బ్రహ్మంగారు కాలజ్ఞానం రాసిన ప్రాంతం శిధిలమయం
* కాలగర్బంలో కలుస్తున్న కాలజ్ఞాన స్మృతులు
* కాలంచెల్లిన చింతచెట్టు
* శివాలయ అభివృద్ధిని పట్టించుకోని అధికారులు
పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి వారి కాలజ్ఞాన తత్వాల రచనకు వేదికైన ఆలయ పరిసరాలు దయనీయ స్థితిలో ఉన్నాయి. కాలజ్ఞాన రచనకు స్పూర్తి నిచ్చిన ప్రాంతంలో బ్రహ్మంగారి స్మృతులు శిధిలమైపోతున్నాయి.చరిత్రలో ప్రాచుర్యంపొందిన ప్రాంతా పరిరక్షణలో అధికారులు ఉదాసీనంగా వ్యవరిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తున్నాయి. ఇది వైఎస్‌ఆర్ కడపజిల్లా జమ్మలమడుగు మండలం పెద్ద కొమెర్ల. ఇక్కడి చెన్నకేశస్వామి, శివాలయాలు 14వ శతాబ్దంలో నిర్మించబడ్డాయి.
ఎంతో చారిత్రాత్మక నేపథ్యంగల ఈ రెండు ఆలయాల ఎదుటే ఓ చింత చెట్టు ఉంది. ఈ చెట్టుకిందే పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాములవారు తన కాలజ్ఞాన తత్వాల రచనలకు శ్రీకారం చుట్టారని చరిత్ర చెబుతోంది. బ్రహ్మంగారు తత్వబోధనలు చేస్తూ గ్రామాలు తిరుగుతూ ఓసారి కొమెర్లప్రాంతానికి వచ్చాడట. ఆ గ్రామంలోని తన బంధువుల ఇంటిలో కొన్నిరోజులు గడిపి అక్కడే గోవిందమాంబను వివాహం చేసుకున్నారు.
అప్పటినుంచి గ్రామంలోని ఆలయాలను కేంద్రంగా చేసుకొని అక్కడి చింతచెట్టు కిందే కాలజ్ఞానం రాసి వీరబ్రహ్మేంద్రస్వామి తర్వాత కాలంలో బ్రహ్మంగారి మఠంలో జీవసమాధి అయ్యారు. అయితే ఆయన స్మృతులు, ఎంతో విశిష్టత కలిగిన ఆలయాలను పట్టించుకునే నాధుడే కరువైయ్యారు. చెన్నకేశవ ఆలయానికి, శివాలయానికి ఉన్న మాన్యం భూముల గుత్తలను మాత్రం ఎండోమెంట్ అధికారులు వసూళ్లు చేస్తున్నారే గానీ ఆలయ అబివృద్ధి గురించి ఏమాత్రం పట్టించుకోలేదనే విమర్శలున్నాయి.
ఇక దాదాపు ౩౦౦ ఏళ్ల చరిత్ర ఉన్న చింతచెట్టును కూడా రక్షణ కరువైంది. ఎంతో ప్రాముఖ్యత ఉన్న కొమెర్లలోని బ్రహ్మంగారి గత స్మృతులను పర్యవేక్షించి ఇక్కడి క్షేత్రాలను అభివృద్ది చేయాల్సిన బాధ్యత మఠం నిర్వాకులకు, ఎండోమెంట్ అధికారులకు ఎంతైనా ఉంది.
Published Date : Tuesday, 31/1/2012 4:47 PM IST

Be the first comment of this article
| |
|||
|
Don't post rude or nasty comments. Ethnic slurs, personal insults and abuses are rather uncool. Criticise, but know where to draw the line. No point putting in personal details or links, we won't publish them. |