ఆదిలాబాద్‌లో ఎన్నికల వాతావరణం
.jpg)
* ఉప ఎన్నికలకు సిద్థమైన రాజకీయ పక్షాలు
* గ్రామాల్లో నాయకుల పర్యటనలు
* సమస్యల పరిష్కారానికి హామీలు
ఉపఎన్నికలకు తేదీని ఖరారు చేయకముందే ఆదిలాబాద్ నియోజకవర్గంలో ఎన్నికల సందడి మొదలైంది. టిడిపి నుంచి బయటకు వచ్చిన ఎమ్మెల్యే జోగురామన్న రాజీనామాతో ఇక్కడ ఉపఎన్నిక అనివార్యమైంది. రాజకీయపార్టీలు ఉప ఎన్నికలపై దృష్టిసారించాయి. తెలంగాణా ఉద్యమాన్నే ప్రచారాస్త్రంగా చేసుకున్న పార్టీలు ప్రచార కార్యక్రమాలను ముమ్మరం చేశాయి. దీంతో నియోజకవర్గంలోని ప్రతి పల్లెలో ఇప్పడు ఎన్నికల వాతావరణమే కనిపిస్తోంది.
ఉపఎన్నికలకు ఎన్నికల కమీషన్ తేదీని ఖరారు చేయకముందే ఆదిలాబాద్ నియోజకవర్గంలో ఎన్నికల వేడి రాజుకుంటోంది. నేతల మద్య పోటీ పెరిగింది. ప్రధాన పార్టీలన్నీ పోటాపోటీగా గ్రామాల్లో పరోక్ష ప్రచారానికి దిగడంతో పల్లెల్లో ఎన్నికల వాతావరణం నెలకొంది. నేతల పర్యటనలతో గ్రామాల ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. తెలంగాణా రాష్ట్ర సాధనే ధ్యేయంగా ఏర్పడినట్లు చెప్పకుంటున్న టిఆర్‌ఎస్ ప్రచారంలో ఓ అడుగు ముందే ఉంది.
ఇటీవల పదవికి రాజీనామా చేసిన తాజామాజి ఎమ్మెల్యే జోగురామన్న టీఆర్‌ఎస్‌లో చేరడంతో ఉపఎన్నికల అభ్యర్థిగా అతడి పేరు దాదాపు ఖరారు చేసిన ఆ పార్టీ ఆయనతోనే ప్రచారాన్ని ముమ్మరం చేసింది. ఇక అధికార పక్షమైన కాంగ్రెస్ వ్యూహం వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది.
అన్ని పార్టీలు గ్రామాల్లో ముమ్మర ప్రచారాలు నిర్వహిస్తూ పరోక్షంగా ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటుంటే పార్టీ మాత్రం స్తబ్దుగా ఉండటం కొంత ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఎన్నికల ప్రకటనకు ముందే నేతలంతా గ్రామాలపై వాలడంతో అక్కడి జనం అవాక్కవుతున్నారు.
Published Date : Monday, 30/1/2012 3:44 PM IST

Be the first comment of this article
| |
|||
|
Don't post rude or nasty comments. Ethnic slurs, personal insults and abuses are rather uncool. Criticise, but know where to draw the line. No point putting in personal details or links, we won't publish them. |