సంప్రదాయానికి విరుద్ధంగా మేడారం జాతర

* వేడుకలో విగ్రహారాధన, ధూపదీప నైవేద్యాలు
* కనిపించని కంకవనం, బంధీలైన గద్దెలు
ఒకప్పుడు కేవలం కోయ గిరిజనులు మాత్రమే జరుపుకునే మేడారం జాతరలో.. ఇప్పుడు కుల, మతాలతో సంబంధం లేకండా అందరూ.. గిరిజన దేవతలను కొలుస్తున్నారు. మారుమూల కోయగూడెంలో జరిగే జాతర ప్రపంచ ఖ్యాతిని ఆర్జించింది. ఇదంతా కోయలకు సంతోషం కిలిగించాలి. కానీ.. సమ్మక్క-సారలమ్మ వారసులైన ఆదివాసీల్లో ఆ ఆనందం ఏ మాత్రం కనిపించడంలేదు. కోయ జాతికే చెందిన స్థానిక MLA, మేడారం ట్రస్ట్‌బోర్డ్ చైర్మన్, చివరికి సమ్మక్క పూజారి కూడా అసంతృప్తితో ఉన్నారు.
కారణమేంటో మీరే చూడండి. ప్రతి రెండేళ్లకోసారి జరిగే సమ్మక్క-సారలమ్మ జాతరను ప్రభుత్వం 1996 నుంచి స్టేట్ ఫెస్టివల్‌గా నిర్వహిస్తోంది. అంతకుముందే మేడారం జాతరను, గద్దెల ప్రాంతాన్ని దేవాదాయశాఖ తన ఆధీనంలోకి తీసుకుంది. ప్రభుత్వమే జాతర ఏర్పాట్లు చేస్తూ భక్తులకు సౌకర్యాలు కల్పిస్తోంది. అయితే.. ఈ ఆనవాయితీ కాకతీయుల కాలం నుంచే ఉంది. కాకతీయ రాజుల చేతిలో మరణించిన సమ్మక్క-సారలమ్మ, గోవిందరాజు, పగిడిద్దరాజు, జంపన్నలను కోయజనం దైవంగా భావించడంతో వారిని ఓడించిన ఓరుగల్లు రాజులు కూడా వారి సంప్రదాయాన్ని గౌరవించారు.
ఆ తర్వాత మహ్మదీయులు, నిజాం రాజులు కూడా కోయల సంప్రదాయాన్ని గౌరవించడమే కాకుండా సమ్మక్క-సారలమ్మలకు స్వయంగా స్వాగతం పలికి, జాతర ఏర్పాట్లు చేశారు. కాకతీయులు శైవ మతానికి చెందినప్పటికీ, నిజాం రాజులు మహ్మదీయులైనప్పటికీ ఎక్కడా వారి మత ప్రభావం జాతరపై పడేదికాదు. పూర్తిగా కోయ గిరిజన సంప్రదాయం ప్రకారమే జాతర జరిగేది. ప్రభుత్వం స్టేట్ ఫెస్టివల్‌గా ప్రకటించినప్పటికీ, దేవాదాయశాఖ ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నప్పటికీ జాతర కోయ సంప్రదాయం ప్రకారమే జరగాలనే నిబంధన ఉంది.
దాని ప్రకారమే జరుగుతుంది కూడా. అయితే.. దేవాదాయశాఖ ఏర్పాట్ల పేరుతో చేస్తున్న అతి.. కోయలను ఇబ్బందిపెడుతోంది. తమ ఇంటి ఇలవేల్పులను కోయ గిరిజనులు ప్రతి రెండేళ్లకోసారి మాఘశుద్ధపౌర్ణమి రోజు కొలుచుకుంటారు. వనం నుంచి దేవతల ప్రతిరూపాలను డోలు వాయిద్యాల చప్పుడు మధ్య మేడారం గద్దెల వద్దకు తీసుకువస్తారు. కొబ్బరికాయలు, బంగారంగా పిలిచే బెల్లం, పసుపు, కుంకుమ, చీర, రవికే, బియ్యం, కజ్జూర సమర్పిస్తారు. మేకలు, కోళ్లను బలిస్తారు. ఈ వేడుకలో మతాచారాల ఊసుండదు.
