అంధకారంలో నారాయణపేట పట్టణం
.jpg)
* ట్రాన్స్ కో శాఖకు కోటి 86లక్షల రూపాయలు బకాయి
* నారాయణ పేట మున్సిపాలిటికి షాక్ ఇచ్చిన ట్రాన్స్ కో
* మున్సిపల్ అధికారుల తీరుపై స్థానికుల ఆగ్రహం
మహబూబ్ నగర్ జిల్లా నారాయణపేట మున్సిపాలిటీకి ట్రాన్స్ కో అధికారులు షాక్ ఇచ్చారు. కోట్ల రూపాయల విద్యుత్ బకాయిలు చెల్లించకపోవడంతో పవర్ కట్ చేశారు. మున్సిపల్ అధికారుల అవినీతికి పాల్పడుతూ బకాయిలు చెల్లించకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇది మహబూబ్ నగర్ జిల్లా నారాయణపేట్ పట్టణం. వందసంవత్సరాల క్రితం జిల్లాలోనే మొదటి మున్సిపాలిటీగా ఏర్పడిన ఈ పట్టణం ఇప్పుడు అంధకారంలో మగ్గుతోంది.
కొద్దికాలంగా కరెంట్ బిల్లులు చెల్లించకుండా మున్సిపాలిటీ అధికారులు విద్యుత్ శాఖకు పంగనామాలు పెడుతున్నారు. ఇప్పటి వరకు దాదాపు కోటి 86 లక్షల రూపాయలు బాకీ పడ్డారు. బకాయిలపై విద్యుత్ శాఖ ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పట్టించుకోలేదు. దీంతో పవర్ కట్ చేసి షాక్ ఇచ్చారు. విద్యుత్ అధికారులు కోత పెట్టడంతో నారాయణపేట పట్టణం అంధకారంలో మగ్గుతోంది.
మున్సిపల్ అధికారులు అవినీతికి పాల్పడుతూ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని స్థానికులు మండిపడుతున్నారు. ఇప్పటికైనా నిద్రమత్తులోజోగుతున్న అధికారులు మేల్కొని బకాయిలు చెల్లించి అంధకారం నుంచి విముక్తి కల్పించాలని స్థానికులు కోరుతున్నారు.
Published Date : Monday, 30/1/2012 3:57 PM IST

Be the first comment of this article
| |
|||
|
Don't post rude or nasty comments. Ethnic slurs, personal insults and abuses are rather uncool. Criticise, but know where to draw the line. No point putting in personal details or links, we won't publish them. |