కాఫీ రబ్బర్ సాగును పట్టించుకోని ఐటీడీఏ

* సర్కారు సహకారాన్ని ఆశిస్తున్న రబ్బర్ రైతులు
రబ్బరు, కాఫీ తోటల సాగుకు అనుకూలమైన విజయనగరం జిల్లా మన్యంలో అధికారుల ప్రోత్సాహం కరువైంది. గిరిజనాభివృద్ధి సంస్థ సహకారం కరువైందని ఏజెన్సీవాసులు వాపోతున్నారు. అధికారుల నిర్లక్ష్య వైఖరితో మన్యంలో రబ్బరు, కాఫీ తోటలు విస్తరించటంలేదని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. గిరిజనాభివృద్ధి సంస్థ తమను దుకోవటంలో విఫలమైంది గిరిపుత్రలులు ఆరోపిస్తున్నారు.
విజయనగరం జిల్లా పార్వతీపురం, సాలూరు, కురుపాం నియోజకవర్గాల పరిధిలోగల ఎత్తైన కొండలు రబ్బరు, కాఫీ తోటల సాగుకు అనుకూలమైన ప్రాంతాలు. కాని ఇక్కడ వీటి సాగు పెద్దగాలేదు. గుమ్మలక్ష్మీపురం, కురుపాం ఏజెన్సీలో కొందరు ఓ స్వచ్ఛంద సంస్థ సహకారంతో పదేళ్ల క్రితం రబ్బరుసాగు చేపట్టారు. దిగుబడి బాగా వుండటంతో ఈ రైతులు మంచి ఆదాయం పొందుతున్నారు.
అయితే రబ్బరు కొనేవారు లేకపోవటంతో విశాఖలో విక్రయిస్తూ దళారుల చేతిలో మోసపోతున్నారు. ఐటీడిఏ తమకు కొత్త మొక్కలు ఇవ్వాలని, రబ్బరు కొనుగోలు చేయాలని రైతులు కోరుతున్నారు. అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా ఫలితం లేకపోయిందని గిరిపుత్రులు వాపోతున్నారు. రబ్బరు చెట్లతోపాటు, వీటి నీడలో కాఫీ తోటలు పెంచవచ్చని రైతులు అంటున్నారు.
లాభదాయకమైన రబ్బరు , కాఫీ సాగును ప్రభుత్వం ప్రోత్సహిస్తే ఆర్థికంగా బాగుపడతామని ఆదివాసులు చెబుతున్నారు. ఇప్పటికైనా ఐటీడీఏ రబ్బరు కాఫీ తోటలసాగుకు ముందుకు వచ్చి తమను ఆదుకోవాలని గిరిజనులు కోరుతున్నారు.
Published Date : Saturday, 28/1/2012 5:09 PM IST

Be the first comment of this article
| |
|||
|
Don't post rude or nasty comments. Ethnic slurs, personal insults and abuses are rather uncool. Criticise, but know where to draw the line. No point putting in personal details or links, we won't publish them. |