వేద మంత్రోచ్చరణాలుండవు. దూపదీప నైవేద్యాలుండవు. భగవంతుడికీ, భక్తులకు మధ్య అనుసంధాన కర్తలు కూడా ఎవరూ ఉండరు. అదీ సంప్రదాయం. కానీ ఇప్పుడా సంప్రదాయం మంట కలుస్తోందని స్వయంగా కోయజాతికే చెందిన స్థానిక ఎమ్మెల్యే సీతక్క ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇతర గుళ్లలో పనిచేసిన అధికారులు మేడారాన్ని కూడా గుడిగానే భావించడంతో ముప్పు వస్తోందంటున్నారు. భక్తుల అవసరాల కోసం అనాదిగా వస్తున్న గిరిజన సంస్కృతి సంప్రదాయాలను కాలరాసే ప్రయత్నం ఈ జాతర సాక్షిగా జరుగుతోందని ఎమ్మెల్యే వాపోతున్నారు.
వీఐపీల కోసం, వారి రక్షణ కోసం చాలాసార్లు గిరిజన పూజారులను, గిరిజన ఆచారాలను పక్కనపెట్టి తమదైన హైందవ సంస్కృతిని ఇక్కడ పెంపొందించే పని పకడ్బంధీగా జరుగుతోందని, దీనిని క్రమేపీ సంస్కరించే ప్రయత్నం చేస్తామని సీతక్క అంటున్నారు. వాస్తవంగా కోయ సంప్రదాయంలో విగ్రహారాధనకు తావుండదు. గద్దెల వద్ద నమిలినారచెట్టు మొగరం, వెదురు బొంగులు మాత్రమే ఉంటాయి. కానీ దేవాదాయశాఖ.. గుడి చుట్టూ సమ్మక్క-సారలమ్మల విగ్రహాలు నెలకొల్పింది. సమ్మక్క-సారలమ్మలు వనదేవతలు కాబట్టి, వారిని కంకవనం కిందే ఉంచి పూజలు చేయడం ఆనవాయితీ.
కానీ ఇప్పుడు గద్దెలను ఎత్తైన గోడల మధ్య, ఇనుప కంచెల నడుమ బంధించారు. దీనివల్ల దేవతలు, దేవుళ్లను ప్రతిష్టించే సమయంలో భక్తులు కనీసం చూపుకు కూడా నోచుకోవట్లేదు. గద్దెల ప్రాంతమంతా ఒకప్పుడు కంకవనంతో నిండి ఉండేది. కానీ ఇప్పుడు కనీసం ఒక్క వెదురు మొక్క కూడా కనిపించడంలేదు. వనదేవతల పండుగను కాంక్రీటు గోడలు, ఇనుప చువ్వల మధ్య చేయడం కూడా ఆచార విరుద్ధమే అంటున్నారు స్థానికులు.
ప్రభుత్వం ముద్రించే పుస్తకాలు, పోస్టర్లు, బ్యానర్లు, శిలాఫలకాలపై కూడా సమ్మక్క-సారలమ్మల పేర్లకు ముందు శ్రీ అని పేర్కొనడం కూడా ఓ మతాచారాన్ని సూచిస్తున్నదనే విమర్శలున్నాయి. దూపదీప నైవేద్యంలాంటి ఆచారాలు కూడా ఉండవు. కానీ ఇప్పుడు గద్దెల వద్ద దీపాలు వెలిగించే సంప్రదాయ కొత్తగా వచ్చింది. తమ ఆచారాన్ని లక్షల మంది పాటించడం, గౌరవించడం సంతోషంగానే ఉన్నా.. వందల ఏళ్ల నుంచి వస్తున్న సంప్రదాయాన్ని పట్టించుకోకపోవడం బాధగా ఉందని ఆదివాసీ గిరిజన నాయకులు ఆవేదన చెందుతున్నారు.
జాతరను కేవలం ఒక వ్యాపార దృక్పథంతో చూస్తున్న ప్రభుత్వం హైందవ సంప్రదాయాన్ని క్రమక్రమంగా జాతరలో జొప్పిస్తోందని మరో గిరిజన నేత యుగంధర్ వాపోతున్నారు. కోయ గిరిజనుల జాతర ఇప్పుడు అందరి జాతరగా మారింది. కానీ ప్రభుత్వ అత్యుత్సాహం వల్ల, ఇతర మతాల ప్రభావం కారణంగా చివరికి కోయ గిరిజనులకు కాకుండా పోయే ప్రమాదమూ పొంచిఉంది.
Published Date : Saturday, 28/1/2012 12:28 PM IST

Be the first comment of this article
| |
|||
|
Don't post rude or nasty comments. Ethnic slurs, personal insults and abuses are rather uncool. Criticise, but know where to draw the line. No point putting in personal details or links, we won't publish them. |