమర్థవంతంగా నిర్వహించకపోతే కూలీల పోరు ఉధృతం కావడం ఖాయం.
Published Date : Friday, 27/1/2012 5:34 PM IST

Be the first comment of this article
| |
|||
|
Don't post rude or nasty comments. Ethnic slurs, personal insults and abuses are rather uncool. Criticise, but know where to draw the line. No point putting in personal details or links, we won't publish them. |