గుంతకల్లులో పారిశుధ్ధ్యం అధ్వాన్నం
.jpg)
* అనారోగ్యం పంచుతున్న పరిసరాల తీరు
* పరిశుభ్రతకు దూరం - రోతపుట్టిస్తున్న వీధులు
* మురికి కంపుతో ఇబ్బందిపడుతున్న జనం
అనంతపురంజిల్లా గుంతకల్లు మునిసిపాలిటీ అధ్వాన్నంగా తయారైంది. పారిశుద్ధ్యలోపం అధికారుల పనితీరుకు అద్దంపడుతోంది. లక్షలకు లక్షలు ప్రజాధనం వ్యయమవుతున్నా ఎలాంటి ప్రయోజనంలేకుందనే విమర్శలు వెల్లువెత్తున్నాయి. అధికారుల పర్యవేక్షణలోపంతో పారిశుద్ధ్య నిర్వహణ నానాటికీ తీసికట్టుగా మారుతోంది. గుంతకల్లు మునిసిపాలిటీ పరిసరాలు ప్రజానీకానికి అనారోగ్యాన్ని పంచుతున్నాయి. పారిశుద్ధ్యలోపం ప్రజారోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతోంది.
చెత్తాచెదారంతో నిండిన వీధులు, పరిశుభ్రతకు నోచని మురికి కాల్వలు అనారోగ్యాన్ని పంచుతున్నాయి. ఇంటింటికీ రెండు చెత్త బుట్టలిచ్చి వ్యర్థాలను సేకరించే ప్రతిపాదన అమల్లో సత్ఫలితాలనివ్వడంలేదనే విమర్శలున్నాయి. ఆర్టీసీ బస్టాండ్ పరిసరాల్లోని అపరిశుభ్రత వాతావరణం ఇక్కడి ప్రజానీకాన్ని అనారోగ్యపాల్జేస్తోంది. మురికికాల్వలు రోడ్లపైకి పొంగి రోతపుట్టిస్తున్నాయి. గుంతకల్లు వీధుల్లో కాలుమోపడానికి ఇబ్బంది పడాల్సి వస్తోందని ప్రజలు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.
వీధుల్లోని మురికినీటితో దోమలు, పందుల సంచారం ఎక్కువగా ఉందని గుంతకల్లువాసులు విచారం వ్యక్తం చేశారు. మునిసిపల్ అధికారులు గుంతకల్లు వీధుల్లో పర్యటించి పారిశుధ్ధ్యనిర్వహణ, మురికికాల్వల శుభ్రతకు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
Published Date : Tuesday, 31/1/2012 4:43 PM IST

Be the first comment of this article
| |
|||
|
Don't post rude or nasty comments. Ethnic slurs, personal insults and abuses are rather uncool. Criticise, but know where to draw the line. No point putting in personal details or links, we won't publish them. |