పచ్చని మొక్కలను పెంచడం హాబీ
.jpg)
* ఇంటి పెరటినే ఔషధవనంగా మార్చిన ఇంజినీరు
* అరుదుగా లభించే ఔషధ మొక్కల పెంపకం
* గ్రామస్తులకు ప్రయోజనాలుకల్పిస్తున్న ఔషధ మొక్కలు
ఆయనకు మొక్కలంటే మక్కువ. అందులోనూ ఔషధ మొక్కలు మహా ఇష్టం. మొక్కలపై మక్కువతో హిమలయాల్లో సైతం పెరిగే మొక్కలను ఆయన తన పెరటిలో పెంచుతున్నాడు. దీంతో ఆయన పెరడు ఓ మినీ ఆయుర్వేద ప్లాంట్‌లా తయారైంది. ఈయన పేరు యుగపతి. వృత్తి ఖమ్మం జిల్లా పాల్వంచ కేటీపీఎస్‌లో ఎగ్జిక్యూట్ ఇంజనీర్. పచ్చని మొక్కలను పెంచడం చిన్నప్పటినుంచి అలవాటు. దీంతో తన పెరట్లో ఆయుర్వేద ఔషదాలకు కావలసిన రకరకాల మొక్కలు పెంచుతూన్నాడు.
చిన్నతనం నుంచి మొక్కలను అమితంగా అభిమానించే యుగపతి పాల్వంచ లో మినీ ప్లాంట్‌లా మొక్కలను పెంచుతున్నాడు. చాలా అరుదుగా దొరికే మొక్కలు సైతం యుగపతి వద్ద పెరుగుతున్నాయి. దాదాపు 40 రకాల ఔషధ మొక్కలు యుగపతి పెరటిలో కనిపిస్తాయి. ఎక్కడెక్కడినుంచో తచ్చిన మొక్కలను సేకరించి ఆయుర్వేద ఔషదాలకు ఉపయోగపడేలా మొక్కలు పెంచుతున్నాడు. ఈ ఔషదమొక్కల కోసం స్థానిక ప్రజలు నిత్యం యుగపతి ఇంటికి వస్తూనే ఉంటారు.
భారదేశంలోనే అరుదుగా కేవలం హిమాలయాల్లో మాత్రమే దొరికే బ్రహ్మకమలం, నాగార్జున అనే మొక్కలు సైతం ఈ పరిసరాల్లో పెంచడం విశేషం. రుద్రాక్ష, మాదిఫలం, లక్ష్మణఫలం, నేలవేమ, కుడపత్రి, తెల్లమహాభీర, చిత్రవలము, వర్తగ్రంధ, సరస్వతి, కొండేటికొమ్మ, రత్నపురుష, మారేడుగడ్డ, కదంబరి వంటి 40రకాలకుపైగా ఔషదమొక్కలు పెంచుతున్నాడు. భవిష్యత్తులో మరిన్ని మొక్కలు సేకరించాలనుకుంటున్నాడు. యుగపతిలాగా ఊరికో వనప్రేమికుడుంటే అన్నిగ్రామాలు పర్యావరణాన్ని పెంచి ఆరోగ్యకరవాతావరణాన్ని కల్పిస్తాయనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది.
Published Date : Monday, 30/1/2012 3:55 PM IST

Be the first comment of this article
| |
|||
|
Don't post rude or nasty comments. Ethnic slurs, personal insults and abuses are rather uncool. Criticise, but know where to draw the line. No point putting in personal details or links, we won't publish them. |