బాసరకు వసంతపంచమి శోభ

* సరస్వతి ఆలయానికి భక్తజన ప్రవాహం
బాసర సరస్వతి ఆలయానికి భక్తులు పోటెత్తారు. వసంత పంచమి సందర్భంగా పిల్లలకు అక్షర శ్రీకారం చుట్టేందుకు వచ్చిన భక్తులతో ఆలయం కిటకిటలాడుతోంది. అటు రద్దీ పెరగడంతో ఆలయ అధికారులు భారీ ఏర్పాట్లు చేశారు. దక్షిణ భారతదేశంలో ప్రఖ్యాతి గాంచిన ఆదిలాబాద్ జిల్లా బాసర సరస్వతి దేవి ఆలయం వసంత పంచమి ఉత్సవాలకు ముస్తాబైంది.
సరస్వతి దేవి జన్మదినం సందర్భంగా భక్తులు పోటెత్తారు. దీంతో ఆలయం కిటకిటలాడుతోంది. మన రాష్ట్రంతోపాటు మహారాష్ట్ర, కర్నాటక, మధ్యప్రదేశ్‌ల నుంచి భక్తులు తండోపతండాలుగా తరలి వస్తున్నారు. ఇక ఉత్సవాల కోసం ఆలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. విద్యుత్ దీపాలతో ప్రత్యేకంగా అలంకరించారు. ఘాట్ రోడ్డుకు మరమ్మత్తులు చేసిన అధికారులు భక్తుల బస కోసం ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
అటు అక్షరభ్యాసం కోసం ప్రత్యేక క్యూలైన్లతో పాటు అదనంగా నాలుగు ప్రసాద కౌంటర్లు ఏర్పాటు చేశారు. ఇక వసంతపంచమి సందర్భంగా వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కల్గకుండా అన్ని చర్యలు తీసుకున్నామని ఆలయ ఈవో తెలిపారు. అక్షరభ్యాసం జరుపుకునే పిల్లలకు పాలు పండ్లు అందించనున్నట్లు చెప్పారు. అయితే టెంపుల్ కు భక్తులు భారీగా తరలిరావడంతో వ్యాపారులు సొమ్ము చేసుకుంటున్నారు.
పూజా సామాగ్రి ధరలను అమాంతం పెంచేసి నిలువుదోపిడికి పాల్పడుతున్నారు. ఇక లాడ్జీలు ముందే బుక్ కావడంతో వసతి కోసం భక్తులు పడరాని పాట్లు పడుతున్నారు. అటు గోదావరి తీరంలోనూ భద్రతా చర్యలు చేపట్టకపోవడంతో పుణ్యస్నానానికి వెళ్లె భక్తులు ప్రమాదం భారీన పడే అవకాశముందనే ఆందోళన వ్యక్తమవుతోంది.
వసంత పంచమి రోజున రద్ధీ ఉంటుందని తెలిసినా అధికారులు ముందస్తు చర్యలు చేపట్టలేదని భక్తులు ఆరోపిస్తున్నారు. మరోవైపు ఆలయం వద్ద ఎలాంటి అవాంచనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అటు ఆర్టీసీ రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి బాసరకు ప్రత్యేక బస్సులు నడుపుతోంది.
Published Date : Saturday, 28/1/2012 12:10 PM IST

Be the first comment of this article
| |
|||
|
Don't post rude or nasty comments. Ethnic slurs, personal insults and abuses are rather uncool. Criticise, but know where to draw the line. No point putting in personal details or links, we won't publish them. |