పాములు, తేళ్ల భయం లేదంటున్న గ్రామస్థులు

* గరత్మంతుడికి పూజలతో సమస్యకు పరిష్కారం
* పులిమివాండ్ల గ్రామస్థుల వింత నమ్మకం
కొంతకాలం క్రితం వరకు పాములు, తేళ్ల భయంతో నిద్ర కూడా పట్టని స్థితిలో ఉన్న ఆ గ్రామస్థులు ఇప్పుడు నిశ్చింతగా నిద్ర పోతున్నారు. ఇప్పుడు మచ్చుకైనా పాములు,తేళ్లు గ్రామాల్లోకి రావడం లేదని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇదంతా ఆ గరత్మంతుడి దయేనంటూ భక్తిభావం చాటుతున్నారు. అనంతపురం జిల్లా పులిమివాండ్ల గ్రామస్థుల ధీమా వెనక ఓ చిన్న ట్విస్ట్ ఉంది.
.గతంలో గ్రామంలో తరచూ ప్రజలు పాముకాటుతో మరణిస్తుండేవారు. పాముల బెడద తట్టుకోలేక కొందరు ఊరు వదిలి పారిపోయిన ఘటనలూ ఉన్నాయి. ఇలా ఎన్నాళ్లని పాముకాటుకు గురవుతామని గ్రామస్థులంతా ఆలోచనచేశారు. మెరుపులాంటి ఆలోచన వచ్చిన ప్రజలకు, పాములను చంపేది గరత్మంతుడేనన్న విషయాన్ని పురాణాల ద్వారా తెలుసుకున్నారు. .
అనుకున్నదే తడవుగా తమిళనాడు నుంచి ఓ గరత్మంతుడి విగ్రహం తెచ్చి ప్రతిష్టించారు. ఇక అప్పటి నుంచి స్వామికి పూజలు చేయడంతో పాములు, తేళ్లు మాయమయ్యాయని అంటున్నారు. ఇప్పుడు అవి తమ గ్రామ పొలిమేరల్లోకి కూడా రావడం లేదంటున్నారు. మంత్రాలతో పని లేకుండా కేవలం విగ్రహం పెట్టి పూఇంచడం వల్లనే తాము పాముకాటు నుంచి విముక్తులమయ్యామని వారు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.
Published Date : Tuesday, 31/1/2012 5:39 PM IST

Be the first comment of this article
| |
|||
|
Don't post rude or nasty comments. Ethnic slurs, personal insults and abuses are rather uncool. Criticise, but know where to draw the line. No point putting in personal details or links, we won't publish them. |