జాతరకు మేడారం ముస్తాబు

* ఇవాళ మేడారానికి సీఎం కిరణ్
* భారీ ఏర్పాట్లు చేసిన అధికారులు
వన దేవతల జాతరకు మేడారం సర్వాంగ సుందరంగా మారింది. సమక్క-సారలమ్మలు గద్దెకు చేరుకోకముందే భక్తులు పోటెత్తుతున్నారు. సమక్క-సారలమ్మ జాతరను ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఇవాళ సందర్శించనున్నారు. సీఎం రాక సందర్బంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సమ్మక్క-సారలమ్మ జాతరకు మేడారం ముస్తాబైంది.
ఈనెల 8 నుంచి 11 వరకు జరిగే జాతరకు ప్రభుత్వ అన్ని ఏర్పాట్లు చేసింది. జిల్లా మంత్రులు పొన్నాల లక్ష్మయ్య, బస్వరాజు సారయ్యతో పాటు జిల్లా కలెక్టర్ రాహుల్ బొజ్జా, ఎస్పీ రాజేష్‌కుమార్ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఇవాళ మేడారం రానున్నారు. సీఎంతో పాటు మంత్రులు డికె అరుణ, బాలరాజు, శ్రీధర్‌బాబు, రామచంద్రయ్య, ఎంపీలు, ఎమ్మెల్యేలు జాతరకు తరలి రానున్నారు. జాతరకు సీఎం వస్తుండటంతో ఏర్పాట్లు ముమ్మరమయ్యాయి.
జాతర ప్రాంగణంలో పర్మినెంట్ హెలిప్యాడ్‌ను నిర్మించారు. ముఖ్యమంత్రి జాతరలో తిరిగే ప్రాంతాలను పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. డాగ్‌స్వ్కాడ్, బాంబ్ స్క్వాడ్‌లతో అణువణువు తనిఖీ చేస్తున్నారు. ఓ వైపు తెలంగాణవాదుల నిరసనలు... మరోవైపు నక్సల్ ప్రభావిత ప్రాంతం కావడంతో ఎలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు డేగకళ్లతో భద్రత చర్యలు తీసుకుంటున్నారు.
Published Date : Wednesday, 1/2/2012 1:01 PM IST

Be the first comment of this article
| |
|||
|
Don't post rude or nasty comments. Ethnic slurs, personal insults and abuses are rather uncool. Criticise, but know where to draw the line. No point putting in personal details or links, we won't publish them. |