కర్నూలుజిల్లాలో టమోటాల దిగుబడి ఆశాజనకం
.jpg)
* కిలో ముఫ్పైపసలకు పడిపోయిన టమోటా ధర
* కూలీలు గిట్టుబాటుకాని స్థితిలో టమోటా రైతులు
* టమోటారైతుల దిగాలు
నిన్నమొన్నటిదాకా ఆకాశాన్నంటిన టమోటాధరలు ఊహించనివిధంగా పడిపోయాయి. పెట్టుబడి కాదుకదా టోమోటాలు కోయడానికి కూలీలుకూడా గిట్టుబాటు కావడంలేదని రైతులు కుమిలిపోతున్నారు. మొన్నటిదాకా ముప్పైరూపాయలున్న టమోటాలు కిలో ఇప్పుడు ముప్పైపైసలకుపడిపోయాయి. దీంతో ఆర్థికంగా చితికిపోయిన టమోటా రైతులు ఖాళీచేతులతో ఇంటిముఖం పడుతున్నారు కర్నూలు పరిసరాల్లో టమోటాల దిగుబడులు ఆశాజనకంగా ఉండటంతో కష్టాలు గట్టెక్కుతాయని రైతులు ఎంతో ఆనందపడ్డారు.
వర్షాభావ పరిస్థితులనుంచి గట్టెక్కినప్పటికీ మార్కెట్లో ధరలు రైతులను నిరాశపరచాయి. అస్పరి, మద్దికెర, తుగ్గలి, ప్యాపిలి, దేవనకొండ, డోన్, బేతంచెర్ల,గూడూరు, సి.బెళగళ్, కోడుమూరు, గోనెగండ్ల, ఆత్మకూరు మండల పరిసరాల్లో టమోటాను విస్తారంగా పండించారు. టమోటాల దిగుబడి ఆశాజనకంగా ఉండటంతో మార్కెట్లో ధరలు అమాంతంగా పడిపోయాయి.దీంతో రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. మార్కెట్లో పతనమైన టమోటాల ధరలతో రైతులు కోలుకోని దెబ్బతో విలవిలలాడుతున్నారు. టమోటా సాగుతో నష్టపోయిన తమను ప్రభుత్వం ఆదుకోవాలని వేడుకుంటున్నారు.
Published Date : Tuesday, 31/1/2012 4:41 PM IST

Be the first comment of this article
| |
|||
|
Don't post rude or nasty comments. Ethnic slurs, personal insults and abuses are rather uncool. Criticise, but know where to draw the line. No point putting in personal details or links, we won't publish them. |